మరియం మిర్జాఖనీ (జననం: మే 1977) యునైటెడ్ స్టేట్స్ లో పనిచేస్తున్న ఒక ఇరానియన్ గణిత శాస్త్రజ్ఞురాలు. ఈమె సెప్టెంబర్ 1, 2008 నుండి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఈమె గణితశాస్త్రానికి నోబెల్ పతకంలా భావించే ఫీల్డ్స్ పతకాన్ని గెలుచుకుంది. ఈ అవార్డును ప్రారంభించిన 80 ఏళ్లలో ఈ పతకాన్ని సాధించిన తొలి మహిళ ఈమె. ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ ఈ పతకాన్ని అందిస్తుంది. నలభై సంవత్సరాల లోపు వయస్సు వారికి మాత్రమే ఇచ్చే పతకాన్ని ఎనభై ఏళ్లలో 55 మందికి లభిస్తే అందులో తొలి మహిళ మరియం మిర్జాఖనీ, అంతేకాకుండా ఫీల్డ్స్ పతకాన్ని అందుకున్న మొదటి ఇరానీయులు కూడా ఈమే.

మరియం మిర్జాఖనీ
225px
జననంPersian: مریم میرزاخانی
మే 1977 (age 42–43)[1]
టెహ్రాన్, ఇరాన్
నివాసంపాలో ఆల్టో, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్
జాతీయతఇరానియన్[1]
రంగములుగణిత శాస్త్రవేత
విద్యాసంస్థలు
 • ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం
 • స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
పూర్వ విద్యార్థి
 • షరీఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (BS)
 • హార్వర్డ్ విశ్వవిద్యాలయం (PhD)
పరిశోధనా సలహాదారుడు(లు)కర్టిస్ టి. మెక్‌ముల్లెన్[2][3][4]
ముఖ్యమైన అవార్డులు

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

మిర్జాఖనీ 1977 లో ఇరాన్లోని తెహ్రాన్ నగరంలో జన్మించింది. అక్కడే నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్సెప్షనల్ టాలెంట్స్ (NODET), ఫర్జనేగాన్ అనే చోట ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకొంది. 1994 లో, మిర్జాఖనీ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్ లో బంగారు పతకాన్ని సాధించింది. అలా సాధించిన మొట్టమొదటి మహిళా విద్యార్థి ఆమె. 1995 అంతర్జాతీయ మ్యాథమెటికల్ ఒలంపియాడ్ లో, నూటికి నూరు శాతం స్కోరు సాధించి రెండు బంగారు పతకాలు సాధించిన ఇరానియన్ విద్యార్థిగా ఖ్యాతి గడించింది.[5][6][7]

1999 లో ఆమె షరీఫ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి గణితంలో బీయస్సీ చేసింది. తరువాత గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 2004 లో డాక్టరేటు సాధించింది. అక్కడ ఆమె ఫీల్డ్స్ పురస్కార గ్రహీత అయిన కర్టిస్ మెక్ ముల్లన్ పర్యవేక్షణలో పనిచేసింది. 2004 లోనే క్లే మ్యాథమాటిక్స్ ఇన్స్ స్టిట్యూట్ లో పరిశోధకురాలిగా, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉండింది.

మరణంసవరించు

2013 లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ సోకింది. అది నెమ్మదిగా ఆమె ఎముక మజ్జలోకి ప్రవేశించగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి జులై 14, 2017 న మరణించింది.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 Mirzakhani, Maryam. "Curriculum Vitae" (PDF). మూలం (PDF) నుండి 24 November 2005 న ఆర్కైవు చేసారు. Retrieved 13 August 2014. Cite web requires |website= (help)
 2. మరియం మిర్జాఖనీ at the Mathematics Genealogy Project
 3. Mirzakhani, Maryam. "CurriculumVitae" (PDF). మూలం (PDF) నుండి 29 August 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 12 August 2014. Cite web requires |website= (help)
 4. Jonathan, Webb (2014). "First female winner for Fields maths medal". BBC News. Retrieved 13 August 2014. Cite web requires |website= (help)
 5. మూస:IMO results
 6. "Iranian woman wins maths' top prize". New Scientist. 12 August 2014. Retrieved 13 August 2014.
 7. Newhall, Marissa (13 September 2005). "'Brilliant' minds honored: Maryam Mirzakhani". USA Today.