మరుగు దొడ్డి మల విసర్జనానికి ఉపయోగించే గది. ఈ సౌకర్యంలేని వారు బయలు ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారు. దీని వలన నీరు, గాలి కాలుష్యమై విరేచనాలు, జీర్ణాశయ వ్యాధులు పెరిగి, లక్షల మంది ప్రతి సంవత్సరము చనిపోతున్నారు.

ఫ్లష్ టాయిలెట్ బౌల్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి పిల్లల, విద్యా నిధి 2010 నివేదిక ( త్రాగు నీరు, శానిటేషన్ ప్రగతి) [1] సేకరించిన 2008గణాంకాల ప్రకారం, మల విసర్జన బయలు ప్రదేశాలలో చేసేవారు 1.1బిలియన్లు. 58 శాతం భారత దేశానికి చెందినవారు. ఇంకొక కోణంనుండి చూస్తే, భారతదేశంలో 54 శాతం మందికి (638 మిలియన్ల మందికి) మరుగు దొడ్డి సౌకర్యం లేదు.మన దేశం సిగ్గు పడేటట్లుగా ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత ఇండోనేషియా (58 మిలియన్లు), చైనా (50 మిలియన్లు) ఉన్నాయి. ఈ గణాంకం భారత పట్టణ ప్రాంతాలలో 18 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 69 శాతంగా ఉంది. ప్రపంచంలో 1990 లో దాదాపు 25 శాతం మంది బయలు ప్రదేశాలలో మల విసర్జన చేయగా, 2008 కి, అది 17 శాతానికి తగ్గింది. ప్రపంచంలో 751 మిలియన్ల మంది సామాజిక మరుగుదొడ్లు వాడుతున్నారు.

పూర్తి పారిశుధ్యతా పధకం ద్వారా, భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సబ్సిడీలు కల్పించి, ఈ విషయంలో కృషి చేస్తున్నది. 100 శాతం పారిశుధ్యతని సాధించిన గ్రామాలకి, నిర్మల్ గ్రామ పురస్కార్ [2] ప్రోత్సాహక బహుమతులు అందచేస్తున్నది.

వనరులు మార్చు

  1. "త్రాగు నీరు,శానిటేషన్ ప్రగతి" (PDF). Archived from the original (PDF) on 2012-05-09. Retrieved 2010-04-10.
  2. నిర్మల్ గ్రామ పురస్కార్ వార్త, ఆంధ్రప్రదేశ్ పత్రిక ఏప్రిల్ 2010[permanent dead link]