మరుపూరు కోదండరామిరెడ్డి
మరుపూరు కోదండరామిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు అనువాదకులు.
జీవిత విశేషాలు
మార్చుమరుపూరు కోదండరామిరెడ్డి నెల్లూరు జిల్లా మినగల్లుకు చెందినవాడు. అతను 1902 అక్టోబర్ 3న కామమ్మ, కొండారెడ్డి దంపతులకు జన్మించాడు. అతని అన్న పిచ్చిరెడ్డి. అతని అక్క పొణకా కనకమ్మ సంఘసేవిక. ఆమె 1920కల్లా దేశసేవలో పుట్టింటి ఆస్తిని, మెట్టింటి ఆస్తిన్తి వ్యయం చేయడంతో కోదండరామరెడ్డి బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో విద్యాభ్యాసం చేసి, మద్రాసులో జస్టిస్ పార్టీ పత్రిక సమదర్శినిలో చేరాడు. మందాకిని పత్రికకు సంపాదకత్వం వహించాడు.
కోదంరామిరెడ్డి అక్క కనకమ్మ కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకొన్నాడు కానీ సంతానం కలగనందున, శంకరమ్మను పునర్వివాహం చేసుకొన్నాడు. రుక్మిణమ్మ జాతీయోద్యమంలో, దేశసేవలో గడిపి, 20సంవత్సరాలు పినాకిని సత్యాగ్రహాశ్రమంలో సేవచేస్తూ గడిపింది. కోదండరామరెడ్డి నెల్లూరులో ప్రభాత ప్రెస్ ను తన అక్క సహాయంతో నెలకొల్పి, రంధ్రాన్వేషి పేరుతో తెలుగు పత్రికను కొద్దికాలం నిర్వహించాడు. కొంతకాలం నెల్లూరు వారపత్రిక జమీన్ రైతులో పనిచేసాడు. కొద్దికాలం సినిమారంగంలో ఉన్నాడు. 1954లో నెల్లూరులో మందాకినీ వారపత్రిక, దానితోపాటు మందాకిని పవర్ ప్రెస్ నెలకొల్పి దాదాపు పదేళ్లు నిర్వహించాడు.
కోదండరామరెడ్డి సావర్కర్ హిందూపద్ పాదుషాహిని, షిరిడీసాయిభగవాన్ మీద విదేశీయుడి రచనను, అనువదించి ముద్రించాడు. విక్టర్ హ్యూగో లే మీసరబుల్స్ ను , తమిళం నుంచి శిలప్పదికారం నవలను అనువదించి ప్రచురించాడు. శిలప్పదిగారం అనువాద నవల ఆంధ్రప్రేదేశ్ ఎస్.ఎ.స్ఎల్. సి పరీక్షల్లో ఉపవాచకంగా నిర్దేశించబడడంతో అనేక ముద్రణలు పొందింది.
కోదండరామరెడ్డి రాజాజీ నెలకొల్పిన అప్పటి ప్రతిపక్ష పార్టీ స్వతంత్రపార్టీ రాజకీయాలను, విధానాలను సమర్ధించడానికి మందాకిని పత్రికను కొనసాగించాడు. నెల్లూరులో జమీన్ రైతు కాంగ్రెస్ రాజకీయాలను సమర్ధిస్తే, ఈయన ప్రతిపక్షాన్ని సమర్దిస్తు మందాకినిని కొనసాగించాడు.
నార్ల వెంకటేశ్వరరావు ఇంగ్లీషులో రచించిన Vemana through westren eyes గ్రంథాన్ని వేమన-పాశ్చాత్యులు పేరుతొ అనువదించి, ముద్రించి విద్యానగర్ విద్యాసంస్థల స్థాపకుడు నేదురుమల్లి బాలకృష్ణారెడ్డికి అంకితం చేసాడు. కోదండారంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యలుగా, విశిష్ఠ సభ్యులుగా చాల కాలం కొనసాగి సేవలందించాడు. అకాడమీ మాండలిక పదకోశానికి సంపాదకుడుగా వ్యవహరించాడు. లోకకవి వేమన వేమనమీద అయన రచన. మహాభారతంలో కర్ణుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించి 'కర్ణ' పుస్తకం రాసాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయన సాహిత్యసేవకు గుర్తింపుగా కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. కోదాండారామరెడ్డికి కవి తిక్కన భారతం అంటే చాలా అభిమానం. నెల్లూరులో తిక్కన మీద ఉపన్యాసాలు ఏర్పాటుచేసి తిక్కన తిరునాళ్ల పేరుతొ పెద్ద గ్రంథం ప్రచురించాడు. కోదండరామరెడ్డి నెల్లూరులోను, ఇతర ప్రదేశాల్లో దేశ నాయకుల ఆంగ్ల ఉపన్యాసాలను గంభీరమైన కంఠంతో చక్కని తెల్గులో అనువాదం చేశాడు. అవేదికమెడ పెద్ద పెద్ద నాయకుల ఉపన్య్సాలను అనువాదం చేశాడు. కోదండరామరెడ్డి సంభాషణా చతురుడు, హాస్య ప్రియుడు. అయన మాటల్లో రచనల్లో నెల్లూరు మాండలిక పదాలు తరచూ దొర్లుతాయి. కోదండరామరెడ్డి కొంతకాలం ఇళ్ళు కట్టి అమ్మాడు. నాడార్ ఇల్లు, కామగిరి, అపర్ణ ఇళ్ళనను గొప్ప ఈస్థటిక్ సెన్సుతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు. 11952-56 నడుమ నెల్లూరులో పెన్నమీద వంతెన నిర్మాణంలో వంగల్లు కోదండరామరెడ్డితో కలిసి స్తంభాల నిర్మాణ కాంట్రాక్టు చేసాడు. ఆయన బ్రతుకుదెరువుకు కొద్దికాలం నెల్లూరులో 'నందనం' అనే భోజన హోటల్ కూడా నిర్వహించాడు. కోదండరామరెడ్డికి ఆంధ్రదేశంలో ఎందరో మిత్రులు, ఎన్నెన్నో చోట్ల సన్మానాలు, గౌరవాలు అందుకొన్నాడు!
కోదండరామరెడ్డికి ఆశాలత, తరుణేందుశేఖర్ రెడ్డి సంతానం. కోదండరామారెడ్డి పూర్ణజీవితం గడిపి 92వ ఏట అశువులుబాశాడు.
రచనలు
మార్చు- హిందూపద్ పాదషాహి[1] (అనువాదం. మూలం:సావర్కర్)
- షిర్ది సాయిభగవాన్[2] (అనువాదం మూలం:ఆర్థర్ ఆస్‌బోర్న్)
- జవహర్ లాల్ నెహ్రూ ఇందిరకు వ్రాసిన లేఖలను రేఖామాత్రము గా అనువదించి "జగత్తు పుట్టుపూర్వోత్తరాలు" అనుపేర ధారావాహికగా 1928లోను తిరిగి 1941లోను జమీన్ రైతు పత్రికలో ప్రచురించారు.[3] దీనిని కొంతవిస్తరించి "ప్రపంచ పరిణామము" (1946)[4] (అనువాదం మూలం:జవహర్ లాల్ నెహ్రూ)-జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన లేఖలు పుస్తకరూపంగా ముద్రించారు.
- తిక్కన భారతము: కర్ణ పర్వము[5] (సంపాదకుడు)
- లోకకవి వేమన
- వేమన - పాశ్చాత్యులు[6]
- మాండలిక పదకోశము (సంపాదకత్వం)
- కంబమహాకవి[7] (మోనోగ్రాఫ్ అనువాదం)
పురస్కారాలు
మార్చుఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం.
ఆధారాలు
మార్చు- కోదండరామిరెడ్డి ముద్రిత గ్రంథాలు,
- మందాకిని, జమీన్ రైతు వారపత్రికలు,
- నెల్లూరు జిల్లా సర్వస్వము,
- పొణకా కనకమ్మ స్వీయచరిత్ర కనకపుష్యరాగం,2011.
- విగ్జానసర్వస్వము, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ,1988.
మూలాలు
మార్చు- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1945). హిందూపద్ పాదషాహి.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1960). షిర్ది సాయిభగవాన్ (1 ed.). నెల్లూరు: మందాకిని హంసమాల.
- ↑ కోదండరామిరెడ్డి, మరుపూరు (10 జనవరి 1941). "జగత్తు పుట్టుపూర్వోత్తరాలు" (PDF). జమీన్ రైతు.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1946). ప్రపంచ పరిణామము (1 ed.). పెరంబూర్, మద్రాసు: కల్చరల్ బుక్స్ లిమిటెడ్.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1972). తిక్కన భారతము: కర్ణపర్వము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
- ↑ ఆయాస్య (22 December 1971). "కొత్త పుస్తకాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 72. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 28 November 2016.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కంబమహాకవి పుస్తకప్రతి