ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)), భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో 1926లో ఏర్పడింది. ఏర్పడింది. 1925 నాటి మద్రాసు విశ్వవిద్యాలయం అనుసరించి ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. రావు బహదూర్ సర్ అన్నెపు పరశురామ్ దాస్ పాత్రో ఈ విషయం లో కృషి చేశారు. గౌరవ సూచకంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం ప్రాంగణంలో పాత్రో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.[1] 1926 నుండి 1931 వరకు, మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ ఆదర్శ విశ్వవిద్యాలయం ఊహకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం
రకంసార్వత్రిక
స్థాపితంఏప్రిల్ 26,1926
వైస్ ఛాన్సలర్జి. నాగేశ్వరరావు
రెక్టర్డి.గాయత్రి
డీన్కె.రామమోహన రావు
స్థానంవిశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుయుజిసి
జాలగూడుhttp://www.andhrauniversity.edu.in
ఆంధ్ర విశ్వవిద్యాలయం భవనాలు

1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయంగా అవతరించింది.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణం (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయ పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాల కొరకు ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో ఎచ్చెర్ల, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయనగరంలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. విశ్వవిద్యాలయ నాణ్యతకు గుర్తింపు నాక్ (NAAC) సంస్థ ఇచ్చిన "ఎ" గ్రేడు.

విశ్వవిద్యాలయ చిహ్నం

మార్చు
 
ఆంధ్ర విశ్వవిద్యాలయం
  • ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్‌రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహనశాస్త్రి రూపకల్పన చేశాడు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి, చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి "నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి.[2]

ప్రత్యేకతలు

మార్చు
 
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యోగ విలేజ్
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశం లోనే మొదటిసారిగా 1934 నుండే కామర్సులో ఆనర్సు డిగ్రీ మొదలుపెట్టింది, 1957లో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎంబిఎ కోర్సును ప్రవేశపెట్టింది.[3]
  • ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం).
  • మానవ వనరులను, సాఫ్టువేరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మధ్యనే (2008 నుండి) "స్కూల్ ఆఫ్ ఐటి" అనే సంస్థను నెలకొల్పింది.[4]

కళాశాలలు

మార్చు
 
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గేట్
 
ఆంధ్ర విశ్వవిద్యాలయం అకాడమిక్ స్టాఫ్ కాలేజ్

ఉపకులపతులు

మార్చు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా:

క్రమసంఖ్య ఉపకులపతి పేరు పనిచేసిన కాలం ఇతర వివరాలు
1 కట్టమంచి రామలింగారెడ్డి 26-04-1926 నుండి 19-07-1930 మొట్టమొదటి ఉపకులపతి
2 సర్వేపల్లి రాధాకృష్ణన్ 20-07-1930 నుండి 19-05-1936
3 కట్టమంచి రామలింగారెడ్డి 20-05-1936 నుండి 07-12-1949
4 వాసిరెడ్డి శ్రీకృష్ణ 08-12-1949 నుండి 16-06-1961
5 అప్పడవేదుల లక్ష్మీనారాయణ 17-06-1961 నుండి 30-06-1966
6 కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు 01-07-1966 నుండి 29-11-1968
7 లంకపల్లి బుల్లయ్య 30-11-1968 నుండి 12-12-1974
8 మేకా రంగయ్య అప్పారావు 13-12-1974 నుండి 12-12-1980
9 ఆవుల సాంబశివరావు 13-12-1980 నుండి 14-11-1983
10 కోనేరు రామకృష్ణారావు 05-06-1984 నుండి 23-03-1988
11 కనిశెట్టి వెంకటరమణ 24-03-1988 నుండి 23-03-1991
12 మద్ది గోపాలకృష్ణారెడ్డి 18-09-1991 నుండి 15-09-1997
13 ఆర్.రాధాకృష్ణ 22-04-1998 నుండి 04-03-2001
14 వై. సి. సింహాద్రి 03-04 -2002 నుండి 02-04-2005
15 ఎల్. వేణుగోపాలరెడ్డి 06-05-2005 నుండి 03-05-2008
16 బీలా సత్యనారాయణ 20-06-2008 నుండి 19-11-2011
17 జి.ఎస్.ఎన్.రాజు 05-02-2013 నుండి 16-07-2016
18 జి.నాగేశ్వరరావు 17-07-2016 నుండి
19
20 పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి 19-07-2019 నుండి ప్రస్తుతం

కళా ప్రపూర్ణ

మార్చు

కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది, విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.

ప్రచురణలు

మార్చు

తెలుగు పుస్తకాలు

మార్చు

ఆంగ్ల పుస్తకాలు

మార్చు
  • The Simhachalam Temple (1969)
  • A Descriptive Catalogue of the Telugu Manuscripts (1999)

ర్యాంకింగులు

మార్చు

ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ధా ఆధారంగా 2023వ సంవత్సరం లో మొత్తం భారతదేశం వ్యాప్తంగా 76వ ర్యాంకు పొందింది ,[5] మొత్తం విశ్వవిద్యాలయాలలో 43వ ర్యాంకు పొందింది [6], ఇంజనీరింగ్ ర్యాంకింగ్ లో 94 వ ర్యాంకు పొందింది [7].

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఎ. పి. పాత్రో
  2. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో విశ్వవిద్యాలయ చిహ్నం Archived 2007-05-27 at the Wayback Machine గురించి వివరిస్తున్న పేజీనుండి మే 21, 2007న సేకరించబడింది.
  3. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్‌సైటులో కళలు , కామర్సు కళాశాల పేజి నుండి మే 21, 2007న సేకరించబడింది.
  4. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్‌సైటులో స్కూల్ ఆఫ్ ఐటి Archived 2008-05-10 at the Wayback Machine గురించి. ఏప్రిల్ 23, 2008 న సేకరించబడింది.
  5. "ఓవరాల్ ర్యాంకింగ్".
  6. "అమొంగ్ ఉనివెర్సితిఎస్".
  7. "ఇంజనీరింగ్ ర్యాంకింగులు".

బయటి లింకులు

మార్చు