మరూల నూనెకొవ్వు ఆమ్లాలు కల్గిన శాక నూనె.మరూల నూనెను మరూల గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.మరూల నూనె కొవ్వు ఆమ్లాలతో పాటు యాంటి ఆక్సిడెంట్ లను కల్గి ఉంది. మరూల నూనెలో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి మరూల గింజల మెత్తని పప్పు నుండి ఉత్పత్తి చేసింది. మరొకటి మరూల గింజ యొక్క వెలుపలి పెంకు వంటి పొట్టు భాగం నుండి ఉత్పత్తి చేసింది. మరూల నూనెను వంటలలో,, మాంసాహాన్ని నిలువ వుంచుటకు, తోళ్ళ పరిశ్రమల్లో తోళ్లను పదును పెట్టుటకు ఉపయోగిస్తారు. మరూల నూనెను సంప్రదాయ పద్ధతుల్లో కాస్మెటిక్స్ (సౌందర్య ద్రవ్యాలు) లలో కూడా ఉపయోగిస్తారు.

మరూల నూనె

మరూల చెట్టుసవరించు

మరూల చెట్టు అనకార్డేసి కుటుంబానికి చెందినది.మరూల వృక్షశాస్త్ర పేరు క్లేరోకారియా బిర్రే (Sclerocarya birrea).చెట్టు ఏకకాండం కల్గి పై భాగం కీరిట ఆకారంలో విస్తరించి వుండును.గ్రే రంగు బెరడు వుండును.చెట్టు 18 మీటర్ల ఎత్తు పెరుగును.సాధారణంగా తక్కువ ఎత్తు వున్న ప్రాంతాలలో, పెరుగును.ఈ చెట్లు ఆఫ్రికా, మెడాగాస్కరు ప్రాంతాలలో వ్యాపించి ఉంది.

మరూల నూనెసవరించు

నూనె లేత పసుపు రంగులో వుండును.మరూల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు,, సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.మరూల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు,, సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.ప్రత్యేకమైన వాసన ఉంది.

నూనెలోని కొవ్వు ఆమ్లాలుసవరించు

మరూల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువశాతంలో,, సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువ శాతంలోవున్నవి. నూనెలో ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లం ఒలిక్ ఆమ్లం ఎక్కువ పరిమాణంలో ఉంది. ఒలిక్ ఆమ్లం 70-78% వరకు ఉంది. ద్విబంధమున్న లినోలిక్ ఆమ్లం 4 నుండి 7% వరకు ఉండగా, మూడు ద్విబంధాలున్న ఆల్ఫా లినోలినిక్ ఆమ్లం 0.3-0.7% వరకు ఉంది.నూనెలో పామిటిక్, స్టియరిక్, అరచిడిక్ సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.[1]

వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 పామిటిక్ ఆమ్లం 9–12%
2 స్టియరిక్ ఆమ్లం 5.0–8.0%
3 అరచిడోనిక్ ఆమ్లం 0.3-0.7
4 ఒలిక్ ఆమ్లం 70–78%
5 లినోలిక్ ఆమ్లం 4.0–7.0%
6 అల్ఫా లినోలినిక్ ఆమ్లం 0.1–0.7%)

నూనె భౌతిక గుణాలు[2]సవరించు

వరుస సంఖ్య భౌతిక గుణం పరిమితి విలువలు
1 రంగు లేత పసుపు
2 విశిష్ట గురుత్వం,15 °C వద్ద 0.91–0.92
3 సపొనిఫికేసను విలువ 188–199

ఉపయోగాలుసవరించు

  • చర్మ రక్షణిగా పనిచేయును.దేహమర్దనకు ఉపయోగిస్తారు.

ఇవికుడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Hore, D. (2004). Formulation of cosmetic skin lotions using Adansonia digitata and Sclerocarya birrea oil from Zimbabwe. University of Zimbabwe, Harare.
  2. Hall, J.; et al. (2002). Sclerocarya birrea: a monograph. Publication Number 19. School of Agricultural and Forest Sciences, University of Wales, Bangor.
"https://te.wikipedia.org/w/index.php?title=మరూల_నూనె&oldid=2990726" నుండి వెలికితీశారు