స్టియరిక్ ఆమ్లం

స్టియరిక్ ఆమ్లం (Stearic acid ; IUPAC name octadecanoic acid) 18 కార్బనులు కలిగిన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 16CO2H. దీనికి స్టియరిక్ ఆమ్లం అనేపేరు గ్రీకు భాష లోని στέαρ ( "stéatos" అనగా టాలో (Tallow) నుండి వచ్చింది. దీనిలవణాలు, ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు.

స్టియరిక్ ఆమ్లం[1]
Stearic acid.svg
Stearic-acid-3D-balls.png
పేర్లు
IUPAC నామము
Octadecanoic acid
ఇతర పేర్లు
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [57-11-4]
పబ్ కెమ్ 5281
డ్రగ్ బ్యాంకు DB03193
SMILES CCCCCCCCCCCCCCCCCC(=O)O
ధర్మములు
C18H36O2
మోలార్ ద్రవ్యరాశి 284.48 g·mol−1
స్వరూపం white solid
సాంద్రత 0.847 g/cm3 at 70 °C
ద్రవీభవన స్థానం 69.6 °C (157.3 °F; 342.8 K)
బాష్పీభవన స్థానం 383 °C (721 °F; 656 K)
0.0003 g/100 mL (20 °C)
వక్రీభవన గుణకం (nD) 1.4299
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
స్టియరిక్ ఆమ్లానికి మూలమైన టాలో (Tallow).

స్టియరిక్‌ ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న, ఏటువంటి ద్విబంధాలు లేని, సరళ (straight) హైడ్రొకార్బను శృంఖలం కలిగివున్న మోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం. కొవ్వుఆమ్లం ఒక చివర ఒక కార్బొక్సిల్ప్‌ గ్రూప్‌ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వు ఆమ్లంలను మోనోకార్బలిక్‌ ఆమ్లం లందురు. లారిక్‌, పామిటిక్‌ సంతృప్త ఆమ్లంల తరువాత విస్తృతంగా జంతు కొవ్వులలో, క్షీరదాల పాలలో, శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వు ఆమ్లం స్టియరిక్‌ ఆమ్లం. జంతుకొవ్వులలో 35-60% వరకు, శాకనూనెలలో 5-45% వరకు స్టియరిక్‌ ఆమ్లం లభించును. స్టియరిక్‌ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును. ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును, వేడిచేసిన పారదర్శకంగా ద్రవంగా మారును, శాకకొవ్వులైన కొకోబట్టరు, షియా (shea) బట్టరులో, కొకమ్ (kokam), సాల్వ (sal) కొవ్వులలో అధికమొత్తంలో లభించును.

ధర్మాలుసవరించు

'స్టియరిక్‌ ఆమ్లం భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక

భౌతిక/రసాయనిక ధర్మం విలువలమితి
అణుభారం 248.48
ద్రవీభవన ఉష్ణోగ్రత 69.60C
మరుగు ఉష్ణోగ్రత (512mm/Hg) 355.20C
సాంద్రత (800Cవద్ద) 0.8390
వక్రీభవన సూచిక (800C వద్ద) 1.4299
స్నిగ్థత mPa.s (800C వద్ద) 7.79
వెలుగు ఉష్ణోగ్రత 1910C
స్వీయదహన ఉష్ణోగ్రత 3950C

స్టియరిక్‌ ఆమ్లంను కలిగివున్న జంతు కొవ్వులు, శాక కొవ్వులు/నూనెలుసవరించు

జంతుకొవ్వులు

కొవ్వురకం శాతం
మటన్‌ టాలో 33-34
బీఫ్‌టాలో 19-20
లార్డ్ 13.5
చికెన్‌బ్రెస్ట్, స్కిన్‌లెస్ 8.3

శాకకొవ్వులు/నూనెలు

నూనె శాతం నూనె శాతం నూనె శాతం
కొకొబట్టరు 35-36 సాల్‌కొవ్వు 43-45 మామిడి పిక్కలు 35-37
కొకమ్ 80-87 ధుపా 45-47 ఇప్ప నూనె 20-25
హెంప్ (hemp) 1.0-3.0 షియా 40-41 తంబ 9-10
నువ్వులు 4-5 కొపక్ 5-9 వేరుశనగ 1.0-3.0
మొక్కజొన్న 2.0-2.5 కొబ్బరి 1.0-3.0 పత్తిగింజలు 2.0-2.5

స్టియరిక్‌ ఆమ్లంను ఉత్పత్తి చేయుటసవరించు

  • జంతు కొవ్వులలో స్టియరిక్‌ ఆమ్లం ట్రైస్టియరిన్‌గా వుండును. అందుచే జంతుకొవ్వులను 'హైడ్రొలిసిస్' చెయ్యడం వలన స్టియరిన్‌ ఆమ్లం ఉత్పత్తి అగును. అయితే ఇందులో అల్పప్రమాణంలో ఇతర కొవ్వుఆమ్లాలు వుండును.
  • స్టియరిక్‌ ఆమ్లం అధిక శాతంలో కలిగివున్న శాకకొవ్వుల నూనెలోని కొవ్వుఆమ్లాలను, హైడ్రొలిసిస్ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా విడగొట్తి, కొవ్వు ఆమ్లాలను అంశిక స్వేదనం (fractional distillation) చెయ్యడం ద్వారా స్టియరిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును. నూనెలోని కొవ్వుఆమ్లాల కార్బనుల సంఖ్య తేడా 2 గా వుండటం వలన వాటి మరుగు ఊష్ణోగ్రతలో తేడా తగినంతగా వుండటం వలన అంశీక స్వేదనం వలన వేరు చెయ్యవచ్చును.
  • సులభంగా స్టియరిక్‌ ఆమ్లాన్ని తయారుచేయు మరో పద్థతి 'ఉదజనీకరణ' (hydrogenation). ఒలిక్‌ ఆమ్లమును సంపూర్ణ ఉదజనీకరణ (Total hydrogenation) చేయడం వలన ఒలిక్‌ ఆమ్లంలోని ద్విబంధం హైడ్రొజను సంయోగం వలన తొలగింపబడును. శుద్ధీచేసిన ఒలిక్‌ ఆమ్లంకు, నికెల్‌ కెటలిస్ట్ సమక్షంలో, వత్తిడిలో హైడ్రొజను కలిపిన, ఉదజనికరణ జరిగి ఒలిక్‌ ఆమ్లం స్టియరిక్‌ అమ్లంగా మారును.
  • పారిశ్రామిక రంగంలో వంటకు వుపయుక్తం కాని శాకనూనెలను నూనెలను ఉదజనీకరణ చేసి తయారైన ఉదజనికృత కొవ్వు (hydrogenated fat) ను స్టియరిక్‌ ఆమ్లం పేరుతో అమ్మకం చేస్తారు. ఉదజనీకరణ వలన ఎర్పడిన స్టియరిక్‌ ఆమ్లం తెల్లగా, గట్టిగా ముద్దగా వుండును. దీనిని పౌడరుగా, లేదా ఫ్లేక్స్‌గా చేసి బస్తాలలో నింపెదరు.

వినియాగంసవరించు

  • స్టియరిక్‌ ఆమ్లంతో తయారుచేసిన సబ్బులు (సోడియం స్టియరేట్) గట్టిగా వుండటం వలన టాయ్‌లెట్ సబ్బులు, బార్‌ సోపులు తయారుచేయుదురు.
  • స్టియరిక్‌ ఆమ్లాన్ని అధిక శాతంలో కలిగివున్న కొకొ బట్టరు, సాల్‌ బట్టరు, వంటివాటిని, మార్గరినులు, చాకోలెట్‌లు, బేకింగ్‌ ప్రొడక్ట్స్ తయారిలో వుపయోగిస్తారు.
  • రబ్బరును మృదువుగా వుండునట్లు చేయుటకు రబ్బరుపరిశ్రమలో వినియోగిస్తారు.
  • ఎక్కువసేపు నిలచి మండేగుణం వుండటం వలన కొవ్వొత్తులతయారిలో వినియోగిస్తారు.
  • షేవింగ్‌ క్రీములలో, ఎయిరొల్ (aerol) లలో బాగానురుగు నిచ్చెటందుకు వాడెదరు.
  • మిఠాయి (candies) ల తయారిలోను వాడెదరు.
  • బాణాసంచ (fire works) తయారిలో వినియోగిస్తారు.
  • మాత్రల (Tablets) తయారిలో 'బైండరు'గా స్టియరిక్‌ ఆమ్లాన్ని వినియోగిస్తారు. స్టియరిక్‌ ఆమ్లం మాత్రలలోని ఔషధ పదార్థంలను దగ్గరిగా పట్టివుంఛడమే కాకుండగా, గొంతులో సులువుగా జారెటట్లు చేయును

మూలాలుసవరించు

  1. Susan Budavari, ed. (1989). Merck Index (11th ed.). Rahway, New Jersey: Merck & Co., Inc. p. 8761. ISBN 9780911910285.

బయటి లింకులుసవరించు