మల్కాపురం (విశాఖపట్నం)

విశాఖపట్నం జిల్లా,విశాఖపట్నం పట్టణ మండలం లోని గ్రామం

మల్కాపురం, విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది.మల్కాపురం ప్రాంతానికి దగ్గరలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ నెలకొల్పబడి ఉంది.విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన గ్రామం.

మల్కాపురం
మల్కాపురం is located in Andhra Pradesh
మల్కాపురం
మల్కాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
పిన్ కోడ్ 530011
ఎస్.టి.డి కోడ్
మల్కాపురం రోడ్

ప్రయాణ సౌకర్యాలు

మార్చు

విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుండి మల్కాపురానికి కేవలం 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అలాగే విశాఖ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 11 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సెయింట్ జోసఫ్ సెకండరీ స్కూలు, సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదలైనవి మల్కాపురం లో ఉన్నాయి. మహాలక్ష్మి టాకీస్ పేరుతో ఒక సినిమా థియేటర్ కూడా ఉంది. కానీ ప్రస్తుతం అది మూతబడింది. ఈ ప్రాంతానికి పోస్టు ఆఫీసు సౌకర్యం ఉంది. అలాగే ఇక్కడి నుండి గాజువాక, సింహాచలం, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కే బీచ్, అనకాపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

బస్సు సౌకర్యం, బస్సు నెంబర్లు

మార్చు

400 - ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, నేవల్ డాక్ యార్డు, సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, 55 - సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, ఎయిర్ పోర్టు, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సింహాచలం, 600 - సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, గంట్యాడ, కూర్మన్నపాలెం, లంకెలపాలెం, అనకాపల్లి

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

ఈ ప్రాంతంలో సెయింట్ ఆన్స్ ఆసుపత్రి ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతి పంపుల ద్వారా నీరు అందుతుంది.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

మల్కాపురంలో ఆంధ్రా బ్యాంకు సౌకర్యం ఉంది. ఇదే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న శ్రీహరిపురంలో కెనెరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మరో పరిసర ప్రాంతమైన సింథియాలో ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

ఈ ప్రాంతంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రికల పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం, ఆటల మైదానం, పోలీసు స్టేషన్ కూడా ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం కూడా అమలవుతోంది. అలాగే గుడివాడ అప్పన్న కళ్యాణ మండపం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం సౌకర్యం కూడా ఉంది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ కార్మికుల కోసం యారాడ పార్కు పేరుతో రెసిడెన్షియల్ క్వార్ట్సర్సును కూడా నిర్మించారు.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు