మల్టియా-సెబష్టియా జిల్లా
ఎరెబుని, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరంలో పశ్చిమ భాగాన ఉంది. 2011. గణాంకాల ప్రకారం ఈ ప్రాంతంలో 132,900 మంది నివసిస్తున్నారు.
మల్టియా-సెబష్టియా
Մալաթիա-Սեբաստիա | |
---|---|
Coordinates: 40°10′26.10″N 44°26′44.79″E / 40.1739167°N 44.4457750°E | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం) | యెరెవన్ |
Government | |
• జిల్లా మేయర్ | అర్తక్ అలెక్శాన్యా |
విస్తీర్ణం | |
• Total | 26 కి.మీ2 (10 చ. మై) |
Elevation | 950 మీ (3,120 అ.) |
జనాభా (2011 జనాభా) | |
• Total | 1,32,900 |
• జనసాంద్రత | 5,100/కి.మీ2 (13,000/చ. మై.) |
Time zone | UTC+4 (AMT) |
మల్టియా-సెబష్టియాకు సరిహద్దులుగా ఉత్తరాన అజప్న్యాక్, దక్షిణాన షెంగావిత్, తూర్పున కెంట్రాన్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాకు తూర్పున అర్మవీర్, అగ్నేయాన అరరట్ రాష్ట్రాలు ఉన్నాయి.[1]
ఈ ప్రాంతం పేరు ఆధునిక ప్రపంచ టర్కీలోని మాజీ ప్రధాన ఆర్మేనియన్ స్థావరాల నుండి ఉద్భవించింది. అవి మలట్యా, సివాస్.
మల్టియా-సెబష్టియా అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది, అవి: నార్ మల్టియా, జొరవార్ ఆంధ్రానిక్, షాహుమ్యాన్, అరరట్యాన్, హఘ్తనాక్.
చరిత్ర
మార్చు1925లో, పశ్చిమ ఆర్మేనియన్ జెనోసైడ్ నుండి చారిత్రాత్మక నగరమైన మలట్యా (నేటి టర్కీ) లోనుంచి ప్రాణాలతో బయటపడినవారు యెరెవాన్ నగరానికి పశ్చిమ భాగంలో మల్టియాను కనుగొన్నారు. వారు స్థిరపడ్డ రెండు సంవత్సరాల తరువాత, మటియాకు ఉత్తరాన ప్రధానంగా చారిత్రాత్మక నగరమైన సెబష్టియాలోని మారణహోమం నుండి ప్రాణాలతో బయటపడిన వారు సెబస్టియాను నిర్మించారు. 1940లో నగరాన్ని విస్తరించినప్పుడు, మల్టియా, సెబష్టియాతో పాటు చుట్టు ప్రక్కల కొన్ని ప్రదేశాలను నగరంలో కలిపారు. 1945 లో, నగరంతో ఈ జిల్లాను కలపడానికి విక్టరీ వంతెనను నిర్మించారు. అడ్మిరల్ ఇసకోవ్ వంతెన నుండి కూడా జిల్లాలోకి ప్రవేశించారు.
1996 లో, మల్టియా, సెబష్టియాలను మల్టియా-సెబష్టియాగా కలిపారు. దానిని యెరెవాన్ లోని పన్నెండు జిల్లలలో భాగం చేశారు.
ఈ జిల్లా సెబష్టియన్ పట్టు ఫ్యాక్టరీ, రావు మార్స్ మెటల్ ఫ్యాక్టరీ లకు నిలయం. జ్వార్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం మల్టియా-సెబష్టియా శివార్లలో జిల్లాకు నైరుతి దిక్కున ఉంది.
వీధులు, ఆనవాళ్లు
మార్చుప్రధాన వీధులు
మార్చు- అడ్మిరల్ ఇసకోవ్ వీధి.
- రఫ్ఫీ స్ట్రీట్ వీధి.
- సెబష్టియా వీధి.
- టిచినా వీధి.
- ఆర్నో బబజేనియన్ వీధి.
- జొరావర్ ఆంధ్రానిక్ వీధి.
- డేనియల్ వరుజాన్ వీధి.
- గుస్సాన్ షేరం వీధి.
ఆనవాళ్లు
మార్చు- పవిత్ర దేవుని తల్లి చర్చి
- హోలీ ట్రినిటీ చర్చి
- యెరబ్లర్ సైనిక శ్మశానం, పవిత్ర అమరవీరుల వర్టనాంట్స్ చాపెల్
- హోలీ క్రాస్ రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి (నిర్మాణంలో ఉంది)
- పేట్రియాటిక్ యుద్ధం మెమోరియల్ పార్కు
- యువత పార్కు
- వహాన్ జటిక్యాన్ పార్కు
- మలాటియా గార్డెను
- మెటర్నిటీ పార్కు
- లవ్ అండ్ ఫెయిత్ పార్కు
- చినార్ గార్డెను
- యూరి బక్ష్యాన్ పార్కు
- ఇటాలియన్ పార్కు
- ఆర్మేనికమ్ సెంటర్
- మకితార్ సెబస్టాత్సి విద్యాలయ సముదాయం
- ఖోరెన్, షూషానిగ్ పాఠశాల
- బనాంట్స్ ట్రైనింగ్ సెంటర్
- బనాంట్స్ స్టేడియం
- యెరెవాన్ వెలోడ్రోమ్ సైక్లింగ్ సర్క్యూట్
- దాల్మా గార్డెన్ మాల్
గ్యాలరీ
మార్చు-
నగొర్నో-కరబాఖ్ యుద్ధ స్మారక చిహ్నం
-
మల్టియాలోని పవిత్ర దేవుని తల్లి చర్చి
-
పవిత్ర ట్రినిటీ చర్చి
-
ఆంధ్రానిక్ విగ్రహం
-
నారిక్ లోని గ్రెగరీ విగ్రహం