దాల్మా గార్డెన్ మాల్

ఆర్మేనియా దేశపు మొదటి షాపింగ్ మాల్

40°10′48″N 44°29′19″E / 40.179906°N 44.488531°E / 40.179906; 44.488531

దాల్మా గార్డెన్ మాల్
ప్రదేశంమల్టియా-సెబష్టియా జిల్లా,
యెరెవాన్,
ఆర్మేనియా
ప్రారంభ తేదీఅక్టోబర్ 2012
అభివృద్ధి కారకుడుదాల్మా ఇన్వెస్ట్
యజమానితాషిర్ గ్రూప్
స్టోర్‌ల సంఖ్య, సేవలు116
మొత్తం ఫ్లోర్ విస్తీర్ణం43,500 m2 (468,000 sq ft)
ఫ్లోర్ల సంఖ్య3
పార్కింగ్500+

దాల్మా గార్డెన్ మాల్ (ఆర్మేనియన్:Դալմա Գարդեն Մոլ) ఆర్మేనియా దేశంలోని ఒక షాపింగ్ మాల్. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్‌లో సిట్సెర్నాకబెర్డ్ కొండకు దగ్గరలో ఉంది. ఇది ఆర్మేనియా దేశంలోని మొట్టమొదటి షాపింగ్ మాల్.

చరిత్ర మార్చు

ఈ షాపింగ్ మాల్ నిర్మాణం 2009లో మొదలు పెట్టబడింది.[1] 2012 అక్టోబర్ నెలలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించబడింది. [2][3][4] ఆర్మేనియాలో జన్మించిన రష్యన్ వ్యాపారి సామ్‌వెల్ కరపెత్యాన్ సారథ్యంలోని తాషిర్ గ్రూప్ ఈ దాల్మా గార్డెన్ షాపింగ్ మాల్‌ను నిర్మించింది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆర్మేనియా అధ్యక్షుడు "సెర్జ్ సర్ఖస్ జన్" హాజరయ్యాడు.[5]

తరువాత "యెరెవాన్ సిటీ" హైపర్‌మార్కెట్ ఈ మాల్‌లో ప్రారంభమయ్యింది. 2015లో "క్యారీఫోర్ హైపర్‌మార్కెట్" ఈ షాపింగ్ మాల్‌లో మొదలయ్యింది.

సేవలు మార్చు

 
దాల్మా గార్డెన్ షాపింగ్ మాల్‌లోపలి దృశ్యం

యెరెవాన్ లోని అతిపెద్ద నగల దుకాణం ఈ షాపింగ్ మాల్‌లో ఉంది.

2013, నవంబర్ 18న ఈ మాల్‌లో "సినిమా స్టార్" మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభించబడింది. "సినిమా స్టార్" అనేది రష్యన్ సినిమా వ్యాపార సంస్థ. ఇది ఆర్మేనియన్ మార్కెట్లోకి ఈ షాపింగ్ మాల్‌లో 6 హాళ్లను నెలకొల్పడం ద్వారా ప్రవేశించింది. ఈ మల్టీప్లెక్స్ మైఖేల్స్ కేఫ్ రెస్టారెంట్‌కు సమీపంలో ఉంది.[6]

ఈ షాపింగ్ మాల్‌లో అనేక కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, ఒక బౌలింగ్ సెంటర్, చిన్నపిల్లల కోసం "ప్లే లాబ్" ఉన్నాయి.


అనేక అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు ఈ దాల్మా గార్డెన్ మాల్‌లో తమ రీటైల్ షాపులు తెరవడం ద్వారా ఆర్మేనియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. వాటిలో కొన్ని:

 
మాల్‌లోని ఫుడ్‌కోర్టులో బర్గర్ కింగ్ షాపు
  • జర
  • స్ట్రాడ్‌వేరియస్
  • మ్యాంగో
  • పుల్ & బేర్
  • యుఎస్ పోలో అసోసియేషన్
  • బెర్‌ష్కా
  • వాలిస్
  • మిస్ సెల్ఫ్‌రిడ్జ్
  • కర్పిస
  • గియోర్డానొ
  • గెరి వెబర్
  • మసిమో డట్టి
  • ప్రొమోడ్
  • గ్యాప్
  • ఎల్‌సి వైకికి
  • మార్క్స్ & స్పెన్సర్
  • డెసిగ్యుల్
  • మాన్‌సూన్
  • యాక్సెసరైజ్
  • న్యూయార్కర్
  • న్యూ లుక్
  • ఎఫ్&ఎఫ్
  • లెవీ'స్
  • సీలియో
  • ఆర్మనీ ఎక్స్‌చేంజ్
  • టాప్‌షాప్
  • నెక్‌స్ట్
  • గరాజ్
  • లా సెంజా
  • ఓయ్‌షో
  • మెక్స్
  • క్లార్క్స్
  • స్కెచర్స్
  • ఛార్లెస్ & కీత్
  • ఆల్డో
  • బాటా
  • స్టీవ్ మాడెన్
  • క్రాక్స్
  • వైవెస్ రోచర్
  • జిస్క్
  • టేప్ ఆ లోయీల్
  • ఒకైడి
  • జెన్నిఫర్
  • బ్లాంకో
  • బాల్డి
  • రోబెర్టో పిరలోఫ్
  • బర్గర్ కింగ్
  • యెరెవాన్ సిటీ రిటైలర్స్
  • బేసిక్ సెంటర్ రిటైలర్స్
  • రియో గలేరియా రిటైలర్స్

చిత్రమాలిక మార్చు

దాల్మా గార్డెన్ మాల్‌కు సంబంధించిన దృశ్యమాలిక:

మూలాలు మార్చు

  1. (19 జూన్ 2018). ఫ్రమ్‌ దాల్మా గార్డెన్స్ టు దాల్మా మాల్: ఆర్మేనియన్ కంపెనీ లాంచెస్ ద కంస్ట్రక్షన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ సెంటర్ ఇన్ యెరెవాన్, ఆర్మేనియన్.కామ్‌Archived 2014-04-18 at the Wayback Machine
  2. దాల్మా గార్డెన్ మాల్ ఓపెనింగ్ Archived 2013-04-15 at Archive.today, రిపాట్ ఆర్మేనియా
  3. (19 జూన్ 2018). దాల్మా గార్డెన్ మాల్ షాపింగ్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సెంటర్ ఓపెన్స్ యెరెవాన్ Archived 2016-06-05 at the Wayback Machine, పాన్‌ఆర్మేనియన్.నెట్
  4. (19 జూన్ 2018). ఓవర్ 25 ఇంటర్‌నేషనల్ బ్రాండ్స్ రెప్రెజెంటెడ్ ఇన్ దాల్మా గార్డెన్ మాల్ ఇన్ యెరెవాన్ Archived 2012-11-02 at the Wayback Machine, అర్క న్యూస్ ఏజెన్సీ
  5. (19 జూన్ 2018).ప్రెసిడెంట్ సెర్జ్ సర్ఖస్ జన్ అటెండెడ్ ద ఓపెనింగ్ సెరిమనీ ఆఫ్ ద దాల్మా గార్డెన్ మాల్ కాంపౌండ్ అండ్ విజిటెడ్ ది ఆర్మ్‌ప్రొడ్‌ఎక్స్‌పో ఎగ్జిబిషన్ Archived 2014-04-18 at the Wayback Machine, ప్రెసిడెంట్.ఎఎమ్
  6. సినిమా స్టార్ ఈజ్ ఓపెన్ అట్ ద దాల్మా గార్డెన్ మాల్ Archived 2015-10-29 at the Wayback Machine