మల్లవరం (గుంటూరు మండలం)

మల్లవరం, గుంటూరు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.

  • మల్లవరం గ్రామం, గుంటూరు నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • మల్లవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ పట్టాభిసీతారామయ్య దేవాలయంలో, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, ధ్వజస్తంభ పునహ్ ప్రతిష్ఠామహోత్సవం, కన్నులపండువగా నిర్వహించారు. కొత్తూరు సుబ్బరత్నం కుటుంబసభ్యులు ధ్వజస్తంభాన్ని విరాళంగా అందజేయగా, గ్రామస్థులు ప్రతిష్ఠకు సంబంధించి, తమ వంతు సహకారం అందజేసినారు. 12వ తేదీ నుండియే ప్రారంభమైన ఈ కార్యక్రమాలలో, పలురకాల పూజలు, యాగకార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లవరం గ్రామ ప్రజలేగాక, తోకావారిపాలెం, పెదపలకలూరు, గొర్లవారిపాలెం తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. మహిళలు ధ్వజస్తంభానికి పూజలు చేసారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తలకోల శ్రీనివాసరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు.

మూలాలు

మార్చు