మల్లికా శెరావత్

భారతీయ నటి
(మల్లికా షెరావత్ నుండి దారిమార్పు చెందింది)

మల్లికా షెరావత్ (జననం 1976 అక్టోబరు 24) హిందీ భాషా చిత్రాలలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. షెరావత్ 1976 అక్టోబరు 24 న హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం, మోథ్ లో జాట్ కుటుంబంలో జన్మించింది. [1] మల్లికా తండ్రి ముఖేష్ కుమార్ లాంబా. వారిది సేట్ చాజూరాం అనే ప్రముఖ పరోపకారి జాట్ కుటుంబం. [2] పుట్టినపుడు ఆమెకు పెట్టిన పేరు రీమా లాంబా.. [3] రీమా అనే పేరున్న ఇతర నటీమణులతో గందరగోళాన్ని నివారించడానికి ఆమె "మల్లికా" అనే తెర పేరును పెట్తుకుంది. [4] "షెరావత్" అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటి పేరు. [5] తన తల్లి తనకిచ్చిన మద్దతు కారణంగా తల్లి పేరును ఉపయోగిస్తున్నానని ఆమె చెప్పింది. [4]

మల్లికా శెరావత్
Mallika Sherawat Cannes 2014 2.jpg
కాన్ చిత్రోత్సవంలో మల్లికా శెరావత్
జన్మ నామంరీమా లాంబా
జననం (1976-10-24) 1976 అక్టోబరు 24 (వయస్సు 44)
భార్య/భర్త కరణ్ సింగ్ గిల్

షెరావత్ మధుర రోడ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంది. [6] ఢిల్లీ విశ్వవిద్యాలయం, మిరాండా హౌస్ నుండి తత్వశాస్త్రంలో డిగ్రీ పొందింది. [7] తాను చాలా సాంప్రదాయికమైన కుటుంబానికి చెందినదాన్నని, తన వృత్తిని కొనసాగించడంలో కుటుంబం నుండి చాలా అడ్డంకులను ఎదుర్కొన్నాననీ ఆమె పేర్కొంది. [8] అయితే అది, బాలీవుడ్‌లో పెద్దదాన్నవడం కోసం, ఓ ధైర్యవంతురాలైన అమ్మాయిగా కనిపించేందుకు ఆమె సృష్టించిన కథని షెరావత్ కుటుంబం దాన్ని ఖండించింది. [9]

1997 లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమయంలో మల్లిక, ధిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తరువాత, బాలీవుడ్‌లో పని చేయడానికి ఆమె విడాకులు తీసుకుంది. [10] [11] విడాకులైందన్న సంగతి బాలీవుడ్లో తన పెరుగుదలను అడ్డుకుంటుంది కాబట్టి, ఆమె తనకు పెళ్ళైందన్న సంగతిని దాచిపెట్టింది. [10]

ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు ఆమె కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, [12] షెరావత్ కుటుంబం ఇప్పుడు ఆమె కెరీర్ ఎంపికతో సమాధానపడింది. వారు, షెరావత్ రాజీ పడ్డారు. [13]

ఖ్వాహిష్ (2003), మర్డర్ (2004) వంటి చిత్రాలలో ఆమె ప్రదర్శించిన తెగువకు ప్రసిద్ధి చెందింది. [14] షెరావత్ తనను తాను సెక్స్ సింబల్‌గా, బాలీవుడ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖులలో ఒకరిగా స్థాన్ం సంపాదించుకుంది. [15] ఆమె ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ (2006) అనే విజయవంతమైన రొమాంటిక్ కామెడీ సినిమాలో కనిపించింది, ఈ సినిమాలో నటనకు ఆమె చాలా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. [16] [17]

అప్పటి నుండి, ఆమె ఆప్ కా సురూర్, వెల్కమ్ (రెండూ 2007), డబుల్ ధమాల్ (2011) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వెల్కమ్ ఇప్పటివరకు ఆమె సాధించిన అతిపెద్ద వాణిజ్య విజయం. హిస్స్ (2010), పాలిటిక్స్ ఆఫ్ లవ్ (2011) వంటి చిత్రాలతో హాలీవుడ్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. [18] [19] [20]

మూలాలుసవరించు

 1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 2. Deepender Deswal (25 January 2011). "Mallika's great grandfather more popular than her at her native village in Haryana". The Times of India. Archived from the original on 4 నవంబర్ 2012. Retrieved 26 January 2011. Check date values in: |archive-date= (help)
 3. "It's difficult for me to get over my father's betrayal: Mallika Sherawat". The Times of India. 7 October 2013. Retrieved 4 March 2014.
 4. 4.0 4.1 "Youngsters to change the rule in Bollywood: Mallika Sherawat". Outlook India. 24 September 2005. Archived from the original on 31 January 2013. Retrieved 23 July 2010.
 5. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 6. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 7. Malavika Sangghvi (24 April 2005). "I want a man who has more balls than I do". The Times of India. Retrieved 23 July 2010.
 8. "Viagra & the Nun". The Times of India. 11 April 2004. Retrieved 22 December 2010.
 9. "Mallika exposed: These are the true lies". The Indian Express. 10 May 2004. Archived from the original on 15 నవంబర్ 2011. Retrieved 22 December 2010. Check date values in: |archive-date= (help)
 10. 10.0 10.1 April 25, Headlines Today. Mallika's former mum-in-law breaks silence (in en).
 11. Desk, India com Entertainment. OMG! Mallika Sherawat marries boyfriend Cyrille Auxenfans in Paris? (in en).
 12. "Mallika exposed: These are the true lies". The Indian Express. 10 May 2004. Archived from the original on 15 నవంబర్ 2011. Retrieved 22 December 2010. Check date values in: |archive-date= (help)
 13. Deepender Deswal (25 January 2011). "Mallika's great grandfather more popular than her at her native village in Haryana". The Times of India. Archived from the original on 4 నవంబర్ 2012. Retrieved 26 January 2011. Check date values in: |archive-date= (help)
 14. Suchitra Behal (25 April 2004). "Bold Sherawat". The Hindu. Chennai, India. Retrieved 23 July 2010.
 15. Suhasini Haidar (11 June 2003). "Sex now selling in Bollywood". CNN. Retrieved 23 July 2010.
 16. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 17. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 18. Alexandra Alter (6 February 2009). "A Passage to Hollywood". The Wall Street Journal. Retrieved 23 July 2010.
 19. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 20. "Mallika in Politics of Love". The Times of India. 29 July 2010. Archived from the original on 3 నవంబర్ 2012. Retrieved 9 October 2010. Check date values in: |archive-date= (help)

బయటి లింకులుసవరించు