మల్లెల శ్రీరామ మూర్తి

మల్లెల శ్రీరామ మూర్తి. (1907 - 1983) తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.

మల్లెల శ్రీరామమూర్తి

బాల్యము

మార్చు

శ్రీ మల్లెల శ్రీరామ మూర్తి 1907 వ సంవత్సరములో జన్మించారు.

గ్రంథాలయోధ్యమముతో అనుబంధము

మార్చు

విజయవాడలో అయ్యంకి వారికి అతి సన్నిహితులు గా వుంటూ వారి సేవా కార్య క్రమాల్లో నిరంతరము పాల్గొన్న వ్యక్తి రామ మూర్తి గారు. వీరు 1921 లో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహా సభ జరిగినప్పుడు ఆంధ్రరత్న నిర్వహించిన రామదండు లో సభ్యులు. 1933 నుంచి గ్రంథాలయోధ్యమములో చురుకుగా పాల్గొన్నారు. అయ్యంకి వారు నిర్వహించిన ప్రతి కార్య క్రమములో వారికి ఎంతో అండగా వుండే వారు. అఖిల భారత గ్రంథాలయ సంఘం, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంఘం కార్క క్రమాలను నిర్వహించారు. వీరి కృషిని గమనించి 1976 లో ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సేవక సంఘం గ్రంథాలయోధ్యమ భూషణ అను బిరుదుతో సత్కరించబడ్డారు.

మూలాలు

మార్చు

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట. 103