ప్రధాన మెనూను తెరువు

మహంకాళి సీతారామారావు (Mahankali Seetharama Rao) FRCP (1906-1977) భారతీయ వైద్యుడు. ఇతడు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరియు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ లకు వ్యక్తిగత అధికారిక వైద్యునిగా గుర్తింపు పొందాడు.

ఇతడు భారతీయ సైన్యపు వైద్యసేవ కోసం 1936 లో చేరి వైద్య నిపుణునిగా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంలో జరిగిన పెర్షియా-ఇరాక్ సేనలో సేవచేశాడు. సుమారు 20 సంవత్సరాల తర్వాత సైన్యాన్ని విడచి; సివిల్ సర్వీస్ లో చేరి న్యూఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ వైద్యశాలలో మెడిసన్ విభానికి అధిపతిగా (ఢిల్లీ విశ్వవిద్యాలయం క్రింద) చేరాడు.

భారత ప్రభుత్వం ఇతనికి 1962 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. తర్వాత 1964 సంవత్సరంలో లండన్ లోని భారత హైకమీషనర్ గా నియమించింది. తర్వాత న్యూఢిల్లీలో చివరిదాకా వైద్యసేవలను అందించారు.