మహం బేగం
మహం బేగం (జననం ? - మరణం 1535 ఏప్రిల్ 27) (పర్షియన్:ماہم بیگم). మహం అంటే " నా చంద్రుడు అని అర్ధం. మహం బేగం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు, మొదటి చక్రవర్తి బాబర్ మూడవ భార్య, చక్రవర్తిని. మహం బేగం బాబర్ మొదటి కుమారుడు, తరువాత చక్రవర్తి హుమాయూనుకు జన్మ ఇచ్చిన తరువాత " హజ్రా వాలిడా " అనే పేరు ఇవ్వబడింది. పర్షియా రాణులలో ఒకరుగా మహబేగంకు మొగలుల మద్య ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఆమె మొగల్ ప్రజల మన్ననలను అందుకుంది.
Maham Begum | |
---|---|
Empress Consort of the Mughal Empire | |
Tenure | 1506 - 26 December 1530 |
జననం | 15th century Khorasan, Afghanistan |
మరణం | April 27, 1535 |
Burial | |
Consort | Babur |
వంశము | Humayun Mirza Barbul Mirza Faruq Mihr Jahan Begum Aisan Daulat Begum |
House | House of Timurid (by marriage) |
మతం | Shia Islam |
వంశ పారంపర్యం
మార్చుమాహం బేగం తల్లితండ్రుల గురించిన వివరాలు ప్రస్తావించబడలేదు. ఆమె కొరసానీకి చెందిన షియా ముస్లిం ఖ్వాజా మొహమ్మద్ అలి (ఆఫ్ఘనిస్థానీ) సహోదరి. ఆమె ఉలఘ్ బెగ్ మిర్జా కాబుల్, సుల్తాన్ హుసేన్ మిర్జా బేక్వార (ఖొర్సా బాద్షా) బంధువు. ఆమె " షేక్ అహ్మద్- ఈ - జమీల్ షేఖ్ అహ్మద్ " వంశస్థురాలు.
వివాహం
మార్చుబాబర్ 1506 లో సుల్తాన్ హుస్సేన్ మిర్జా మరణించిన తరువాత వివాహం చేసుకున్నాడు. ఖొర్సా రాజధానికి బాబర్ సుల్తాన్ మరణం గురించి సానుభూతి తెలపడానికి వెళ్ళాడు. బాబర్ రాజకీయ వ్యవహారలలో ఆమె క్రియాశీలక పాత్ర వహించింది. ఆమె అత్యధిక మేధాశక్తి, సౌదర్యం మేళవించిన మహిళగా గుర్తించబడింది. ఆమె భర్తను అనుసరించి బదాఖ్షాన్, ట్రాంసోక్సియానాలకు వెళ్ళింది. ఆమె భర్తకు చేదోడుగా నిలిచింది. రాజకుటుంబంలో అమె ప్రధాన మహిళగా గుర్తించబడింది. ఆమెకు జన్మించిన ఇతర కుమారులు నలుగురు (బార్బుల్, మిహర్ జహాన్, అయిసన్ దౌలత్, ఫరుక్) దురదృష్ట వశాత్తు బాల్యంలోనే మరణించారు. ఆమె అంతఃపుర స్త్రీల మధ్య తన హక్కును పదిలంగా కాపాడుకుంది. ఆమె తన 5 గురు కుమారులతో సంరక్షణ బాధ్యత వహిస్తూనే బాబర్ కోరిక మీద 1519 లో హిండల్, 1525 గుల్బదన్ బేగంల సంతానానికి సంరక్షకురాలిగా ఉంది.
చక్రవర్తినిగా
మార్చు1528 లో మాహం బేగం కాబుల్ నుండి హిందూస్థాన్‌కు వచ్చింది. ఆమె అలిఘర్ చేరగానే బాబర్ ముగ్గురు ఆశ్వికులతో ఇద్దరు పిల్లలను పంపాడు. ఆమె త్వరతిగతిలో అలిఘర్ నుండి ఆగ్రా చేరుకుంది. బాబర్ ఆమెను చేరుకోవడానికి అలిఘర్ వెళ్ళాడు. సాయంకాలం ప్రార్ధనాసమయంలో సేవకులు వచ్చి మాహం బేగం సమీపంలో ఉందని తెలిపారు. బాబర్ ఆలస్యం చేయకుండా ఆమెను ఆమె విడిది చేసిన శిబిరంలో కలుసుకున్నాడు. తరువాత ఆమెను ఆమె పరివారంతో తనవెంట తీసుకువెళ్ళాడు. 18 ఆశ్వాలతో కూడిన 9 బృందాలతో బాబర్ పంపిన ఇద్దరు పిల్లలు తన వెంట వచ్చిన ఒక పిల్లవానితో వందలాది సేవకులతో ఆమె బాబర్ వెంట ఆగ్రా వెళ్ళింది. మాహం బేగం బాబర్‌తో డోలాపూర్ వెళ్ళింది. మాహం బేగం మహారాణి. ఆమెకు మాత్రమే మహారాజు ప్రక్కన ఢిల్లీ సింహాసం మీద అధిష్ఠించే హక్కు ఉంది. ఆమె శక్తివంతురాలు. ముభావంగా ఉన్నా, కోపగించినా బాబర్ ఆమెను అభ్యంతర పెట్టలేదు. బాబర్ " తన అభిమాన మహారాణి ఆఙ శాసనం " అని చెప్పేవాడు.
ఒకసారి హుమాయూన్ తీవ్రంగా వ్యాధిభారిన పడ్డాడని ఢిల్లీలో ఉన్న మౌలానా ముహమ్మద్ పర్ఘలి నుండి ఒక ఉత్తరం వచ్చింది. అది విని మాహం బేగం ఆందోళన పడింది. ఆమె ఢిల్లీ వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుని మథుర వద్ద వారిని కలుసుకుంది. ఆమె హుమాయూనును కలుసుకోగానే ఆమె ఊహించినదానికంటే హుమాయూన్ బలహీనంగా ఉన్నాడని గ్రహించింది. తరువాత మథుర నుండి తల్లీ కుమారులు ఆగ్రా చేరుకున్నారు. వారు ఆగ్రా చేరగానే బాబర్ వారిని కలుసుకుని కుమారుని పరిస్థితి తెలుసుకున్నాడు. కుమారుని పరిస్థితి గమనించిన బాబర్ కుమారుడు మరణిస్తాడని కలవరపడ్డాడు. మాహం బేగం " మీరు రాజు కనుక ఇంతగా చింతించ పనిలేదు. మీకు ఇంకా కుమారులు ఉన్నారు " అని చెప్పంది. అందుకు బాబర్ " నాకు ఎంతమంది కుమారులు ఉన్నా వారెవరు హుమాయూన్‌తో సమానులు కారు. నేను నాప్రియ పుత్రుడు దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నాను. నా రాజ్యం హుమాయూన్ కొరకే సంపాదించబడింది. మిగిలిన కుమారులెవరూ హుమాయూనుకు సరి రారు. అని జవాబిచ్చాడు."
హుమాయూన్ అనారోగ్యం సమాంలో బాబర్ తీవ్ర ఆందోళనకు గురైయ్యాడు. ఆయన తనకుమారుని ఆరోగ్యం కొరకు భవంతుని ప్రార్ధించాడు. చివరకు హుమాయూన్ కోలుకున్నాడు. అయినప్పటికీ ఆందోళన కారణంగా బాబర్ ఆరోగ్యపరిస్థితి క్షీణించి చివరకు మరణించాడు. బాబర్ తన కుమారుని కొరకు ఆత్మాహుతి చేసి కుమారుని బ్రతికించాడని భావించారు. మరణం వాకిలిలి దర్శించిన హుమాయూన్ మాత్రం బాగా కోలుకున్నాడు. బాబర్ మరణించే ముందుగా గుల్రంగ్ బేగం, గుల్చెరా బేగంలకు వివాహం చేయమని మాహంబేగంకు ఆనతిచ్చి మరణించాడు.
వైధవ్యం
మార్చుబాబర్ మరణించిన తరువాత (1530 డిసెంబర్) హుమాయూన్ తన 23వ సంవత్సరంలో సింహాసనం అధిష్టించాడు. మాహం బేగం కుమారుని కొరకు రెండు మార్లు స్వయంగా ఆహారం తయారు చేయించేది. ఉదయం ఆహారం కొరకు ఒక ఎద్దు, ఐదు మేకలు వధించబడేవి. మఫ్హ్యాహ్న భోజనానికి 5 మేకలు వధించబడేవి. మాహం బేగం దీనిని తనస్వంత ఎస్టేటులోనే తయారుచేయించేది. ఇలా దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం కొనసాగింది. మాహంబేగం తన వివేకం, చాకచక్యంతో హుమాయూనును బాద్షా పీఠం మీద నిలిపింది. ఆమె బాద్షా బేగంగా రాజరిక కార్యక్రమాలలో, సాంఘిక ఉత్సవాలలో పాల్గొనేది. ఆమె మరణించే వరకు తన భర్తసమాధిని సంరక్షిస్తూ ఉంది.
హుమాయూన్ చునార్ నుండి తిరిగి వచ్చిన సందర్భంలో మాహం బేగం గొప్ప విందుకు ఏర్పాటుచేసింది. ఆమె తన శ్రేయోభిలాషులకు, సైనికులకు వారి ప్రదేశాలను, నివాసాలను అందంగా అలకరించమని ఆదేశించింది. ఆమె కుమారుని రాకను స్వాగతిస్తూ గొప్ప విందుకు ఆదేశించింది. ఆమె దాదాపు 7,000 మందికి విందు ఏర్పాటు చేసింది. ఉత్సవాలు కొన్ని రోజులకాలం కొనసాగాయి.
మరణం
మార్చుమాహం బేగం ప్రేగు సంబంధిత వ్యాధికి గురై ఏప్రెల్ 16 న మరణించింది. మాహం మరణం తరువాత బాబర్ సహోదరి " ఖంజడా బేగం " ఆమె స్థానికి వచ్చింది. ఆమె ఎక్కడ సమాధి చేయబడిందో కచ్చితంగా తెలియరానప్పటికీ తన భర్త సమాధి సమీపంలో సమాధి చేయబడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆమె శరీరం తిరిగి కాబూల్ చేరలేదు.
మూలాలు
మార్చుగ్రంథాల జాబితా
మార్చు
|
|
వెలుపలి లింకులు
మార్చు- Humayun nama, Chapter 4: Hostilities arise, the battle against Rana Sanga at Fathpur Sikri and Babur's victory, Maham Begam and Gul-badan move to Agra
- Humayun nama, Chapter 5: Humayun's illness, Babur's death, Humayun becomes Emperor
- Humayun nama, Chapter 6: Maham Begam's feast and death, the Mystic Feast and Mirza Hindal's marriage feast, Bega Begam's complaints to Humayun