మహదేవ్ బాబర్
మహదేవ్ బాబర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హడప్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మహదేవ్ బాబర్ | |||
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నూతన నియోజకవర్గం | ||
---|---|---|---|
తరువాత | యోగేష్ తిలేకర్ | ||
నియోజకవర్గం | హడప్సర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 ఫిబ్రవరి 5 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన (యుబిటి)[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుమహదేవ్ బాబర్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012లో పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై డిప్యూటీ మేయర్‌గా పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హడప్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శివాకర్ చంద్రకాంత్ విఠల్‌రావుపై 10309 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ తిలేకర్ చేతిలో 30248 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]
నిర్వహించిన పదవులు
మార్చు- 1997 : పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
- 2002 : పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
- 2003 : పూణే డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు
- 2005: పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు
- 2007 : పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా తిరిగి ఎన్నికయ్యాడు (3వ పర్యాయం)
- 2009 : మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
- 2017: పూణే సిటీ శివసేన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు
మూలాలు
మార్చు- ↑ "Setback to Uddhav Thackeray: Sena-UBT's 5 former corporators set to join BJP" (in ఇంగ్లీష్). Business Today. 2 January 2025. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
- ↑ "Across party lines, 5 corporators from Pune script tale of triumph in state polls" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2019. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "BJP sweeps Pune city, wins all eight seats". The Economic Times. 19 October 2014. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
- ↑ "Unkept promises: 3 legislators of different parties in past three terms but no end to issues plaguing Hadapsar" (in ఇంగ్లీష్). The Indian Express. 30 September 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.