మహమ్మద్ హిదయతుల్లా
మహమ్మద్ హిదయతుల్లా (డిసెంబర్ 17 1905 - సెప్టెంబర్ 18, 1992) న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి వి.వి.గిరి చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి 1992 సంవత్సరంలో మరణించాడు.
Mohammad Hidayatullah | |
---|---|
6th Vice President of India | |
In office 31 August 1979 – 30 August 1984 | |
అధ్యక్షుడు | |
అంతకు ముందు వారు | B. D. Jatti |
తరువాత వారు | Ramaswamy Venkataraman |
President of India | |
Acting 25 July 1984 – 25 July 1984 | |
ప్రధాన మంత్రి | Indira Gandhi |
అంతకు ముందు వారు | Zail Singh |
తరువాత వారు | Zail Singh |
Acting 25 July 1983 – 25 July 1983 | |
ప్రధాన మంత్రి | Indira Gandhi |
అంతకు ముందు వారు | Zail Singh |
తరువాత వారు | Zail Singh |
Acting 6 October 1982 – 31 October 1982 | |
ప్రధాన మంత్రి | Indira Gandhi |
అంతకు ముందు వారు | Zail Singh |
తరువాత వారు | Zail Singh |
Acting 20 July 1969 – 24 August 1969 | |
ప్రధాన మంత్రి | Indira Gandhi |
అంతకు ముందు వారు | V. V. Giri (acting) |
తరువాత వారు | V. V. Giri |
11th Chief Justice of India | |
In office 25 February 1968 – 16 December 1970 | |
Appointed by | Zakir Husain |
అంతకు ముందు వారు | Kailas Nath Wanchoo |
తరువాత వారు | Jayantilal Chhotalal Shah |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Lucknow, United Provinces of Agra and Oudh, British India (present-day Uttar Pradesh, India) | 1905 డిసెంబరు 17
మరణం | 1992 సెప్టెంబరు 18 Bombay, Maharashtra, India (present-day Mumbai) | (వయసు 86)
రాజకీయ పార్టీ | Independent |
జీవిత భాగస్వామి | Pushpa Shah |
కళాశాల | Nagpur University Trinity College, Cambridge Lincoln's Inn |
వృత్తి |
|
అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము, విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశాడు. హిదాయతుల్లా 1979, ఆగస్టు 31 నుండి 1984, ఆగస్టు 30 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
జీవితం
మార్చుహిదాయతుల్లా 1905 డిసెంబర్ 17న బేతుల్ (మధ్యప్రదేశ్) రాష్ట్రములో సంపన్న, విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు ఖాన్ బహదూర్ హఫీజ్ మొహమ్మద్ విలాయతుల్లా, ఇతడు పేరొందిన ఉర్దూ కవి, ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడు. హిదాయతుల్లా నాగపూర్ లోని మోరిస్ కళాశాల నుండి ఆంగ్లం, చరిత్ర, పర్షియన్ భాషలలో బి.ఎ పట్టా పొందాడు, తండ్రి కోరిక మేరకు 1927 నుంచి 1930 వరకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఆంగ్లం, ఆంగ్ల సాహిత్యం, న్యాయశాస్త్రంలో బీఏ, ఎంఏ చేశాడు. కేంబ్రిడ్జిలో బంగారు పతక విజేత అయిన ఆయన 1930లో తన 25వ ఏట లింకన్ ఇన్ లోని బార్ కు పిలిపించారు. మహ్మద్ హిదయతుల్లా సుప్రీంకోర్టు 11వ ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ న్యాయ చరిత్రలో అన్ని పదవులను నిర్వహించి, భారతదేశంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా, భారత ఉపరాష్ట్రపతిగా, భారత తాత్కాలిక రాష్ట్రపతిగా పదవులను నిర్వహించిన ఏకైక భారతీయ పౌరుడిగా ప్రత్యేకమైన ఘనతను హిదాయతుల్లా కలిగి ఉన్నాడు[1].
పదవులు
మార్చుహిదాయతుల్లా భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను 1930 జూలై 19 న నాగపూర్ లోని సెంట్రల్ ప్రావిన్సెస్ బెరార్ హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు.1943 ఆగస్టు 2న సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్ అడ్వొకేట్ జనరల్ గా నియమితులైనాడు.ఈ పదవిలో 1946 జూన్ 24న ఆ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు కొనసాగాడు. 1946 సెప్టెంబరు 13న అదే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, 1954 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.1958 డిసెంబర్ 1న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 1968 ఫిబ్రవరి 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.1970 డిసెంబర్ 17 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. హిదాయతుల్లా చిన్న వయస్సులో హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ గా, ప్రధాన న్యాయమూర్తి గా, భారత సుప్రీంకోర్టుకు చిన్న వయస్సులో న్యాయమూర్తి గా పనిచేయడం జరిగింది.
జస్టిస్ హిదయతుల్లా 1969 జూలై 20 న భారత తాత్కాలిక రాష్ట్రపతిగా, భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత, వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో భారత ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, 1979 నుండి 1984 వరకు ఉన్నాడు. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో సభా కార్యకలాపాలను హుందాగా, ఎంతో చాకచక్యంగా, వివేకంతో నిర్వహించాడు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో 1982లో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశాడు[2] .
పుస్తకములు
మార్చుహిదాయతుల్లా పుస్తకాలను కూడా రచనలు చేసినాడు[3].
- డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ ది జుడిసియల్ ప్రాసెస్ (Democracy in India and the Judicial Process)
- ది సౌత్ -వెస్ట్ ఆఫ్రికా కేస్ (The South-West Africa Case)
- జుడిసియల్ మెథడ్స్ ( Judicial Methods)
- ఎ జడ్జ్ మిసెలనీ ( A Judge's Miscellany)
- యు ఎస్ ఏ అండ్ ఇండియా (USA and India)
- ఎ జడ్జ్ మిసెలనీ, రెండవ భాగం (A Judge's Miscellany (Second Series),
- డి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ( The Fifth and Sixth Schedules to the Constitution of India)
- మై ఓన్ బోస్వెల్ (ఆటోబయోగ్రఫీ) My Own Boswell (Autobiography)
- ఎడిటర్, ముల్లాస్ మహమ్మదీయన్ లా అండ్ కాన్స్టిట్యూషన్ లా ఆఫ్ ఇండియా(Editor, Mulla's Mahomedan Law and Constitutional Law of India)
మూలాలు
మార్చు- ↑ "M. Hidayatullah". Supreme Court Observer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-21.
- ↑ "Justice Hidayatullah - Hidayatullah National Law University". hnlu.ac.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-21.
- ↑ "Sh. M. Hidayatullah | Vice President of India | Government of India". vicepresidentofindia.nic.in. Retrieved 2024-08-21.