ప్రధాన మెనూను తెరువు

భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. దీని సభ్యుల సంఖ్య 250. ఇందులో 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నామినేటు చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వము

రాజ్యాంగము

కార్య నిర్వాహక వ్యవస్థ

శాసన వ్యవస్థ

న్యాయ వ్యవస్థ

రాష్టాలు

గ్రామీణ ప్రాంతాలు

ఎన్నికల వ్యవస్థ


ఇతర దేశాలు


రాజ్యసభకు సభాపతి (చైర్మను) గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్‌సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్‌సభ వలెనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని తోసిరాజనే అధికారం లోక్‌సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్యా వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగు జరిపినపుడు, సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినపుడు, సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు.

రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం వీరికి ఓటేసే అధికారం లేదు.

రాజ్యసభ తన మొదటి సమావేశాన్ని 1952 మే 13 న నిర్వహించింది.

రాజ్యసభ సభ్యుల్లో రాష్ట్రాల వాటాసవరించు

రాజ్యసభకు పంపించే సభ్యుల్లో వివిధ రాష్ట్రాల వాటా ఇలా ఉంది.

 1. ఆంధ్ర ప్రదేశ్ — 11
 2. అరుణాచల్ ప్రదేశ్ — 1
 3. అస్సాం — 7
 4. బీహార్ — 16
 5. చత్తీస్ గఢ్ - 5
 6. గోవా — 1
 7. గుజరాత్ — 11
 8. హర్యానా — 5
 9. హిమాచల్ ప్రదేశ్ — 3
 10. జమ్మూ కాశ్మీర్ — 4
 11. జార్ఖండ్ - 6
 12. కర్ణాటక — 12
 13. కేరళ — 9
 14. మధ్య ప్రదేశ్ — 11
 15. మహారాష్ట్ర — 19
 16. మణిపూర్ — 1
 17. మేఘాలయ — 1
 18. మిజోరం — 1
 19. నాగాలాండ్ — 1
 20. ఒడిషా — 10
 21. పంజాబ్ — 7
 22. రాజస్థాన్ — 10
 23. సిక్కిం — 1
 24. తమిళనాడు — 18
 25. త్రిపుర — 1
 26. ఉత్తరాంచల్ - 3
 27. ఉత్తర ప్రదేశ్ — 31
 28. పశ్చిమ బెంగాల్ — 16
29.తెలంగాణ-7
కేంద్ర పాలిత ప్రాంతాలు:
 1. ఢిల్లీ — 3
 2. [[పాండిచ్చేరTelangana-7

మొత్తం: 223. ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలు, వనరులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్యసభ&oldid=1782909" నుండి వెలికితీశారు