మహర్షుల చరిత్రలు (మొదటి సంపుటము)
మహర్షుల చరిత్రలు తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన విశిష్టమైన ప్రామాణిక గ్రంథములు.
మహర్షుల చరిత్రలు | |
కృతికర్త: | బులుసు వేంకటేశ్వర్లు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | జీవితచరిత్రలు |
ప్రచురణ: | తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. |
విడుదల: | 1981 |
పవిత్ర భారతదేశంలో ఎందరో మహర్షులు అవతరించి బ్రహ్మనిష్ఠా గరిష్టులై లోకోపకారకములైన ఎన్నెన్నో ఘనకార్యాలు నిర్వర్తించారు. ప్రపంచ ప్రజలు వీరి ఋణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు. యుగయుగాల భారతీయ సంస్కృతినీ, విజ్ఞానమును విశ్వానికి చాటిన ధర్మస్వరూపులు వారు. తపస్స్వాధ్యాయ నిరతులై, నిగ్రహానుగ్రహ సమర్థులై, త్రికాలజ్ఞులైన మన మహర్షులు గురించిన విషయములెన్నో మన పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మములు ఆచరించి లోకానికి ఆదర్శప్రాయులైనారు. అనేక ధర్మశాస్త్రాలు రచించి ప్రపంచానికి ఉపకరించారు.
మహర్షుల చరిత్రలు 1989 వరకు ఏడు సంపుటములు వెలువడ్డాయి. ఇందు మొదటి సంపుటమును 1981లో విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు రచించింది. వీరు అనేకములైన ఇతిహాస పురాణాలను చక్కగా అవలోకనము చేసి సర్వజనావబోధకమైన సరళ సుందర శైలిలో రచించిరి.
సనాతన ధర్మ ప్రచారమునకై తిరుమల తిరుపతి దేవస్థానములు వారు వెలువరచుచున్న ధార్మిక గ్రంథ పరంపరలో ఈ మహర్షుల చరిత్రలు విశిష్టమైనవి.