మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజా విశ్వవిద్యాలయం.

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
రకంPublic
స్థాపితం2007
ఛాన్సలర్సీ.పీ. రాధాకృష్ణన్
వైస్ ఛాన్సలర్నవీన్‌మిత్తల్‌ (ఇన్‌చార్జి వైస్‌ఛాన్సలర్‌)
డీన్పూర్వం డా.రమేష్ కుమార్ మిరియాల
రిజిస్టార్ప్రొఫెసర్ ఎం. యాదగిరి. పూర్వం ప్రొ .ఉమేష్ కుమార్
చిరునామఅన్నెపర్తి, నార్కట్ పల్లి సమీపం,, నల్గొండ, తెలంగాణ, భారతదేశం
17°03′N 79°16′E / 17.05°N 79.27°E / 17.05; 79.27
జాలగూడుఅధికారిక వెబ్‌సైటు,
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ is located in Telangana
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ
Location in Telangana

చరిత్ర

మార్చు

ఈ విశ్వవిద్యాలయం 2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడినది.[1] దీనిని పూర్వం "నల్గొండ విశ్వవిద్యాలయం" గా పిలిచేవారు. [2] ఇది ఒక స్వీయ నిధులతో నడుపబడుతున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది 2013 లో నల్గొండలోని పగగల్ వద్ద స్థాపించబడిన ఒక ఇంజనీరింగ్ కళాశాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో నల్గొండ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ ఉత్తర్వు G.O.19/HE (UE-II) డిపార్టుమెంటు,తే: 13/3/2007 ప్రకారం 2007లోని ఎల్.ఎ బిల్ సంఖ్య.4 క్రింది సెక్షన్- 3(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ను సవరించి స్థాపించారు. ఉన్నత విద్యను అందుబాటులోనికి తేవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. దీనిని అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం" గా 1991 లోని ఏక్ట్‌.4 షెడ్యూలు ప్రకారం సవరణ చేసి పేరు మార్చడం జరిగినైది. ఈ విషయం ఎ.పి.గజెట్ లో 2008 ఏప్రిల్ 28 న ప్రచురుంచారు. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం నల్గొండ నగరంలో 2010-11 లో ఉండేది. 240 ఎకరాలతో శాశ్వత కాంపస్ ను నల్గొండ పట్టణానికి సుమారు 7 కి.మీ దూరంలో నల్గొండ-నర్కేపల్లి హైవే మార్గం ప్రక్కన అభివృద్ధి చేయడం జరిగినది. ఇటీవలి ప్రపంచ విపత్తైన కరోనా వ్యాధి -2019 పట్ల మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ తెలుగు శాఖా విద్యార్థులు స్పందించారు. కవిత్వం ద్వారా కరోనా వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేసే పనికి పూనుకున్నారు. కాలం బంధించిన క్షణాలు అనే కవితా సంపుటిని వెలువరించారు.దీనికి విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు నర్రా ప్రవీణ్ రెడ్డి సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకానికి విశేషమైన పేరొచ్చింది.

ప్రాథమిక సదుపాయాలు

మార్చు

ఇది నల్గొండ సమీపంలో 250 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది 16 ఎకరాల విస్తీర్ణంతో ఇంజనీరింగ్ కళాశాలను పానగల్ లో ఉంది.

వైస్‌ ఛాన్సలర్లు

మార్చు
 • సులేమాన్‌ సిద్ధికీ - ఏప్రిల్‌ 2007 నుంచి ఆగస్టు 2007
 • ప్రొఫెసర్‌ వి.గంగాధర్‌ 2007-2010
 • ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి - 2011 నుంచి 2014
 • ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ 2016-2019
 • అరవింద్‌కుమార్‌, ఐఏఎస్ - ఇన్‌చార్జి వీసీ
 • కె.సునీత ఐఏఎస్‌
 • శైలజారామయ్యర్‌ ఐఏఎస్‌
 • ఏ.వాణీప్రసాద్‌ ఐఏఎస్‌
 • టి.విజయ్‌కుమార్‌ ఐఏఎస్‌
 • ప్రొఫెసర్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి - 21 మే 2021 నుండి 20 మే 2024 [3][4]
 • నవీన్‌మిత్తల్‌ - ఇన్‌చార్జి వైస్‌ఛాన్సలర్‌ - 2024 మే 22[5]

మూలాలు

మార్చు
 1. "Welcome to Mahatma Gandhi University". mguniversity.ac.in. Archived from the original on 27 జూలై 2013. Retrieved 29 ఏప్రిల్ 2018.
 2. "List of State Universities" (PDF). 27 May 2011. Archived from the original (PDF) on 15 మే 2011. Retrieved 2011-06-06.
 3. Namasthe Telangana (23 May 2021). "నేడు విధుల్లోకి ఎంజీయూ వీసీ". Namasthe Telangana. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
 4. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 28 May 2021.
 5. Andhrajyothy (21 May 2024). "ఎంజీయూ ఇన్‌చార్జి వీసీగా నవీన్‌మిత్తల్‌". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.