కట్టా నర్సింహారెడ్డి

కట్టా నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021 మే 21న హైదరాబాద్ లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ - హైదరాబాద్‌ (జేఎన్టీయూహెచ్‌) వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3][4]

కట్టా నర్సింహారెడ్డి
జననం
జాతీయత భారతదేశం
వృత్తిప్రొఫెసర్, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌
తల్లిదండ్రులుకట్టా రామ చంద్రారెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

కట్ట నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌ లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టా అందుకున్నాడు.[5]

వృత్తి జీవితం మార్చు

కట్ట నర్సింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో 1980లో ప్రొఫెసర్‌గా విధుల్లో చేరి, యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. ఆయన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంకి 2011 నుంచి 2014 మే వరకు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

వైస్‌చాన్సలర్‌గా మార్చు

కట్ట నర్సింహారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంకి 2011 నుంచి 2014 మే వరకు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 2021 మే 21న జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) -హైదరాబాద్‌ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[6] నర్సింహారెడ్డి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ​ను కలిశాడు.[7][8]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. EENADU (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  5. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  6. Prabha News (23 May 2021). "తెలంగాణలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు". Prabha News. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  7. Namasthe Telangana (26 May 2021). "గవర్నర్‌ను కలిసిన జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ వీసీ". Namasthe Telangana. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  8. ETV Bharat News (25 May 2021). "సీఎం కేసీఆర్‌ను కలిసిన జేఎన్టీయూ వీసీ". ETV Bharat News (in ఇంగ్లీష్). Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)