మహాత్మా గాంధీ స్మారక చిహ్నం (మిల్వాకీ)

మహాత్మాగాంధీ స్మారక చిహ్నం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని విస్కాసిన్ వద్ద మిల్వాకీ దిగువ పట్టణమైన మిల్వాకీ కౌంటీ కోర్ట్ హౌస్ వద్ద నెలకొల్పబడిన బహిరంగ శిల్పం.

Mahatma Gandhi Memorial
కళాకారుడుGautam Pal
సంవత్సరం2002
రకంBronze sculpture
కొలతలు260 cm (104 in)
ప్రదేశంMilwaukee County Courthouse, Milwaukee, Wisconsin, U.S.
Coordinates43°2′29.759″N 87°55′23.847″W / 43.04159972°N 87.92329083°W / 43.04159972; -87.92329083
యజమానిMilwaukee County

వివరణ మార్చు

ఇది 8 అడుగులు (2.4 మీ) ఎత్తు కలిగి ఉంటుంది. ఇందులో భారత దేశ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, పౌరహక్కుల నాయకుడైన మహాత్మా గాంధీ సాంప్రదాయ దుస్తులను ధరించి, ఉద్యమ నాయకులతో కలసి నడిచే భంగిమలో ఉంటుంది. విగ్రహంలో బట్టతల, ఛాతీ, భుజాలు, కాళ్ళు వస్త్రాలతో కప్పబడకుండా ఉంటుంది. అతను కళ్ళ జోడు ధరించి అతని దృష్టి నడుస్తున్న మార్గం వైపు మాత్రమే ఉన్నట్లు ఉంటుంది. అతను చెప్పులు ధరిస్తాడు. ఈ విగ్రహం కోర్డు హౌస్ నుండి దూరంగా తూర్పు వైపు ఉన్న డౌన్ టౌన్, మిచిగాన్ సరస్సు వైపు నడిచినట్లు కనిపిస్తుంది.[1]

వాషింగ్టన్, డి.సి.లోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నం గౌతమ పాల్ చేత నిర్మించబడిన ఇదే విధమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఇది ఎర్ర గ్రానైట్ స్తంభంపై ఉంది.

ఈ శిల్పం ఒక ఎర్రటి గ్రానైట్ బేస్ మీద ఉంది, దానిపై వివరాలను రాసి ప్రదర్శించడానికి నాలుగు వైపులా కాంస్య ఫలకాలు అమర్చారు. "నిజాయితీ" , "న్యాయం" అని లేబుల్ చేయబడిన కోర్ట్ హౌస్ తలుపుల మధ్య ఉంచడం శిల్పం యొక్క సందేశాన్ని బలోపేతం చేస్తుంది.

చారిత్రక సమాచారం మార్చు

విస్కాన్సిన్ కొలిషన్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ (WCAIO) సంస్థ ఈ శిల్పం నిర్మించడానికి, దాని స్థాపన కోసం, 12,000 డాలర్లు వసూలు చేసింది. WCAIO మిల్వాకీ ప్రాంతంలో 16 భారతీయ అమెరికన్ సమూహాలను సూచిస్తుంది. ఈ విగ్రహం నెలకొల్పడానికి భారతీయ సాంస్కృతిక సంబంధాల కౌన్సిల్ సహకారం అందించింది. మార్క్వెట్టే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ కి చెందిన మాజీ డీన్ అయిన కుమార్ ధల్వార్, అతని భార్త దర్శన్ ఈ ఈ శిల్పాన్ని మిల్వాకీకి తీసుకురావాలనే ప్రచారానికి నాయకత్వం వహించి 25,000 డాలర్లు విరాళాన్నందించారు.

"ప్రపంచంలోని హింసను నివారించడానికి మాత్రమే కాదు, గృహ హింస , వీధుల్లో హింస కూడా మహాత్మా గాంధీ సందేశాల ప్రాముఖ్యత ఉంది."అని ధాలివాల్ ఇండియా-వెస్ట్ వార్తాపత్రికతో అన్నారు . [1]

శిల్పాన్ని దానం చేయాలనే ప్రతిపాదనను మిల్వాకీ కౌంటీ అంగీకరించింది. మిల్వాకీ కౌంటీ ప్రారంభంలో ఈ విగ్రహం నెలకొల్పడానికి పది స్థలాలను ప్రతిపాదించింది. భారతీయ అమెరికన్ సంఘం మాక్‌ఆర్థర్ స్క్వేర్ వద్ద ఈ సైట్‌ను ఎంచుకుంది ఎందుకంటే "ఇది అందమైన, నిర్మలమైన ప్రదేశం." [1]

ఈ శిల్పాన్ని 2002 అక్టోబర్ 5 న ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని అంకితం చేసే కార్యక్రమంలో శాంతి సత్యాగ్రహం, విస్కాన్సిన్ ఎన్నికైన అధికారులు, భారత రాయబారి లలిత్ మాన్సింగ్ చేసిన ప్రసంగాలు, భజనల కార్యక్రమం జరిగాయి. ఇండియా-వెస్ట్ వార్తాపత్రిక ప్రకారం, ఈ అంకిత సభకు 850 మంది హాజరయ్యారు.

ఈ శిల్పం స్థానిక భారతీయ అమెరికన్ సమాజానికి, శాంతి కార్యకర్తలకు జాగరణ చేసే ప్రదేశం. [2] శిల్పానికి క్రమం తప్పకుండా గాజ్రా పూల దండలు వేస్తారు. ఈ శిల్పం చుట్టూ గల ప్రదేశాన్ని 2003లో ఇండియా-అమెరికా ఫ్రెండ్‌షిప్ పార్కుగా నామకరణం చేసారు. [ <span title="This claim needs references to reliable sources. (June 2019)">citation needed</span> ]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Swapan, Ashfaque (14 October 2002). "Mahatma Gandhi Statue Unveiled in Milwaukee". India-West Newspaper. Archived from the original on 29 October 2013. Retrieved 5 August 2012.
  2. "Students for Bhopal". Archived from the original on 15 April 2013. Retrieved 5 August 2012.