మహాదేవి వర్మ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మహాదేవి వర్మ (ఏప్రిల్ 27, 1907 - సెప్టెంబర్ 11, 1987) ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె సేవలకు గాను ఆమెను ఆధునిక మీరా అని కూడా అంటారు. కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను విశాల హిందీ మందిరపు సరస్వతి గా అభివర్ణించాడు.[1]
మహాదేవి వర్మ | |
---|---|
రచయిత మాతృభాషలో అతని పేరు | महादेवी वर्मा |
పుట్టిన తేదీ, స్థలం | ఫారుఖ్రాబాద్ , బ్రిటిష్ ఇండియా | 1907 మార్చి 26
మరణం | 1987 సెప్టెంబరు 11 అలహాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం | (వయసు 80)
వృత్తి | నవల రచయిత , కవయిత్రి |
భాష | Hindi |
జాతీయత | భారతీయురాలు |
విద్య | ఎం ఏ సంస్కృతం , అలాహాబాద్ యూనివర్సిటీ |
సాహిత్య ఉద్యమం | చయవాడ్ |
గుర్తింపునిచ్చిన రచనలు | యమ మేరా పరివార్ పాత్ కె సాథీ |
పురస్కారాలు |
|
జీవిత భాగస్వామి | డా. స్వరూప్ నారాయణ్ వర్మ |
స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ నివసించిన ఈమె బహుళ సమాజంలో పనిచేస్తూనే భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి, పరిశీలించి, అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించిన కవుల్లో ఒకర్తె. ఈమె కవితలే కాకుండా ఈమె చేపట్టిన సమాజోద్ధరణా పనులు, మహిళాచైతన్యం కోసం చేసిన కృషి ఈ దృష్టితోనే ప్రభావితమైనవి. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే దీపశిఖలో అది ప్రతి మనిషి యొక్క వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులనే కాకుండా సమీక్షకులను కూడా లోతుగా ప్రభావితం చేసింది.
ఈమె ఖరీబోలీ హిందీ మాండలికంలో వ్రాసిన కవితల్లో అప్పటివరకు కేవలం భృజ్ భాషలోనే సంభవమని అనుకొన్నంత మృదువైన శబ్దాలను పలికించింది. దీని కోసం ఆమె తన సమయంలో వాడకంలో ఉన్న సంస్కృత, బెంగాలీ భాషలలోని మృదువైన పదాలను ఎన్నుకొని వాటికి హిందీ తొడుగులు తొడిగింది. సంగీతంతో పరిచయముండటం వల్ల ఈమె పాటల నాథ సౌందర్యం, లయబద్ధమైన వ్యంజనాల శైలి అనితరసాధ్యమైనది. అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పదవీ విరమణ చేసే కాలానికి ప్రయాగ మహిళా విద్యాపీఠం యొక్క ప్రధానాచార్యులైంది. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది. ప్రతిభావంతమైన కవయిత్రి, గద్య రచయితైన మహాదేవి వర్మ సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతో పాటు చక్కటి చిత్రకారిణి, సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు హిందీ సాహిత్యంలోని అన్ని ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలను అందుకొన్న గౌరవము దక్కింది. భారత సాహిత్యాకాశంలో మహాదేవివర్మ ధ్రువతారగా వెలుగుతున్నది. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా మహాదేవివర్మ వెలుగొందింది. 2007లో ఈమె జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపబడినవి.
పోస్టల్ స్టాంప్
మార్చు1991, సెప్టెంబరు 16న ఆమె పేరుమీద భారత ప్రభుత్వం రూ. 2 విలువగల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.[2]
మూలాలు
మార్చు- ↑ "Mahadevi Varma". /www.financialexpress.com. financialexpress. Retrieved 27 April 2018.
- ↑ "Postage Stamps: Commemorate section". postagestamps.gov.in. Archived from the original on 23 నవంబరు 2018. Retrieved 7 December 2020.