మహానది
మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒడిషా మొత్తము, జార్ఖండ్, మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
మహానది నది | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం |
భాగాలు | చత్తీస్ గఢ్, ఒరిస్సా |
ప్రాంతం | దండకారణ్యం, దక్షిణ కోసల రాజ్యం, కోస్తా మైదానాలు |
నిర్వహణా ప్రాంతాలు | రాయపూర్, జంజగిర్, బిలాస్ పూర్ (ఛత్తీస్ గఢ్) , సంబల్ పూర్, సునర్నపురం, బౌధ్, అనుగుల్, కటక్, ఖంకి, జగత్ సింగపూర్, ఝార్స్ గుడ (ఒడిశా) |
Cities | రాజిం, స్ంబల్ పూర్, కటక్, సోణేపూర్, బిర్మహరాజపూర్, సుభలయ, కంటిలో, బౌధ్, కటక్, బాంకి |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | సిహావ, ధంతరి, దండకారణ్యం, ఛత్తీస్ గఢ్, భారతదేశం |
• అక్షాంశరేఖాంశాలు | 20°07′N 81°55′E / 20.11°N 81.91°E |
• ఎత్తు | 890 మీ. (2,920 అ.) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | False Point, Jagatsinghpur, Delta, Odisha, India |
• ఎత్తు | 0 మీ. (0 అ.) |
పొడవు | 858 కి.మీ. (533 మై.) |
పరీవాహక ప్రాంతం | 141,600 కి.మీ2 (54,700 చ. మై.) |
ప్రవాహం | |
• స్థానం | False Point, Odisha |
• సగటు | 2,119 m3/s (74,800 cu ft/s) |
• గరిష్టం | 56,700 m3/s (2,000,000 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | Seonath, Mand, Ib, Hasdeo |
• కుడి | Ong, parry, Jonk, Telen |
మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను నిర్మించారు.[1] ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.