మహానది తమిళం నుండి తెలుగు లోకి అనువదించిన సినిమా. కమల హాసన్ ముఖ్య పాత్రధారిగా రూపొందించబడింది. సంతాన భారతి దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ సహ రచయిత. ఈ చిత్రంలో కమల హాసన్ తో పాటు, సుకన్య, ఎస్ఎన్ లక్ష్మి, తులసి, శోబనా, దినేష్, పూర్ణం విశ్వనాథన్, రాజేష్, విఎంసి హనీఫా కూడా నటించారు. తన కుటుంబం ఆస్తి నాశనమైపోతున్న ఒక వినయపూర్వకమైన గ్రామస్తుడి దుఃఖాన్ని ఇది చిత్రీకరిస్తుంది.

మహానది
(1994 తెలుగు, తమిళ్ సినిమా)
మహా నది (సినిమా).jpg
దర్శకత్వం సంతాన భారతి
కథ కమల హాసన్
తారాగణం కమల హాసన్
సుకన్య
సంగీతం ఇళయరాజా
విడుదల తేదీ 1994
దేశం భారతదేశం
భాష తెలుగు, తమిళ్

అవినీతి, పిల్లల అక్రమ రవాణా వంటి అనేక సమస్యలను ఈ సినిమా చూపిస్తుంది. భారతదేశంలో అవిడ్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి చిత్రం ఇది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది గానీ, వాణిజ్యపరంగా విఫలమైంది. తమిళంలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది.

కథసవరించు

కృష్ణ తన అత్తగారు సరస్వతి, కుమార్తె కావేరి, కొడుకు భరణిలతో కలిసి కుంబకోణం సమీపంలోని గ్రామంలో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. మద్రాసుకు చెందిన మోసగాడు ధనుష్ కృష్ణ ఆస్తిపైకన్నేసి, అతణ్ణి తన చిట్ ఫండ్ వ్యాపారంలో చేరమని కోరాడు. మొదట్లో కృష్ణ అయిష్టంగా ఉంటాడు; అయితే, ఒక విదేశాలనుండి ఒక గొప్ప స్నేహితుడు తన ఇంటిని సందర్శించినప్పుడు, తాను కూడా అతడిలాగే ధనవంతుడు కావాలని కోరుకుంటాడు. అందువల్ల అతను ధనుష్ ప్రతిపాదనకు అంగీకరించి నగరానికి వస్తాడు. అయితే, ధనుష్ మాయోపాయాల గురించి అతనికి తెలియదు. ధనుష్ చిట్ ఫండ్ డబ్బును కాజేసి, నింద కృష్ణపై వేస్తాడు అతడు జైలుకు వెళ్తాడు.

కృష్ణ తన కాబోయే మామ కూడా అదే కారణంతో జైలులో ఉన్నాడని తెలుసుకుంటాడు. అతని కుమార్తె యమున నర్సుగా పనిచేస్తూంటుంది. జైలరు క్రూరంగా ప్రవర్తించినప్పటికీ కోపగించవద్దని అతడు కృష్ణకు సలహా ఇస్తాడు. జైలులో అణకువగా ఉంటే త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కృష్ణ జైలులో ఉన్న కాలంలో, యమున అతడి కుటుంబాన్ని అదుకుంటుంది. అనివార్య పరిస్థితుల కారణంగా, అతని అత్తగారు చనిపోతుంది. పిల్లలు తప్పిపోతారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు ఈ విషయం తెలుసుకుంటాడు.

కృష్ణ తన కొడుకును వీధి కళాకారులతో కలిసి తిరుగుతూంటే చూసి, తిరిగి తీసుకు వెళ్తాడు. తన కుమార్తె కలకత్తాలో, సోనాగాచి అనే రెడ్ లైట్ ఏరియాలో ఉన్నట్లు ధనుష్ నుండి తెలుసుకుంటాడు. కృష్ణను అరెస్టు చేసినప్పుడు, కావేరి యుక్తవయస్సుకు వచ్చింది. మూడు నెలల తరువాత సరస్వతి అనారోగ్యానికి గురైంది. కావేరి, భరణి ఆర్థిక సహాయం కోరుతూ ధనుష్ వద్దకు వెళతారు. ధనుష్ వారిని తన యజమాని వద్దకు తీసుకువెళతాడు. కావేరిని బాస్ కోరికకు బలి పెడతాడు. అందుకు ప్రతిఫలంగా సరస్వతి చికిత్స కోసం బాస్ ధనుష్కు డబ్బు ఇస్తాడు. కానీ, అతను తన కుక్కతో భరణిని తరిమించి, డబ్బును తానే ఉంచేసుకుంటాడు. అతడి బాస్ కావేరిని దారుణంగా అత్యాచారం చేస్తాడు. ఆమెను సోనాగాచిలో వేశ్యగా చేరుస్తారు.

కృష్ణ తన కూతుర్ను అక్కడి నుండి విడిపించడం, దుర్మార్గులను శిక్షించడం మిగతా కథ

నటవర్గంసవరించు

పాటలుసవరించు

సంగీతం - ఇళయరాజా

External audio
  Audio Jukebox on YouTube

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 Ms. Representation: Silver linings.
  2. 2.0 2.1 2.2 மகாநதிக்கு இன்றோடு 25 வயது. (14 January 2019).
  3. Archived copy.
  4. 4.0 4.1 Rajendran, Sowmya (14 January 2019). 25 years of ‘Mahanadi’: Kamal Haasan’s gripping drama moves us even today.
  5. 5.0 5.1 ‘Mahanadhi’, the 1994 Pongal Release, Is Not Just A Tear-Jerker But A Story Written Around Philosophical Questions. (2020-01-16).
  6. மகாநதி- மகாநதி சங்கர். (8 November 2019).