యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.

యూట్యూబ్
YouTube Logo 2017.svg
Screenshot
Type of site
వీడియో ఆతిథ్య సేవ
Founded2005 ఫిబ్రవరి 14; 17 సంవత్సరాల క్రితం (2005-02-14)
Headquarters901 చెర్రీ అవెన్యూ
శాన్ బర్నో, కాలిఫోర్నియా,
అమెరికా
Ownerఆల్ఫాబెట్
Founder(s)
CEOసుసాన్ వుజిసిక్
Industryఅంతర్జాలం
వీడియో హోస్టింగ్ సేవ
Parentగూగుల్ (2006–ప్రస్తుతం)
URLYouTube.com
Advertisingగూగుల్ యాడ్ సెన్స్
Registrationఐచ్చికం (చాలా వీడియోలు చూడటానికి ఇందులో సభ్యులుగా నమోదు కానవసరం లేదు. కానీ వీడియోలు ఎక్కించడానికి, 18 సంవత్సరాలు నిండినవారు చూడగలిగే వీడియోలు చూడాలంటే, ప్లే లిస్టులు తయారు చేసుకోవాలంటే, ఇష్టాయిష్టాలను గుర్తించడానికి, వ్యాఖ్యానించడానికి మాత్రం నమోదు అయి ఉండాలి.)
Launched2005 ఫిబ్రవరి 14; 17 సంవత్సరాల క్రితం (2005-02-14)

దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. నవంబరు 2006లో గూగుల్ సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది.[7]

అందుబాటులో ఉన్న కంటెంట్: వీడియో క్లిప్లు, TV షో క్లిప్లు, మ్యూజిక్ వీడియోలు, చిన్న, డాక్యుమెంటరీ ఫిల్మ్లు, ఆడియో రికార్డింగ్లు, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, వీడియో బ్లాగింగ్,, విద్యాసంబంధిత వీడియోలు వంటి ఇతర కంటెంట్ను కలిగి ఉంది.

ఇందులో నమోదైన సభ్యులు తమ వీడియోలను అపరిమిత సంఖ్యలో ఎక్కించవచ్చు. వేరే వాళ్ళు ఎక్కించిన వీడియోలు చూడవచ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. రేట్ చేయవచ్చు. ఇష్టమైన వీడియోలను జాబితాగా తయారు చేసుకోవచ్చు. వేరేవారిని అనుసరించవచ్చు. వ్యక్తులు సంబంధించిన వీడియోలే కాక సంస్థలకు సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చు. నమోదుకాని వినియోగదారులు సైట్లో వీడియోలను మాత్రమే చూడగలరు.

యూట్యూబు గూగుల్ యాడ్సెన్స్ (కంటెంట్, ప్రేక్షకుల ప్రకారం ప్రకటనలను లక్ష్యంగా చేసుకునే కార్యక్రమం) నుండి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది.[8]

వ్యూస్‌ రికార్డుసవరించు

పింక్‌ఫాంగ్ ఛానల్‌కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్‌ వీడియో వ్యూస్‌ జనవరి, 2022 నాటికి వెయ్యి కోట్లు దాటి యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ప్లాట్‌ఫాంపై ఇలాంటి రికార్డు సాధించిన తొలి వీడియో ఇదే. అత్యధిక వ్యూస్‌ కలిగిన వీడియో కూడా ఇదే. 2016 జూన్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు. రెండో స్థానంలో 700 కోట్లకుపైగా వ్యూస్‌తో ప్యూర్టోరికన్ పాప్‌ స్టార్‌ లూయిస్ ఫోన్సీ సాంగ్‌ డెస్పాసిటో ఉంది.[9]

మూలాలుసవరించు

  1. Claburn, Thomas (January 5, 2017). "Google's Grumpy code makes Python Go". The Register (in ఇంగ్లీష్). Retrieved September 16, 2017.
  2. Wilson, Jesse (May 19, 2009). "Guice Deuce". Official Google Code Blog. Google. Retrieved March 25, 2017.
  3. "YouTube Architecture – High Scalability -". Retrieved October 13, 2014.
  4. "Golang Vitess: a database wrapper written in Go as used by Youtube".
  5. "YouTube". GitHub. Retrieved January 12, 2018.
  6. "youtube.com Traffic Statistics". Alexa Internet. Amazon.com. July 9, 2017. Archived from the original on 2016-08-07. Retrieved January 20, 2018.
  7. Hopkins, Jim (October 11, 2006). "Surprise! There's a third YouTube co-founder". USA Today. Retrieved November 29, 2008.
  8. "How many views on YouTube are necessary to make money? Free tips here! - Dollars Bag" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-10. Retrieved 2022-05-10.
  9. "Baby Shark Dance వెయ్యి కోట్లకుపైగా వ్యూస్‌వీడియో.. యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు". EENADU. Retrieved 2022-01-15.
"https://te.wikipedia.org/w/index.php?title=యూట్యూబ్&oldid=3599202" నుండి వెలికితీశారు