మహా శివరాత్రి పర్వదినం

మహాశివరాత్రి గురించి పురాణాలు, ఇతర కథనాలు: మహా శివరాత్రి ప్రతి సంవత్సరం వచ్చే మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. 2023 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 18 వ తారీఖు మాఘ బహుళ చతుర్దశి అనగా శివరాత్రి. ఇది అన్ని దేశాలలో ఉన్న హిందువులకు మహత్తరమైన పందుగ. ఈ రోజు మహాదేవుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కనుక ఈరోజు మహా శివరాత్రి అని శివపురాణంలో తెలియబరచబడింది. ఇలాగె అనెక కథనాలు ఉన్నాయి. శ్రీ మహాభావగతంలో క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలం అనే విషం (గరళం) ను శివుడు భక్షించి లొకాలను కాపాడినాడు. కాని ఆ గరళం యొక్క ప్రభావం వలన శివుని గొంతు కమిలిపొయి నీలి రంగులొకి మారిపోయింది. ఆ రోజునుండి శివుడు నీలకంటుడు అయినాడు. లోకాలను కాపాడిన మహా శివునికి శాంతి కలుగుటకు ఆ రాత్రి అంతా శివ నామ స్మరణ, జప తపాదులు చేస్తారు భక్తులు. ఈ రోజు చేసే శివ పూజ, ఆలయ దర్శనం, అభిషేకం, జపం, ఉపవాసం, జాగరణ అత్యంత ఫలితాన్ని ఇచ్ఛి మహా శివుని అనుగ్రహం పొందుతారు అని భక్తుల విశ్వాసం. ==