మహిర హఫీజ్ ఖాన్ (ఉర్దూ: ماہرہ حفیظ خان; జననం 1984 డిసెంబరు 21), ప్రముఖ పాకిస్థాన్ సినిమా నటి. ఆమె పాకిస్థానీ సినిమాల్లోనూ, నాటకాల్లోనూ నటించింది. ఆమె అత్యంత పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరు. లక్స్ స్టైల్, హమ్ పురస్కారాలు వంటి పలు పురస్కారాలు అందుకొంది. 

మహీరా ఖాన్
2018లో మసాలా అవార్డ్స్‌లో మహీరా ఖాన్
జననం
మహీరా హఫీజ్ ఖాన్

(1984-12-21) 1984 డిసెంబరు 21 (వయసు 39)
విద్యాసంస్థఫౌండేషన్ పబ్లిక్ స్కూల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అలీ అస్కారీ
(m. 2007; div. 2015)
సలీం కరీం
(m. 2023)
పిల్లలుఒక కుమారుడు

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

పాకిస్థాన్ లోని కరాచిలో 1984 డిసెంబరు 21న ఆమె జన్మించింది. ఉర్దూ మాతృభాషగా గల పఠాన్ల కుటుంబం వారిది.[1] ఆమె తండ్రి హఫీజ్ ఖాన్ ఢిల్లీలో పుట్టి పెరిగినా, భారత విభజన తరువాత పాకిస్థాన్ కు కుటుంబంతో సహా వెళ్ళిపోయారు.

ఆమె కరాచీలోని ఫౌండేషన్ పబ్లిక్ పాఠశాలలో చదువుకుంది.[2] ఆ తరువాత ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నత విద్య అభ్యసించింది. అలాగే లాస్ ఏంజెలెస్ లోని సాంటా మోనికా కళాశాలలో చదువు కొనసాగించింది. అయితే, దక్షిణ కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోసం చేరిన ఆమె చదవు పూర్తి అవకుండానే 2008లో పాకిస్థాన్ తిరిగి వచ్చేసింది. ఆ సమయంలో అక్కడ షాపులో పని చేసింది.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమెకి 2006లో లాస్ ఏంజెల్స్‌లో అలీ అస్కారీతో పరిచయం ఏర్పడింది.[4][5] 2007లో, ఆమె సాంప్రదాయ ఇస్లామిక్ వివాహ వేడుకగా ఆయనని వివాహం చేసుకుంది.[6][7] అయితే, ఆమె తండ్రికి ఈ వివాహం ఇష్టం లేదు.[8] వారికి 2009లో ఒక కుమారుడు జన్మించాడు.[9][10][11] ఈ జంట 2015లో విడాకులు తీసుకున్నారు.[12][13] ఆమె 2023 అక్టోబరు 2న వ్యాపారవేత్త సలీం కరీమ్‌ని రెండవసారి వివాహం చేసుకుంది.[14][15]

మూలాలు

మార్చు
  1. "Mahira Khan celebrating 32nd birthday today". The News. 21 December 2016. Retrieved 23 April 2017.
  2. "Profile: Mahira Khan | Newsline". Newsline. March 2012. Retrieved 14 December 2016.
  3. "Mahira Khan: 7 things to know about Humsafar's pretty Khirad Hussain". India.com. 15 October 2014. Retrieved 14 December 2016.
  4. "Mahira Khan: 8 things to know about Shah Rukh Khan's beautiful Raees actress from Pakistan". India.com. 12 December 2016. Archived from the original on 14 December 2016. Retrieved 13 December 2016.
  5. "Profile: Mahira Khan | Newsline". Newsline. March 2012. Archived from the original on 20 December 2016. Retrieved 14 December 2016.
  6. "Your Right To Know". Daily Times. Pakistan. Archived from the original on 1 February 2016. Retrieved 13 November 2016.
  7. "Mahira Khan: Lesser known facts about the Pakistani actress". The Times of India. 3 August 2016. Archived from the original on 28 January 2017. Retrieved 13 December 2016.
  8. "Mahira Khan: 7 things to know about Humsafar's pretty Khirad Hussain". India.com. 15 October 2014. Archived from the original on 14 December 2016. Retrieved 14 December 2016.
  9. "Raees actor Mahira Khan is a single mother. 10 things you did not know". India Today. 2017. Archived from the original on 3 December 2018. Retrieved 2 December 2018.
  10. Anam Mansuri (19 February 2012). "The real Mahira". The Express Tribune. Archived from the original on 10 April 2017. Retrieved 10 April 2017.
  11. "On his 8th birthday, Azlan has 'strict' instructions for mom Mahira Khan". The Express Tribune. 16 September 2017. Archived from the original on 16 September 2017. Retrieved 17 September 2017.
  12. "Mahira Khan husband, family and wedding photos, movies, and TV shows – Ali Askari, Neeyat, Humsafar and Bol". The Indian Express. 11 December 2016. Archived from the original on 13 December 2016. Retrieved 14 December 2016. The actor during an interview has said that both her parents are Urdu-speaking Pathans.
  13. "Mahira Khan: 8 things to know about Shah Rukh Khan's beautiful Raees actress from Pakistan". India.com. 12 December 2016. Archived from the original on 14 December 2016. Retrieved 13 December 2016.
  14. "पाकिस्तानी अभिनेत्री माहिरा खान ने इस बिजनेसमैन से की शादी। देखें वीडियो". पोस्ट इनशॉर्ट (in హిందీ). 2 October 2023. Archived from the original on 5 డిసెంబరు 2023. Retrieved 2 October 2023.
  15. "Pakistani Actress Mahira Khan Marries Businessman Salim Karim In An Intimate Ceremony. Video Inside". NDTV (in ఇంగ్లీష్). 2 October 2023. Retrieved 2 October 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=మహిర_ఖాన్&oldid=4334810" నుండి వెలికితీశారు