మహీంద రాజపక్స (Sinhala: මහින්ද රාජපක්ෂ, Tamil: மஹிந்த ராஜபக்ஷ; జననం 1945 నవంబరు 18) శ్రీలంక దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2019 నుండి 2022 వరకు శ్రీలంక దేశ ప్రధాన మంత్రిగా సేవలందిస్తున్నాడు, ఇంతకు మునుపు ఇదే పదవిలో 2004 నుండి 2005 వరకు ఉన్నాడు. 2005 నుండి 2015 వరకు శ్రీలంక దేశ రాష్ట్రపతిగా కూడా సేవలందించాడు. 2002 నుండి 2004 ఇంకా 2018 నుండి 2019 వరకు ప్రతిపక్ష నాయకునిగా, 2005 నుండి 2015 వరకు తిరిగి 2019 నుండి 2021 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు.[1]

మహీంద రాజపక్స 
President of Sri Lanka from 2005 to 2015
పుట్టిన తేదీ18 నవంబరు 1945
Weeraketiya (British Ceylon)
పౌరసత్వ దేశం
చదువుకున్న సంస్థ
  • Richmond College
వృత్తి
రాజకీయ పార్టీ సభ్యత్వం
  • United People's Freedom Alliance
  • Sri Lanka Freedom Party
చేపట్టిన పదవి
  • President of Sri Lanka (2005–2015)
  • Prime Minister of Sri Lanka (2004–2005)
  • Commonwealth Chairperson-in-Office (2013–2015)
  • Member of the Parliament of Sri Lanka (2015–)
  • Leader of the Opposition (2002–2004)
  • minister of fisheries (1997–2001)
  • Minister of Finance of Sri Lanka (2005–2015)
  • Member of the Parliament of Sri Lanka (1989–2005)
  • Member of the Parliament of Sri Lanka (1970–1977)
  • Minister of Buddhasasana, Religious & Cultural Affairs (2020–2022)
  • Minister of Urban Development & Housing (2020–2022)
  • Minister of Economic Policies & Plan Implementation (2020–2022)
  • Minister of Defence (2005–2015)
సహోదరులు
సంతానం
  • Rohitha Rajapaksa
అందుకున్న పురస్కారం
  • Registered firearms
  • Honorary Doctor of the Beijing Foreign Studies University (2011)
  • honorary doctor of the Peoples' Friendship University of Russia (2010)
Edit infobox data on Wikidata
Mahinda Rajapaksa (es); Mahinda Rajapaksa (ms); Махинда Раджапакса (bg); Mahinda Rajapaksa (simple); مہند راج پکش (ur); Mahinda Rajapakse (mg); Mahinda Rajapaksa (sv); Mahinda Rajapaksa (oc); Mahinda Rajapaksa (io); 마힌다 라자팍사 (ko); Mahinda Rajapaksa (eo); Mahinda Radžapaksa (cs); মহিন্দ রাজাপক্ষ (bn); Mahinda Rajapakse (fr); Mahinda Rajapaksa (jv); महिंद राजपक्ष (mr); Mahinda Rajapaksa (af); Махинда Раџапакса (sr); Mahinda Rajapaksa (pt-br); Mahinda Rajapaksa (lb); Mahinda Rajapakse (nn); Mahinda Rajapaksa (nb); Mahinda Racapaksa (az); ಮಹಿಂದಾ ರಾಜಪಕ್ಸೆ (kn); Mahinda Rajapaksa (en); ماهيندا راجاباكشا (ar); Mahinda Radzsapaksza (hu); Mahinda Rajapaksa (eu); Mahinda Rajapaksa (ca); Mahinda Rajapaksa (qu); Mahinda Rajapaksa (de); Махінда Раджапаксэ (be); Մահինդա Ռաջապաքսա (hy); 马欣达·拉贾帕克萨 (zh); Mahinda Rajapaksa (da); მაჰინდა რაჯაპაკსე (ka); マヒンダ・ラージャパクサ (ja); ماهيندا راجاباكشا (arz); מהינדה ראג'פקסה (he); Mahendra Rājapakṣe (la); महिन्दा राजपक्षे (hi); 马欣达·拉贾帕克萨 (wuu); Mahinda Rajapaksa (fi); மகிந்த ராசபக்ச (ta); Mahinda Rajapaksa (it); Mahinda Rajapaksa (et); Махінда Раджапакса (uk); Μαχίντα Ραγιαπάκσε (el); Mahinda Rajapaksa (yo); महिन्दा राजपाक्ष (ne); Mahinda Rajapaksa (pt); మహీంద రాజపక్స (te); ਮਹਿੰਦਾ ਰਾਜਪਕਸ਼ੇ (pa); Mahinda Rajapaksa (ga); Mahinda Rajapaksa (lt); Mahinda Radžapaksa (sl); Mahinda Rajapaksa (sq); Mahinda Rajapaksa (pam); Mahinda Rajapaksa (id); มหินทะ ราชปักษะ (th); Mahinda Rajapaksa (pl); മഹിന്ദ രാജപക്‌സെ (ml); Mahinda Rajapaksa (nl); ماهیندا راجاپاکسا (fa); Mahinda Rajapaksa (tr); Махинда Раджапакса (ru); ᱢᱟᱦᱤᱱᱫᱟ ᱨᱟᱡᱟᱯᱟᱠᱥᱟ (sat); Mahinda Rajapakse (gl); මහින්ද රාජපක්ෂ (si); 马欣达·拉贾帕克萨 (zh-hans); مہند راج پکش (pnb) político de Sri Lanka (es); শ্রীলঙ্কান রাজনীতিবিদ (bn); (1945) szingaléz politikus (hu); Sri Lanka poliitik (et); ланкийский политик, президент Шри-Ланки (2005-2015), премьер-министр Шри-Ланки (2004-2005)-(2018)-(2019-2022) (ru); sri-lankischer Politiker (de); político cingalês, presidente do Sri Lanka de 2005 a 2015 (pt); سیاستمدار سریلانکایی (fa); 斯里兰卡政治人物 (zh); श्रीलंकाको पूर्व राष्ट्रपति (२००५-२०१५) (ne); ශ්‍රී ලංකාවේ හිටපු අගමැති (si); sri-lankesesche Politiker a fréiere Staatspresident (lb); polityk Sri Lanki (pl); srilankisk politiker (nb); politicus (la); פוליטיקאי סרי-לנקי ראש ממשלת סרי לנקה לשעבר (he); politicus uit Sri Lanka (nl); President of Sri Lanka from 2005 to 2015 (en); ശ്രീലങ്കൻ പ്രധാനമന്ത്രി (ml); President of Sri Lanka from 2005 to 2015 (en); politico singalese (it); Srí Lanky (cs); இலங்கையின் முன்னாள் பிரதமர் மற்றும் சனாதிபதி/நாடாளுமன்ற உறுப்பினர் (ta) Mahinda Rajapaksa (fr); Mahinda Rajapakse, Percy Mahinda Rajapaksa (et); 马欣达·拉贾帕克塞, 拉贾帕克萨,马欣达 (zh); Раджапаксе, Махинда Раджапаксе, Раджапаксе М., Раджапаксе Махинда, Раджапакса, Махинда (ru); Percy Mahendra Rajapaksa (qu); Mahinda Rajapakse, Rajapaksa, Percy Mahinda Rajapaksa (de); Μαχίντα Ρατζαπάκσα (el); Rajapaksa, Mahinda Rajapakse (sv); Mahinda Rajapakse (id); Percy Mahendra Rajapaksa (af); Mahinda Rajapaksa, മഹിന്ദ രാജപക്സെ (ml); Don Percy Mahendra Rajapaksa (tr); マヒンダ・ラジャパクセ, マヒンダ・ラジャパクサ (ja); ජනාධිපති මහින්ද රාජපක්ෂ, මහින්ද රාජපක්‍ෂ (si); මහින්ද රාජපක්ෂ, Mahinda Rajapaksa (mg); Mahinda Rajapakse (lb); Mahinda Rajapakse (pl); Mahinda Rajapakse (nb); Mahinda Rajapaska, Rajapaska, Rajapaksa (nl); महेन्द्र राजपक्षे (hi); Mahinda Rajapakse (io); Mahinda Rajapaksa (nn); Mahinda Rajapakse, Rajapaksa (fi); Percy Mahendra Rajapaksa, Percy Mahinda Rajapaksa, MR, Mahinda (en); Percy Mahendra Rajapaksa (ca); Mahinda Radžapakse (cs); மஹிந்த ராஜபக்ஷ, மகிந்த ராஜபக்சே, மகிந்த இராசபக்ச, மகிந்த ராசபக்சா, மகிந்த ராஜபக்க்ஷ, மகிந்த ராஜபக்ச, மஹிந்த ராஜபக்ச (ta)

రాజపక్స వృత్తికి రీత్యా ఒక న్యాయవాది, 1970లో మొట్ట మొదటిసారి దేశ పార్లమెంటుకు ఎన్నికాయ్యాడు. 2005 నుండి 2015 వరకు శ్రీలంక స్వాతంత్ర్య పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు. ఆయన 2019 నవంబర్ 21 నుండి 2022 మే 9వరకు శ్రీలంక ప్రధానిగా పని చేశాడు.[2]

కుటుంబ నేపథ్యం

మార్చు

మహేంద్ర పెర్సి రాజపక్స హంబంతోట జిల్లాలోని వీరకేతియా అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి డి.ఎ రాజపక్స 1945లో అతని అన్న డి.ఎమ్ రాజపక్స మరణం తరువాత సిలోన్ దేశ నాయకత్వాన్ని చేపట్టాడు.

1983లో రాజపక్సే శిరంతి విక్రమసింఘేను వివాహం చేసుకున్నాడు. శిరంతి ఒక మానసిక వైద్యురాలు విద్యావేత్త. శిరంతి తండ్రి శ్రీలంక నేవీలో రిటైర్డ్ అధికారి. వీరికి నమల్, యోషిత, రోహిత అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. నామల్ పార్లమెంటు సభ్యుడు. శ్రీలంక నేవీలో ఆలోచనాత్మకంగా పనిచేశాడు.

మహింద సోదరుడు గోటబయ రాజపక్స శ్రీలంక ఆర్మీలో 20 ఏళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత మహింద్ర ఆధ్వర్యంలో రక్షణ కార్యదర్శిగా పనిచేశారు. మరో సోదరుడు బాసిల్ రాజపక్స గంపహా జిల్లా ఎంపీ మాజీ ఆర్థికాభివృద్ధి మంత్రి. మహీంద పెద్ద సోదరుడు సమల్ రాజపక్స పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేశాడు.

విద్యాబ్యాసం

మార్చు

రాజపక్స తన చిన్నతనంలో మేధములన గ్రామంలో తన కుటుంబంతో ఉండేవాడు. అతను 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గల్లెలో రిచ్మండ్ కాలేజీకి హాజరయ్యాడు. మధ్య యాభైలలో రాజపక్స కుటుంబం కొలంబోకు తరలివెళ్లడంతో అతన్ని నలంద కళాశాలలో చేర్చారు. 1957లో తృస్థాన్ కళాశాలలో చేరిన రాజపక్స అక్కడ క్రీడలలో చురుగ్గా పాల్గొనేవాడు, క్రికెట్ ఫుట్ షాట్ లాంటి పోటీలలో రాణించేవాడు.[3]

కెరీర్

మార్చు

రాజపక్స వృత్తిరీత్యా న్యాయవాది అతను 1970లో శ్రీలంక పార్లమెంటుకు తొలిసారిగా ఎన్నికయ్యారు. అతను 2005 నుండి 2015 వరకు శ్రీలంక ఫ్రీడం పార్టీ నాయకుడిగా పనిచేశాడు. 2005 నవంబరు 9న రాజపక్సే అధ్యక్షుడిగా తన మొదటి ఆరు సంవత్సరాల పదవీకాలానికి ప్రమాణం స్వీకారం చేసాడు. అతను 2010లో రెండవసారి తిరిగి ఎన్నికయ్యాడు. రాజపక్సే 2015 అధ్యక్ష ఎన్నికలలో మైత్రిపాల సిరిసేనచే మూడవసారి తన ప్రయత్నంలో ఓడిపోయాడు,2015 జనవరి 6న పదవిని విడిచిపెట్టాడు. ఆ సంవత్సరం తరువాత, రాజపక్సే 2015 పార్లమెంటరీ ఎన్నికలలో ప్రధానమంత్రి కావడానికి విఫలమయ్యాడు; ఆ సంవత్సరం, యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ ఓడిపోయింది. అయితే ఆయన కురుణగల జిల్లా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

2018 అక్టోబరు 26న, యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ ఐక్య ప్రభుత్వం నుండి వైదొలిగిన తర్వాత రాజపక్సేను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించాడు. పదవిలో ఉన్న రణిల్ విక్రమసింఘే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అతని తొలగింపును అంగీకరించడానికి నిరాకరించాడు. ఈ అసమ్మతి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. 2018 నవంబరు 14, 16 తేదీల్లో రాజపక్సేపై తీసుకొచ్చిన రెండు అవిశ్వాస తీర్మానాలను శ్రీలంక పార్లమెంటు ఆమోదించింది. సరైన విధానాలను అనుసరించడంలో విఫలమైనందున, అధ్యక్షుడు సిరిసేన రెండింటినీ తిరస్కరించారు. 2018 డిసెంబరు 3న, ఒక న్యాయస్థానం రాజపక్స ప్రధానమంత్రి అధికారాలను తొలగించింది, అతని మంత్రివర్గం చట్టబద్ధతను స్థాపించే వరకు పనిచేయదని తీర్పు చెప్పింది.

రాజపక్సే 15 డిసెంబర్ 2018న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. విక్రమసింఘే తిరిగి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు రాజపక్సే ప్రతిపక్ష నాయకుడిగా నిలిచాడు. అతను 2019లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీని చీల్చి శ్రీలంక పొదుజన పెరమున నాయకుడయ్యాడు.[4]

2019 శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవంబర్ 18న అధ్యక్షుడైన తన సోదరుడు గోటబయ రాజపక్సేచే నియమించబడిన తర్వాత అతను 2019 నవంబరు 21న మళ్లీ ప్రధానమంత్రి అయ్యాడు. 2020 ఆగస్టు 9న, కొలంబో శివార్లలోని బౌద్ధ దేవాలయంలో రాజపక్సే నాల్గవసారి శ్రీలంక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5]

మానవ హక్కుల ఉల్లంఘన

మార్చు

శ్రీలంక అధ్యక్షుడు, రక్షణ మంత్రి మహింద రాజపక్స తమిళులకు వ్యతిరేకంగా అనేక మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని పలు అంతర్జాతీయ సంస్థలు ఆరోపించాయి.

  • ఫిబ్రవరి 2007లో, తమ అభిప్రాయాలను బహిర్గతం చేసినందుకు సైన్యం సహాయంతో 3 సింహళ జర్నలిస్టులు అపహరించబడ్డారు.
  • ఏప్రిల్ 2006లో ట్రింకోమలీలో జరిగిన తమిళ-వ్యతిరేక అల్లర్లను అణిచివేసేందుకు రాజపక్సే ఎలాంటి చర్య తీసుకోలేకపోయారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. ఈ ఘటనపై రాజపక్సే దృఢమైన ప్రకటన చేయడంలో విఫలమయ్యారని లేదా ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం లేదని ఇది ఆరోపించింది.
  • ఏప్రిల్ 2006లో, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ జూలై 2005లో జర్నలిస్టు తారకి శివరామ్ హత్య కేసులో నిందితుడిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
  • అతని రెండవ కొడుకు శ్రీలంక నేవీలో చేరినట్లు విస్తృత ప్రచారం జరిగినప్పటికీ, ప్రభుత్వ ఖర్చుతో ఉన్నత చదువుల కోసం లండన్‌కు పంపబడ్డాడు.
  • అతడిపై అమెరికాలో యుద్ధ నేరాల కేసు నమోదైంది.[6]


మూలాలు

మార్చు
  1. "Proud leader who defended the motherland". Silumina. Archived from the original on 2021-11-18. Retrieved 2021-06-08.
  2. Eenadu (10 May 2022). "మహీంద రాజపక్స రాజీనామా". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. "SRI LANKA: Reform and peace at stake in November poll". Oxford Analytica. Archived from the original on 23 November 2009. Retrieved 27 September 2005.
  4. "Mahinda Rajapaksa: Sri Lanka's long-time leader back in seat of power". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-11-21. Retrieved 2020-10-07.
  5. Srinivasan, Meera (2020-08-09). "Mahinda Rajapaksa takes oath as Sri Lankan Prime Minister". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-11-19.
  6. http://www.colombotelegraph.com/index.php/war-crime-case-against-mahinda-rajapaksa-dismissed-by-us-court/