మహేంద్రగిరి ఒరిస్సా, గజపతి జిల్లా, పర్లాకిమిడి ఉప విభాగం లోని పర్వత శిఖరం.[1] ఇది తూర్పు కనుమల్లో 1,501 మీ. ఎత్తున ఉంది.

మహేంద్రగిరి
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు1,501 m (4,925 ft)
నిర్దేశాంకాలు18°58′28″N 84°22′05″E / 18.97444°N 84.36806°E / 18.97444; 84.36806
భౌగోళికం
మహేంద్రగిరి is located in Odisha
మహేంద్రగిరి
మహేంద్రగిరి
మహేంద్రగిరి స్థానం
స్థానంపర్లాకిమిడి, ఒరిస్సా
పర్వత శ్రేణితూర్పు కనుమలు
అధిరోహణం
సులువుగా ఎక్కే మార్గంHike/scramble

పౌరాణిక ప్రశస్తి మార్చు

మహేంద్రగిరి ప్రసక్తి రామాయణంలో ఉంది. ఏడు కులపర్వతాల్లో మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమంత, వింధ్య, మాల్యవంత లతో పాటు ఇది కూడా ఒకటి.[2] ఇది కొంతకాలము పరశురామునికి నివాసస్థలముగాను ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడే పరశురాముఁడు, వివాహము చేసికొని మిథిల నుండి వస్తున్న శ్రీరాముని ఎదిరించి ఓడిపోయాడు. అతనికి విశ్వకర్మ నిర్మితమైన విష్ణుధనస్సును ఇచ్చాడు.[3] బ్రహ్మ హరిహరుల గురించి మహేంద్రగిరిపై తపస్సుచేసి భీమేశ్వరాలయాన్ని నిర్మించాడని అంటారు. పరశురాముడు సమస్త క్షత్రియులని వధించాక మహేంద్రగిరిపై తపస్సులో నిమగ్నుడయినాడు.బలరాముడు మహేంద్రగిరిపై ప్రతిష్ఠించిన మూడు లింగాలలో గోకర్ణేశ్వర లింగం ఒకటి.నేటికి కూడా ఉత్తర శ్రీకాకుళం, గుంజాం ప్రాంతాల ఊళ్ళలో పరశురామవేషధారి గొడ్దలి పట్టుకొని ఉరరూపంతో వచ్చి ఇంటింటికివచ్చి బియ్యాలెత్తుకోవడం కనబడుతుంది. బలరామక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో కోలువర్తని, వరాహవర్తని, రూపవర్తని (టెక్కలి), జలుమూరు మహేంద్రభోగం అన్నవి భాగాలు. పాండవులు తమ అజ్ఞాతవాసం మహేంద్రగిరిపై ఉండగా అర్జునుడు సముద్రతీరానికి వెళ్ళాడు.అక్కడ తెలియక ఒక గోవుని బాణంతో చంపాడు. గోవని తెలిసాక భీతిల్లి దీనిని మహేంద్రగిరిపై ఉన్న తమ్ముల దగ్గరకి తీసుకు వెళ్తుండగా దాని కోటిరక్తపుచుక్కలు బారువలోపడి అక్కడ కోటిలింగేశ్వరుడు వెలిసాడని పాప పరిహారార్ధం పాండవులు మహేంద్రగిరిపై లింగాన్ని ప్రతిష్ఠించారని జనశృతి. ....కళింగ మహిష మహేంద్ర భౌమాన్ గుహా భోక్ష్యయంతి అనే విష్ణు పురాణం కథనం బట్టి ఆరాజ్యాలను గుహుడనే రాజు ఏలినట్లు తెలుస్తున్నది. సా.శ.277-304 లేదా 334-361 సమకాలికుడూ బౌద్ధమతావలంబికుడు అయిన గుహుడనే ఒకరాజు ఉన్నాడు అతడే ఈగుహుడని చారిత్రుకుల అభిప్రాయము.గుప్తులు ప్రయాగ, సాకేత, మగధలతో గంగాతీరాల రాజ్యమేలుతున్న కాలంలో ఈగుహుడు దంతపురాన్ని (శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఆముదాలవలస దంతవక్తృకోట దగ్గర ప్రాంతం) రాజధానిగా పాలించేవాడు.ఇతడు సముద్రగుప్తుని కంటే మునపటివాడు.గుహునుకి మునుపు దాదాపు 800 సం.క్రితం మహాపరి నిర్వాణకాలాన (క్రీ.పూ.483 లేక 486-87) మల్ల రాజధాని కుశి నగరం నుంచి అప్పటి కళింగ రాజయిన బ్రహ్మదత్తుని చే తేబడిన బుద్ధుని నాల్గవ ఎడమకోరపన్ను (కళింగులకి వచ్చిన బుద్ధుని అవశేషం) దంతపురంలో స్థాపితం చేయబడి ఉండేది.ఆ దంతం శుభదాయకమని తెలుసుకొని, బౌద్ధమతంలోనికి మారి, దానిని మరింత భద్రంగా కాపాడుతుండెవాడు.దయాళువు, దాత అయి రక్తపాతాన్ని విడనాడి ప్రజారంజకంగా పాలించేవాడు.గుప్తులు మగధలో బలబంతులైనాక పాండులు క్షీణిస్తున్న సమయంలో గుహుడు పాండులనుంచి వీడి స్వతంత్ర రాజ్యం చేసాడు. కాని బుద్ధుని దంతం స్వంతం చేసుకోవటానికి ఇతనిపై దండెత్తి క్షీరధరుడను రాజుచేత చంపబడినాడు. ఈ దంతపురం మహేంద్రగిరి ప్రాంతంలో ఉంది. గుహుడు తరువాత చాలా కాలం బుద్ధుని నాల్గవ దంతం ఆతని కుమార్తె చేత శ్రీలంక పంపబడినది, అటుపై దానిని మరల పూరీ దేవాలయం ప్రాంతమునకు తేవబడింది. అక్కడే ఒక ఆరామంలో ఉంచబడింది. అటుపై వాటిపై పూరీ ఆలయం నిర్మించబడి ఉండవచ్చును.

అలానే ఒరిస్సానుంచి మధురై జిల్లావరకు సాగిన కనుమల్ని మహేంద్ర పర్వతాలని అనటం కూడా ఒక ఆనవాయితీ ఉంది.గంజాం, శ్రీకాకుళం జిల్లాలలోని తూర్పుకనుమల్ని ఇప్పటికీ మహేంద్రమౌళి అంటారు.కాళిదాసు వీటినే మహేంద్రమని స్పష్టంగా పేర్కొన్నాడు.వీటి స్థితి కళింగంలో అనికూడ చెప్పాడు.అంతేకాడు కళింగరాజుని మహేంద్ర ప్రభువన్నాడు.

అటుపై కళింగాన్ని పాలించిన తూర్పు గాంగులు మహేంద్రగిరిపై వెలసిఉన్న గోకర్ణేశ్వరుడు వరంతో రాజ్యాన్ని స్థాపించారు అన్నది ప్రసస్థి.వీరు అక్కడ దేవునికి ఒక మందిరాన్ని నిర్మించారు కూడా.వీరు గోకర్ణేశ్వరుడుని తమ కులదైవంగా వారి శాసనాలలో పేర్కొన్నారు.ఈయననే మలిగాంగులు మధూకేశ్వరునిగా వర్ణించారు.

బయోస్ఫియరు మార్చు

మహేంద్రగిరి 600 రకాల పుష్పించే మొక్కలకు స్థావరం. ఇక్కడి జీవవైవిధ్యం విస్తృతమైనది.[4] మహేంద్రగిరిని భయీస్ఫియర్ రిజర్వుగా గుర్తించాలని వివిధ కమిటీలు చెప్పాయి.[4]

ఒరిస్స అంతరిక్ష కేంద్రం ప్రకారం, పయోస్ఫియరు కోర్ ప్రాంతం 42.54 చ.కి.మీ., బఫరు ప్రాంతం 1577.02 చ.కి.మీ ఉంటుంది. దాని బయట ఉండే ట్రాన్సిషను ప్రాంతం 3095.76 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంటుంది. ప్రతిపాదిత బయోస్ఫియరు మొత్తం విస్తీర్ణం 4715.32 చ.కి.మీ ఉంటుంది.[4]

మూలాలు మార్చు

  1. Mahendragiri: the pride of Eastern Ghats 1993, p. 1
  2. Mahendragiri: the pride of Eastern Ghats 1993, p. 75
  3. Mahendragiri: the pride of Eastern Ghats 1993, p. 77
  4. 4.0 4.1 4.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-10. Retrieved 2020-06-14.