మహేంద్రనాథ్ గుప్తా
మహేంద్రనాథ్ గుప్తా (1854 జులై 14 - 1932 జూన్ 4) రామకృష్ణ పరమహంస గృహస్థాశ్రమ శిష్యుల్లో ఒకరు. ఈయననే మాస్టర్ మహాశయులు లేదా క్లుప్తంగా M అని కూడా పిలుస్తారు. ఈయన శ్రీరామకృష్ణ కథామృతం అనే పుస్తక రచయిత. ఇది బెంగాలీ భాషలో పేరొందిన పుస్తకం. ఇది ఆంగ్లంలో ది గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణగా అనువదించబడింది. ఈయన పరమహంస యోగానందకు చిన్నతనంలో ఆధ్యాత్మిక బోధకుడిగా వ్యవహరించాడు.
మహేంద్రనాథ్ గుప్తా | |
---|---|
జననం | కోల్‌కత్, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1854 జూలై 14
మరణం | 1932 జూన్ 4 కోల్‌కత్, పశ్చిమ బెంగాల్, భారతదేశం | (వయసు 77)
సుపరిచితుడు/ సుపరిచితురాలు | శ్రీరామకృష్ణ కథామృతం రచయిత, పరమహంస యోగానందకు ఆధ్యాత్మిక మార్గదర్శి |
జీవితం
మార్చుమహేంద్రనాథ్ గుప్తా 1854, జులై 14 న కోల్‌కతలో మదుసూదన్ గుప్తా, స్వర్ణమయి దేవి దంపతులకు జన్మించాడు. కలకత్తాలోని హేర్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఆయన ప్రెసిడెన్సీ కళాశాల నుంచి 1874లో బి. ఎ పట్టా పుచ్చుకున్నాడు. ఆయన చదువులో ప్రతిభావంతుడైన విద్యార్థి.[1] 1874 లో ఆయనకు నికుంజా దేవితో వివాహం అయింది. ఈమె బ్రహ్మ సమాజం నాయకుడైన కేశవ చంద్ర సేన్ కు బంధువైన ఠాకూర్ చరణ్ సేన్ కుమార్తె. చదువు పూర్తయిన తర్వాత ఈయన కొద్ది రోజులు ప్రభుత్వోద్యోగం, కొద్ది రోజులు ఒక వ్యాపార సంస్థలో పని చేసాడు. తర్వాత వివిధ కళాశలలో ఆంగ్లం, తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం బోధించాడు. కొంతకాలానికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్థాపించిన పాఠశాలలో ప్రధానాచార్య పదవిని అలంకరించాడు. ఇక్కడే ఆయనను మాస్టర్ మహాశయులు అని పిలవడం ప్రారంభించారు. తర్వాత రామకృష్ణ పరమహంస శిష్యగణంలో కొద్ది మంది, ఇంకా పరమహంస యోగానంద కూడా తన ఆత్మకథ పుస్తకంలో ఈ పేరును వాడారు.[2][3]
మూలాలు
మార్చు- ↑ Sen 2001, p. 36
- ↑ "M. (Mahendra Nath Gupta)". Sri Ramakrishna Sri Ma Prakashan Trust. Archived from the original on 17 ఫిబ్రవరి 2008. Retrieved 17 March 2008.
- ↑ Sen 2001, p. 37
ఆధార గ్రంథాలు
మార్చు- Nityatmananda, Swami; D P Gupta (June 1967). "M"--the apostle and the evangelist : a continuation of M's Gospel of Sri Ramakrishna. Rohtak, Sri Ramakrishna—Sri Ma Prakashan. OCLC 49257. (full book is 16 volumes)
- Chetanananda, Swami (1990). Ramakrishna as We Saw Him. Vedanta Society of St. Louis. ISBN 0-916356-65-5.
- Nikhilananda, Swami (June 1985). The Gospel of Sri Ramakrishna. Ramakrishna-Vivekananda Center. ISBN 978-0-911206-01-2.
- Kriyananda, Swami (2004). Conversations with Yogananda. Crystal Clarity Publishers. ISBN 1-56589-202-X.
- Smith, Bardwell Leith (1982). Hinduism: New Essays in the History of Religions. Brill. ISBN 90-04-06788-4.
- Yogananda, Paramhansa (2005). Autobiography of a Yogi. Crystal Clarity Publishers. ISBN 978-1-56589-212-5.
- Dasgupta, R.K (June 1986). Sri Sri Ramakrishna Kathamrita as a religious classic. Bulletin of the Ramakrishna Mission Institute of Culture.
- Hixon, Lex (2002). Great Swan: Meetings With Ramakrishna. Burdett, N.Y.: Larson Publications. ISBN 0-943914-80-9.
- Jackson, Carl T. (1994). Vedanta for the West. Indiana University Press. ISBN 0-253-33098-X.
- Gupta, Mahendranath ("M."); Dharm Pal Gupta (2001). Sri Sri Ramakrishna Kathamrita. Sri Ma Trust. ISBN 978-81-88343-00-3.
- D.P. Gupta; D.K. Sengupta, eds. (2004). Sri Sri Ramakrishna Kathamrita Centenary Memorial (PDF). Kolkata: Sri Ma Trust. Archived from the original (PDF) on 16 July 2011. Retrieved 21 August 2010.
- Sen, Amiya P. (June 2006). "Sri Ramakrishna, the Kathamrita and the Calcutta middle classes: an old problematic revisited". Postcolonial Studies. 9 (2): 165–177. doi:10.1080/13688790600657835. S2CID 144046925.
- Sen, Amiya P. (2001). "Three essays on Sri Ramakrishna and his times". Indian Institute of Advanced Study.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - Tyagananda; Vrajaprana (2010). Interpreting Ramakrishna: Kali's Child Revisited. Delhi: Motilal Banarsidass. p. 410. ISBN 978-81-208-3499-6.