ఆర్థిక శాస్త్రము

సాంఘిక శాస్త్రాలలో ఆర్థిక శాస్త్రము లేదా అర్ధ శాస్త్రము (Economics) ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ సంపద లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన ద్రవ్యంను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం ద్రవ్యంను మాత్రమే కాకుండా ద్రవ్యంతో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాల గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది.

భారతదేశానికి చెందిన ఆర్థిక నిపుణుడు చాణక్య

ఆర్థిక శాస్త్రము - పరిచయంసవరించు

ఆర్థిక శాస్త్రమునకు సమానార్థమైన ఎకనామిక్స్ అనే పదం గ్రీకు పదాలైన ఓకియో, నోమస్ అనే పదాల వల్ల ఏర్పడింది. గ్రీకు భాషలో ఒకియో అనగా గృహము, నోమస్ అనగా చట్టం లేదా శాసనము. ప్రారంభంలో దీనిని గృహ నిర్వహణ శాస్త్రం గానే పిలిచేవారు. కాని రాను రాను ఈ శాస్త్రం యొక్క పరిధి విస్తృతంగా పెరిగిపోయింది.

ఆర్థిక శాస్త్రము శాస్త్రమా- కళాసవరించు

ఆర్థిక శాస్త్రము - ప్రగతిసవరించు

ప్రాచీన కాలంలో అర్థ శాస్త్రముసవరించు

ప్రాచీన కాలం నుంచి ఆర్థిక సమస్యలు మానవ మేధస్సులో కల్గుతున్నాయి. ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు సంపద, వర్తకం లాంటి విషయాలను తమ గ్రంథాలలో వివరించారు. కాని ఒక శాస్త్రంగా మాత్రం ఇది 1776లో స్కాంట్లాండ్ ఆర్థిక వేత్త ఆడంస్మిత్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ అండ్ కాజెస్ ఆప్ ది వెల్త్ ఆప్ నేషన్స్ ప్రచురణతో అభివృద్ధి చెందింది.

మర్కెంటిలిజంసవరించు

శీర్షిక పాఠ్యంసవరించు

పిజియో క్రాట్స్సవరించు

సంప్రదాయవాదుల కాలంసవరించు

నవ్య సంప్రదాయవాదుల కాలంసవరించు

కీనీషియన్ యుగంసవరించు

కీన్స్ తర్వాతి యుగంసవరించు

ఆర్థిక శాస్త్రము - విభాగాలుసవరించు

సూక్ష్మ అర్థ శాస్త్రముసవరించు

దీనికి ధరల సిద్ధాంతం అని కూడా పేరు. ఇది ముఖ్యంగా సరఫరా, గిరాకీ ల వల్ల ధర ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల ఎంపిక విధానం, తనకున్న పరిమిత వనరులతో గరిష్ట సంతృప్తి చెందే ఎంపిక పద్దతి, వివిధ మార్కెట్లలో వినియోగదారుల, ఉత్పత్తి దారుల ప్రవర్తన, ఉత్పత్తి పద్దతులు, ఉత్పత్తి కారకాలు మొదలగు విషయాలను వివరిస్తుంది.

స్థూల అర్థ శాస్త్రముసవరించు

ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా జాతీయాదాయం, ఉద్యోగిత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా ద్రవ్య విధానం, కోశ విధానం లాంటి జాతీయ విధానాలను కూడా చర్చిస్తుంది. బ్రిటీష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ గ్రంథం వల్ల స్థూల శాస్త్రము ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి జాన్ మేనార్డ్ కీన్స్ను స్థూల ఆర్థిక శాస్త్రపు పితామహుడుగా పిలవవచ్చు.

ఆర్థిక శాస్త్రము - నిర్వచనాలుసవరించు

'అర్ధ శాస్త్రము' లేదా 'ఆర్ధిక శాస్త్రము'ను అనేక విధాలుగా నిర్వచించారు[1]. అసలు నిర్వచించే ప్రయత్నమే నిష్ప్రయోజనమని (పారిటో, మిర్డాల్ వంటి) కొందరు భావించారు. స్థూలంగా ఆర్థిక శాస్త్ర నిర్వచనాలు మూడు విధానాలలో ఇవ్వబడ్డాయి.

  1. 'సంపద' (Wealth) ఆధారంగా నిర్వచనం - ఆడమ్ స్మిత్, అతని మార్గీయులది - సంపదను గూర్చిన విధానాల అధ్యయనం ఆర్ధిక శాస్త్రం
  2. 'శ్రేయస్సు' (Welfare) ఆధారంగా నిర్వచనం - ఆల్ఫ్రెడ్ మార్షల్, అతని మార్గీయులది - అర్ధశాస్త్రము మానవుని దైనిక జీవనాన్ని గురించి పరిశీలించే ఒక విజ్ఞాన వర్గము. మానవుని శ్రేయస్సుకు కారణాలైన భౌతిక సాధనాల అర్జన, వినియోగాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల అధ్యయనం
  3. 'కొరత' (Scarcity) ఆధారంగా నిర్వచనం - రాబిన్స్ విధానం - మానవుని (అపరిమితమైన) కోర్కెలకు, వాటిని తీర్చుకొనేందుకు ఉన్న (పరిమితమైన) వనరులు, సాధనాలకు, ఈ నేపధ్యంలో మానవుని ప్రవర్తనకు చెందిన అధ్యయనమే ఆర్ధిక శాస్త్రం

ఆర్థిక శాస్త్రము - సూత్రాలు - సిద్ధాంతాలుసవరించు

డిమాండు సప్లై సూత్రంసవరించు

ధరల నిర్ణయంసవరించు

గరిష్ట సంతృప్తి సూత్రంసవరించు

పంపిణీ సిద్ధాంతాలుసవరించు

భారత దేశము లో ఆర్థిక శాస్త్రము - ప్రగతిసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు, వనరులుసవరించు

  1. Economics has suffered more than any other discipline from the malice of polemics about the definition & method - E.R. ఫ్ఘ్A. Seligan.