మహేష్ 2013లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2013 ఏప్రిల్లో ‘యారుడా మహేశ్’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో మహేష్ పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేశ్ కొండేటి నిర్మించాడు. సందీప్ కిషన్, డింపుల్, జగన్‌, లివింగ్‌స్టన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 20, 2013న విడుదలైంది.[1]

మహేష్
Mahesh movie.jpg
దర్శకత్వంఆర్. మదన్ కుమార్
రచనఆర్. మదన్ కుమార్
స్క్రీన్ ప్లేఆర్. మదన్ కుమార్
కథఆర్. మదన్ కుమార్
నిర్మాతసురేష్ కొండేటి
తారాగణంసందీప్ కిషన్, డింపుల్, జగన్‌, లివింగ్‌స్టన్‌
ఛాయాగ్రహణంరాణా
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థ
ఎస్‌.కె. పిక్చర్స్‌
విడుదల తేదీ
2013 సెప్టెంబరు 20 (2013-09-20)
భాషతెలుగు

కథసవరించు

శివ (సందీప్ కిషన్), వసంత్ (జగన్) ఇద్దరు మిత్రులు. శివ తన కాలేజ్ లో చదివే సంధ్య (డింపుల్) ని చూసి ప్రేమలో పడతాడు. సంధ్య కూడా శివపై మనసు పడి వారి ప్రేమ ముదిరి ఆమె గర్భవతి అవుతుంది, దాంతో వాళ్లిదరు పెళ్లి చేసుకుంటారు. శివకి పుట్టిన బిడ్డకి తను తండ్రే కాదని మహేష్‌ అనే వ్యక్తి కారణమనే విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శివ మహేష్ ని వెతికే పనిలో పడతాడు. అసలు ఈ మహేష్ ఎవరు ? శివ చివరికి మహేష్ ని పట్టుకోగలిగాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులుసవరించు

 • సందీప్ కిషన్
 • డింపుల్
 • జగన్‌
 • లివింగ్‌స్టన్
 • శ్రీనాథ్
 • రోబో శంకర్
 • వెంకట్ సుందర్
 • స్నేహ రమేష్
 • సింగముత్తు
 • ఉమా పద్మనాభన్
 • స్వామినాథన్
 • నీలు నస్రీన్
 • అజిత్ కుమార్
 • అర్చన హరీష్
 • నీళ్ళై శివ
 • రామర్
 • వడివేలు బాలాజీ
 • సన ఒబెరాయ్

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ఎస్‌.కె. పిక్చర్స్‌
 • నిర్మాత: సురేష్ కొండేటి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌. మదన్‌ కుమార్‌
 • సంగీతం:గోపీ సుందర్‌
 • సినిమాటోగ్రఫీ: రాణ

మూలాలుసవరించు

 1. iQlikmovies (14 September 2013). "SUNDEEP KISHAN'S MAHESH ON 20TH SEPTEMBER" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
 2. Telugu Great Andhra (9 October 2013). "సినిమా రివ్యూ: మహేష్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మహేష్&oldid=3609458" నుండి వెలికితీశారు