మహేష్ మంజ్రేకర్

భారతీయ నటుడు

మహేశ్ మంజ్రేకర్ (జననం: 1953 మే 13) ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత.[2] అతను దర్శకత్వం వహించిన వాస్తవ్ - ద రియాలిటీ (1999), అస్తిత్వ (2000), విరుద్ధ (2005) విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందాయి. ఒక జాతీయ పురస్కారం, రెండు స్టార్ స్క్రీన్ అవార్డులు పొందాడు.

మహేశ్ మంజ్రేకర్
జననం (1953-05-13) 1953 మే 13 (వయసు 71)
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, ఎడిటర్, రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1984 – ప్రస్తుతం
రాజకీయ పార్టీమహారాష్ట్ర నవనిర్మాణ సేన
జీవిత భాగస్వామిమేధా మంజ్రేకర్
పిల్లలుఅశ్వని మంజ్రేకర్, సత్య మంజ్రేకర్, సాయి మంజ్రేకర్
వెబ్‌సైటుhttp://www.maheshmanjrekar.com/[1]

దర్శకత్వమే కాకుండా తన స్వంత చిత్రాలే కాకుండా పలు చిత్రాల్లో నటించాడు. 2002 లో వచ్చిన కాంటే అనే సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. తరువాత 2007లో ఒక్కడున్నాడు అనే సినిమాలో ప్రతినాయకుడి పాత్ర, ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో ఆయ పోషించిన గ్యాంగ్ స్టర్ జావెద్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టాయి. మే శివాజీ మహరాజ్ భోసలే బోల్తాయ్ అనే మరాఠీ సినిమాలో శివాజీ పాత్రను పోషించాడు. సల్మాన్ ఖాన్ సినిమా వాంటెడ్లో పోలీసు అధికారి తల్పదేగా నటించాడు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్ర నవనిర్మాణ సేన తరపున ముంబై నార్త్ వెస్ట్ ప్రాంతానికి ఎంపీగా పోటీచేశాడు. కానీ శివసేన అభ్యర్థి గజానన్ కీర్తికర్ చేతిలో పరాజయం పాలయ్యాడు.[3][4]

ఆయనకు అండర్ వరల్డ్ తో సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి.[5]

సినిమాలు

మార్చు
తెలుగు

మూలాలు

మార్చు
  1. "Mahesh Manjarekar's Official Website Launch". MarathiStars.
  2. "The day my work suffers, I'll retire". Rediff.com. 12 November 2001. Retrieved 21 August 2011.
  3. "Mahesh Manjrekar was MNS Candidate from Mumbai North West". IANS. news.biharprabha.com. Retrieved 9 March 2014.
  4. "Celeb politicians: who won and who lost". Hindustan Times. 16 May 2014. Archived from the original on 22 అక్టోబరు 2014. Retrieved 17 October 2014.
  5. "Manjrekar refuses to reveal Chhota Shakeel's name". Archived from the original on 2013-12-16. Retrieved 2016-09-24.