మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ భారతదేశం లోని అత్యంత పురాతనమైన క్రీడా క్లబ్బు. 2014 నాటికి దీనికి 123 సంవత్సరాలు నిండాయి. కానీ ఆర్థిక కారణాల వలన 2014లో ఇది దివాళా తీయనున్నట్లు ప్రకటించి వార్తలలో నిలిచింది[1].
logo | |||
పూర్తి పేరు | మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ | ||
---|---|---|---|
ఇతర పేర్లు | బ్లాక్ పాంధర్స్ | ||
ప్రారంభము | 1891 as Jubilee Club | ||
Ground | సాల్ట్‌లేక్ స్టేడియం కోల్‌కత, పశ్చిమ బెంగాల్ | ||
Capacity | 120,000 | ||
Chairman | జమీల మంహర్ | ||
మేనేజరు | సంజొయ్ సేన్ | ||
లీగ్ | ఐ-లీగ్ | ||
2013 | ఐ-లీగ్ రెండవ అంచె, రెండవ స్థానము | ||
వెబ్‌సైటు | Club home page | ||
| |||
సాధించిన విజయాలు
మార్చుమూసివేత
మార్చుభారత అతి పురాతనమైన, అతి పెద్దదైన ఫుట్‌బాల్ క్లబ్ మహ్మదన్ స్పోర్టింగ్ ఆఫ్ కోల్‌కతాను మూసివేతకు గురైంది. వర్కింగ్ కమిటీ సమావేశంలో క్లబ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షభమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా ఈ క్లబ్ ఆటగాళ్లు జీతాలు తీసుకోలేదు. గతేడాది డ్యూరండ్ కప్, ఐఎఫ్‌ఎ షీల్డ్ ట్రోఫీలను గెలుచుకున్న మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ ప్లేయర్స్‌కు, కోచింగ్ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వడంలో నానా ఇబ్బందులు పడుతోంది. దీంతో అటు ఆటగాళ్లలో, ఇటు కోచింగ్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఇక ఎక్కువ కాలం జట్టుపై అజమాయిషీ చేయలేమన్న నిర్ణయానికి వచ్చింది క్లబ్. అంతేకాకుండా జీతాలు ఇవ్వలేకపోతుండడంతో విదేశీ ఆటగాళ్లు మరో దారి చూసుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చింది[1].