మహ్మద్ సర్తాజ్ మద్నీ

మహ్మద్ సర్తాజ్ మద్నీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2002, 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, జమ్మూ కాశ్మీర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[3][4]

మహ్మద్ సర్తాజ్ మద్నీ

పదవీ కాలం
2008 – 2013
తరువాత మహ్మద్ అమీన్ భట్
నియోజకవర్గం దేవ్‌సర్

పదవీ కాలం
2002 – 2007
ముందు పీర్జాదా గులాం అహ్మద్
నియోజకవర్గం దేవ్‌సర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
బంధువులు మెహబూబా ముఫ్తీ (మేనకోడలు)[1]
సంతానం అరూత్ మద్నీ[2]
నివాసం జమ్మూ కాశ్మీర్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మహ్మద్ సర్తాజ్ మద్నీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ (ఎం) అభ్యర్థి మహ్మద్ యాకూబ్‌ను 3026 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మహ్మద్ సర్తాజ్ మద్నీ 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి పీర్జాదా గులాం అహ్మద్ షాపై 4001 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (23 July 2018). "Mehbooba Mufti's uncle Sartaj Madni quits as PDP Vice President" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  2. Greater Kashmir (9 June 2024). "PDP leader Sartaj Madni's son dies of heart attack". Retrieved 14 October 2024.
  3. TimelineDaily (9 September 2024). "Devsar Constituency: Four Key Players In The Fray" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  4. The New Indian Express (4 December 2017). "Mehbooba Mufti nominates Mohammad Sartaj Madni for PDP vice-president post" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Devsar". Retrieved 14 October 2024.