మాండవి కుశధ్వజుని కుమార్తె. శ్రీరాముని తమ్ముడు భరతుని భార్య.[1]

మాండవి
The four sons of Dasaratha circumbulate the altar during their marriage rites.jpg
దశరథుని నలుగురు కుమారులు వారి వివాహ వేడుక సమయంలో ప్రదక్షిణ చేస్తున్న దృశ్యం
తోబుట్టువులుశ్రుతకీర్తి (సోదరి)
సీత, ఊర్మిళ (బంధువులు)
పిల్లలుతక్ష, పుష్కల
తండ్రికుశధ్వజ
తల్లిచంద్రభాగ

హిందూ ఇతిహాసం ప్రకారం రామాయణంలో, కుశధ్వజ మహారాజు, చంద్రభాగల కుమార్తె మాండవి. కుశధ్వజ మహారాజు జనక మాహారాజుకు సోదరుడు. అతని సోదరుని కుమార్తె సీత రామాయణంలో ప్రధాన పాత్ర. ఆమె శ్రీరాముని వివాహం చేసుకుంది. ఆ సమయంలో శ్రీరాముని సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు లకు కూడా వివాహాలు జరిగాయి. ఆ సందర్భంలో మాండవి భరతుడిని వివాహమాడింది.

అప్పటి కుశధ్వాజ ఆస్థానం రాజ్‌బీరాజ్ ప్రాంతం చుట్టూ ఉండవచ్చు. ఈ ప్రాంతంలో మాండవి జన్మించి ఉండవచ్చు. వారి కుటుంబ ఆలయం చారిత్రక అవశేషాలు రాజ్‌దేవి ఆలయం చుట్టూ ఉన్నాయి. వారికి తక్ష, పుష్కల అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఒక చెల్లెలు శ్రుతకీర్తి.

మూలాలుసవరించు

  1. "Mandavi: "I Am Bharata's Wife And The Loneliest Woman In The Kingdom"". Bonobology.com (in ఇంగ్లీష్). 2019-04-10. Retrieved 2020-05-24.
"https://te.wikipedia.org/w/index.php?title=మాండవి&oldid=3048938" నుండి వెలికితీశారు