మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం

అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం. మాచ్ ఖండ్ నదిపై ఏర్పడిన 260 మీటర్ల ఎత్తుగల డుడుమా జలపాతాన్ని ఆధారంగా చేసుకొని ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ కేంద్రం 1955 నుండి విద్యుత్ ఉత్ప్తత్తి చేయడం ప్రారంభించింది. ఈ జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా ప్రభుత్వాలు 70-30 నిష్పత్తిలో ఖర్చును భరించి నిర్మించాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ డెబ్భై శాతం ఆంధ్ర ప్రదేశ్ ముప్పై శాతం ఒడిషా ప్రభుత్వాలు వాడుకొంటాయి. ఇక్కడనుండి విద్యుత్ ప్రదానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృస్ణా, గుంటూరు జిల్లాలకు సరఫరా అవుతున్నది.