మాడపాటి సత్యవతి
మాడపాటి సత్యవతి ఆకాశవాణిలో తొలిసారి వార్తలు చదివిన మహిళ.[1] ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2]
మాడపాటి సత్యవతి | |
---|---|
జననం | |
మరణం | మార్చి 4, 2020 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ఆకాశవాణిలో తొలిసారి వార్తలు చదివిన మహిళ |
తల్లిదండ్రులు | మాడపాటి రామచందర్‌రావు |
బంధువులు | మాడపాటి హనుమంతరావు (తాత) |
జీవిత విశేషాలు
మార్చుహైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనువరాలైన సత్యవతి, హైదరాబాదులో జన్మించింది. సత్యవతి తండ్రి మాడపాటి రామచందర్‌రావు హైదరాబాద్ నగర విమోచన ఉద్యమంలో పాల్గొన్నాడు. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలను చూసింది. తెలుగు చదువుకోవడంపై నిషేధం ఉన్న కాలంలోనే హనుమంతరావు స్థాపించిన తెలుగు బాలికల ఉన్నత పాఠశాలలో సత్యవతి చదువుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి ఎంఏ తెలుగులో పట్టా సాధించింది.[3]
ఆకాశవాణిలో
మార్చుఆకాశవాణిలో వార్తలు చదివిన తొలి మహిళా పాత్రికేయురాలిగా అరుదైన రికార్డును నెలకొల్పిన సత్యవతి, 35 ఏళ్ళపాటు వార్తా వ్యాఖ్యాతగా, ఎడిటర్‌గా పనిచేసింది. వార్తావాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.[4] 1991లో పదవీవిరమణ పొందిన సత్యవతి, ఆ తరవాత పత్రికలకు వ్యాసాలు రాసింది.[5]
బహుమతులు - పురస్కారాలు
మార్చు- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
మరణం
మార్చుసత్యవతి హైదరాబాదు, పద్మరావునగర్‌లోని తన నివాసంలో 2020, మార్చి 4న మరణించింది.[6]
మూలాలు
మార్చు- ↑ Telangana Today, Hyderabad (4 March 2020). "Madapati Satyavathi, popular news reader no more". Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 12 April 2017.
- ↑ ఆంధ్రభూమి, తెలంగాణ (5 March 2020). "తొలి మహిళా న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి కన్నుమూత". www.andhrabhoomi.net. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 9 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ (5 March 2020). "ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్ సత్యవతి కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (5 March 2020). "మొదటి రేడియో వ్యాఖ్యాత సత్యవతి కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 5 మార్చి 2020. Retrieved 9 March 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (5 March 2020). "మాడపాటి సత్యవతి ఇక లేరు". www.andhrajyothy.com. Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.