తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు అందజేసే పురస్కారం.[1] గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.[2]
2017 పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో 13 కేటగిరీలకుగాను 24 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసింది.[3][4] వీరికి 2017, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ లోని లలిత కళా తోరణంలో లక్ష రూపాయల నగదు పురస్కారంతో సత్కరించడం జరిగింది.[5][6][7] ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎం.పి కల్వకుంట్ల కవిత, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిడి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్ష్యుడు సినిగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు పాల్గొని పురస్కారాలు అందజేశారు.
పురస్కార గ్రహీతలు
మార్చుచిత్రమాలిక
మార్చు-
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న ప్రొ. విద్యావతి
-
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న కట్ట కవిత
-
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న మూల విజయారెడ్డి
-
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న తిరునగరి దేవకీదేవి
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 8 March 2017.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (7 March 2018). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 8 March 2018.
- ↑ ఈనాడు, వసుంధర. "మహిళా ప్రతిభకు పురస్కారాలు". vasumdhara.com. Retrieved 28 March 2017.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 6 April 2017.
- ↑ www.siasat.com. "INTERNATIONAL WOMEN'S DAY ON MARCH 8—TS GOVT TO HONOUR EMINENT WOMEN". www.siasat.com. Retrieved 8 March 2017.
- ↑ సాక్షి. "తెలంగాణ మహిళా మణులు వీరే." Retrieved 8 March 2017.
- ↑ డైలీహంట్. "వరంగల్ ఓరుగల్లు వనితల ఘనత". m.dailyhunt.in. Retrieved 8 March 2017.[permanent dead link]