మాణిక్‌రావు కోకాటే
మాణిక్‌రావు కోకాటే (జననం 26 సెప్టెంబర్ 1957) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సిన్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]
మాణిక్‌రావు శివాజీరావు కొకాటే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 డిసెంబరు 15 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | ధనంజయ్ ముండే | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | రాజభౌ వాజే | ||
నియోజకవర్గం | సిన్నార్ | ||
పదవీ కాలం 1999 – 2014 | |||
ముందు | తుకారాం డిఘోలే | ||
తరువాత | రాజభౌ వాజే | ||
నియోజకవర్గం | సిన్నార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1957 సెప్టెంబర్ 26 నాసిక్ , బొంబాయి రాష్ట్రం , భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2019 నుండి) ఐఎన్‌సీ (2009-2019) శివసేన (2009 వరకు) | ||
పూర్వ విద్యార్థి | పూణే విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుమాణిక్రావు కోకాటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఎన్‌సీపీలో చేరగా ఆయన 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సిన్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించగా దక్కకపోవడంతో శివసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణేతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మాణిక్‌రావు కోకాటే 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సిన్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయనకు ఈ ఎన్నికలలో 1,34,299 ఓట్లు వచ్చాయి. మాణిక్‌రావు కోకాటే అక్టోబర్ 2019లో తిరిగి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సిన్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై[3], 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ "कधी काँग्रेसवासी, कधी शिवसैनिक, कधी भाजपवासी तर कधी राष्ट्रवादी, कोण आहेत माणिकराव कोकाटे?; वाचा सविस्तर". TV9 Marathi. 15 September 2021. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Sinnar". Election Commission of India. 23 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.