ప్రధాన మెనూను తెరువు

మాతా అమృతానందమయి దేవి (Mātā Amritanandamayī Devī) (దేవనాగరి: माता अमृतानन्‍दमयी, మలయాళం:മാതാ അമൃതാനന്ദമയി, అసలు పేరు: సుధామణి ఇడమాన్నేల్, జననం: 1953 సెప్టెంబరు 27) ఒక హిందూ ఆధ్యాత్మిక నేత మరియు బోధకురాలు, ఆమెను భక్తులు దైవ సమానురాలుగా పూజించడంతోపాటు, "అమ్మ ", "అమ్మాచి" లేదా "తల్లి"గా కూడా పిలుస్తున్నారు. మానవతా కార్యక్రమాలు ద్వారా ఆమె ప్రసిద్ధి చెందారు.[1] కొన్నిసార్లు ఆమెను "ఆలింగనం చేసుకునే దైవంగా" సూచిస్తున్నారు.[2][3]

మాతా అమృతానందమయి దేవి
Mata Amritanandamayi.jpg
దర్శనాన్ని ప్రసాదిస్తున్న మాత
ఉల్లేఖన"There is one Truth that shines through all of creation. Rivers and mountains, plants and animals, the sun, the moon and the stars, you and I—all are expressions of this one Reality."

మాతా అమృతానందమయి మఠం వైస్-ఛైర్మన్ స్వామి అమృతస్వరూపానంద పూరీ మాట్లాడుతూ, అమ్మకు ఇతరుల బాధలను తొలగించడం, తన కన్నీటిని తుడుచుకున్నంత సహజమని చెప్పారు. ఇతరుల సంతోషమే అమ్మ సంతోషం. ఇతరుల భద్రతే అమ్మ భద్రత. ఇతరుల విశ్రాంతి, అమ్మ యొక్క విశ్రాంతి. ఇదే అమ్మ యొక్క లక్ష్యమని అని పూరీ తెలిపారు. మానవాళిని మేల్కొలిపే ఈ లక్ష్యం కోసం అమ్మ తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు.[4]

జీవిత చరిత్రసవరించు

మాతా అమృతానందమయి దేవి అసలు పేరు సుధామణి ఇడమన్నేల్, 1953లో కేరళ రాష్ట్రంలోని కొల్లామ్ జిల్లాలో అలప్పాడ్ పంచాయితీలో ఉన్న పారాయకాడవు (ఇప్పుడు కొందరు ఈ గ్రామాన్ని అమృతపురిగా గుర్తిస్తున్నారు) అనే కుగ్రామంలో ఆమె జన్మించారు.[5] తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆమె పాఠశాల విద్య ముగిసింది, ఆపై ఆమె తన కంటే చిన్నవారైన తోబుట్టువుల ఆలనాపాలనలను చూసుకోవడం ప్రారంభించారు, పూర్తిస్థాయిలో కుటుంబానికి సంబంధించిన ఇంటి పని చేయడానికి పరిమితమయ్యారు.[6]

రోజువారీ పనుల్లో భాగంగా, సుధామణి తన కుటుంబం యొక్క ఆవులు మరియు గొర్రెలకు ఆహారం కోసం గ్రామ పరిసర ప్రాంతాలకు వెళ్లి గడ్డి తీసుకొచ్చేవారు. ఈ సమయంలోనే తీవ్ర దారిద్ర్యం మరియు ఇతరుల ఎదుర్కొంటున్న బాధలు తనను ప్రభావితం చేశాయని అమ్మ చెప్పారు. ఆపై ఆమె తన ఇంటి నుంచి ఆహారం మరియు దుస్తులను వారి కోసం తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె కుటుంబం కూడా సంపన్నమైనదేమీ కాదు, దీంతో ఆమెను కుటుంబ సభ్యులు తిట్టడం మరియు కొట్టడం వంటి ఇబ్బందులకు గురి చేశారు. అమ్మ దుఃఖంలో ఉన్నవారిని చూసిన వెంటనే వారిని ఆలింగనం చేసుకొని ఓదార్చేవారు. ఒక 14 ఏళ్ల బాలిక ఇతరులను, ముఖ్యంగా పురుషులను ఆలింగనం చేసుకోవడం నిషిద్ధం. తన తల్లిదండ్రుల నుంచి ప్రతికూలమైన స్పందనలు వచ్చినప్పటికీ, అమ్మ తన పనులను కొనసాగించారు.[6] ఇతరులను ఆలింగనం చేసుకోవడం గురించి, అమ్మ మాట్లాడుతూ, నేను వారు పురుషుడు లేదా స్త్రీ అనే విభజనను చూడనని చెప్పారు. తనకు భిన్నమైనవారిగా తానెవరినీ చూడనని పేర్కొన్నారు. సమస్త సృష్టికి నిరంతరం తన నుంచి ప్రేమ ప్రవహిస్తుందని తెలిపారు. ఇది తనకు పుట్టుకతో వచ్చిన స్వభావమని చెప్పారు. ఒక వైద్యుడి యొక్క విధి రోగులకు చికిత్స చేయడం. అదే విధంగా, నా విధి బాధల్లో ఉన్నవారిని ఓదార్చడమని తెలిపారు.

ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, వచ్చిన వరులను అమ్మ తిరస్కరించారు.[7] 1981లో పారాయకాడవులో ఆమె తల్లిదండ్రుల భూమిలో పలువురు నివసించడం మొదలుపెట్టిన తరువాత, అమ్మ శిష్యుల కోసం ఒక ప్రపంచవ్యాప్త సంస్థ మాతా అమృతానందమయి మఠాన్ని స్థాపించారు.[8] మఠం యొక్క ఛైర్‌పర్సన్‌గా అమ్మ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాతా అమృతానందమయి మఠం అనేక ఆధ్యాత్మిక మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.[9]

1987లో, భక్తుల విజ్ఞప్తిపై, అమ్మ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, చిలీ, దుబాయ్, ఇంగ్లండ్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, హాలెండ్, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, కెన్యా, కువైట్, మలేషియా, మారిషష్, రీయూనియన్, రష్యా, సింగపూర్, స్పెయిన్, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, తదితర దేశాల్లో ఆమె కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె ప్రతి ఏడాది భారతదేశంలో కూడా వార్షిక పర్యటనలు నిర్వహిస్తున్నారు.[10]

దర్శనంసవరించు

సంస్కృతంలో దర్శన్ అంటే "దర్శనం" అనే అర్థం వస్తుంది. హిందూ మత సంప్రదాయంలో, పుణ్యవ్యక్తులను సందర్శించడాన్ని ఈ పదం సూచిస్తుంది.[11] ఇది ఎక్కువగా ఒక ఆలయంలోని దైవుని ప్రతిమ ద్వారా పవిత్రమైనవారిని దర్శించడాన్ని తెలియజేస్తుంది. ఒక దేవత యొక్క ప్రతిమను దర్శించడంలో, వీక్షకులు దేవత యొక్క శక్తులను తమ కళ్లతో గ్రహిస్తారు.[12] అందువలన దర్శనానికి అదృష్టం, సంక్షేమం మరియు అనుగ్రహాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఉందని భావిస్తారు. అమ్మ యొక్క భక్తులు, అమ్మ నుంచి ఆలింగనాన్ని అపేక్షించడాన్ని సూచించేందుకు ముఖ్యంగా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

బాలికగా ఉన్నప్పటి నుంచి అమ్మ ఇటువంటి పద్ధతిలో దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ సంప్రదాయం ఏ విధంగా ప్రారంభమైందనే ప్రశ్నకు అమ్మ బదులిస్తూ, ప్రజలు వారి ఇబ్బందులను తన వద్దకు వచ్చి చెప్పుకోవడం ప్రారంభించిన సమయం నుంచి ఈ సంప్రదాయం ఉందని తెలిపారు. వారు ఏడ్చేవారు, వారి కన్నీళ్లను తుడిచి నేను ఓదార్చాను. నా ఒడిలో పడుకొని వారు ఏడుస్తున్నప్పుడు, వారిని ఆలింగనం చేసుకోవడం మొదలుపెట్టాను. తరువాతి వ్యక్తి కూడా తన ఓదార్పును కోరుకునేవారు... తద్వారా ఆ ఆచారం కొనసాగుతూ వచ్చిందని చెప్పారు.[13] ప్రపంచవ్యాప్తంగా 29 మిలియన్ల మంది పౌరులను అమ్మ ఆలింగనం చేసుకొని ఓదార్చారని అమ్మ సంస్థ మాతా అమృతానందమయి మఠం పేర్కొంది.[14] · [3]

2002లో తన ఆలింగనం ప్రపంచంలో ఎంతమంది దురదృష్టవంతులకు సాయపడిందని అడిగిన ప్రశ్నకు? అమ్మ ఇచ్చిన సమాధానం, నేను 100 శాతం సాయపడ్డానని చెప్పలేను. ప్రపంచాన్ని మార్చేందుకు (పూర్తిగా) ప్రయత్నించడం కుక్క తోక వంపును పోగొట్టడానికి ప్రయత్నించడమేనని చెప్పారు. అయితే సమాజం ప్రజల్లో నుంచి పుట్టుకొస్తుంది. అందువలన వ్యక్తులను ప్రభావితం చేయడం ద్వారా, సమాజంలో మీరు మార్పులు చేయవచ్చు, తద్వారా ప్రపంచంలో కూడా మార్పు తీసుకురావొచ్చని తెలిపారు. మీరు దీనిని పూర్తిగా మార్చలేరు, అయితే మార్పులు చేయవచ్చు. వ్యక్తుల మనస్సుల్లో పోరాటం యుద్ధాలకు కారణం. అందువలన మీరు వ్యక్తులను ప్రభావితం చేయగలిగితే, ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయవచ్చని చెప్పారు.[13]

అమ్మ దర్శనం ఆమె జీవితంలో ప్రధాన భాగంగా ఉంది, 1970వ దశకం నుంచి ఆమె ప్రతి రోజూ భక్తులకు దర్శనాన్ని అందిస్తున్నారు. అమ్మ ఆశీర్వాదానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది, అమ్మ రోజులో 20 గంటలకుపైగా దర్శనం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.[7] 2004 పుస్తకం ఫ్రమ్ అమ్మాస్ హార్ట్ అనే పుస్తకంలో రికార్డు చేసిన ఒక సంభాషణలో, అమ్మ మాట్లాడుతూ: ఈ చేతులు కొద్దిగా అయినా కదిలి తన కోసం వచ్చేవారిని ఓదార్చగలిగినంత వరకు, ఏడుస్తున్న వ్యక్తి భుజంపై చేతులు ఉంచి, లాలించి మరియు వారి కన్నీళ్లను తుడిచేందుకు అవసరమైన కొద్ది బలం మరియు శక్తి తన వద్ద ఉన్నంత వరకు అమ్మ దర్శనం కొనసాగుతుందని చెప్పారు. చివరి వరకు ఈ అనిత్యమైన జీవితంలో ప్రజలను ప్రేమగా లాలించడానికి, ఊరడించడానికి మరియు వారి కన్నీళ్లను తుడిచే శక్తి కలిగివుండాలని అమ్మ ఆకాంక్షిస్తుంది.[15]

బోధనలుసవరించు

అమ్మ ప్రియ శిష్యుల్లో ఒకరైన స్వామి రామకృష్ణానంద పూరీ ది టైమ్‌లెస్ పాత్ అనే పుస్తకంలో ఈ విధంగా రాశారు: అమ్మ బోధించిన ఆధ్యాత్మిక మార్గం వేదాల్లో ప్రతిపాదించిన మరియు తరువాత భగవద్గీత వంటి సాంప్రదాయిక గ్రంథాల్లో సంగ్రహీకృతం చేయబడిన మార్గాన్నే సూచిస్తుంది.[16] "కర్మ (పని), జ్ఞానం మరియు భక్తి అన్నీ అత్యవసరమైనవని అమ్మ కూడా చెప్పారు. ఒక పక్షి యొక్క రెండు రెక్కలు భక్తి మరియు పని అయితే, జ్ఞానం దాని తోక అవుతుంది. ఈ మూడు భాగాల సాయంతోనే పక్షి ఎత్తుకు ఎగురుతుంది.[17] మనస్సును పరిశుభ్రం చేసే ఏకైక లక్ష్యం ఉన్న వివిధ పద్ధతులుగా, అమ్మ వివిధ ఆధ్యాత్మిక పద్ధతులను మరియు అన్ని మతాల ప్రార్థనలను స్వాగతించారు.[18] ఈ మార్గాల్లో, ఆమె ధ్యానం యొక్క ప్రాధాన్యతను ఉద్ఘాటించారు, కర్మ యోగా, నిస్వార్థ సేవ మరియు దయ, సహనం, క్షమ, స్వీయ-నియంత్రణ, తదితర దైవ లక్షణాలు పెంపొందించడంపై దృష్టి పెట్టారు. ఈ ఆచరణలు మనస్సును శుద్ధి చేస్తాయని, అంతిమ వాస్తవాన్ని ఇముడ్చుకునే సామర్థ్యాన్ని పొందేందుకు అమ్మ చెప్పారు: ఈ అంతిమ వాస్తవం పరిమితమైన శరీరం మరియు మనస్సును కాకుండా, అనంతమైన ఆనందప్రద చైతన్యాన్ని సూచిస్తుంది, ఇది విశ్వం యొక్క ద్వైతేతర అధస్తరంగా పనిచేస్తుందని తెలిపారు.[16] ఈ అవగాహనను అమ్మ జీవనముక్తి [బతికుండగానే విమోచనం పొందడం]గా సూచించారు. అమ్మ బోధనల ప్రకారం, జీవనముక్తి అనేది మరణించిన తరువాత పొందేది కాదు, అదే విధంగా మరో ప్రపంచంలో అనుభవించేది లేదా పొందేది కాదు. ఇది ఒక సంపూర్ణ అవగాహన మరియు సమభావం ఉండే దశ, ఇటువంటి దశను ఇక్కడ మరియు ఈ ప్రపంచంలోనే ఈ శరీరంతో జీవించివుండగానే అనుభవించవచ్చు. స్వయంగా ఏకత్వం యొక్క అత్యున్నత వాస్తవాన్ని గ్రహించినటువంటి పావనమైన ఆత్మలు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు. అవి అనంతమైన చైతన్యంలో విలీనమవతాయి.[17]

స్వచ్ఛంద సేవా కార్యక్రమాలుసవరించు

అమ్మ యొక్క ప్రపంచ-వ్యాప్త స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గృహాలులేనివారికి 100,000 ఇళ్లు నిర్మించి ఇవ్వడం, మూడు అనాథాశ్రమాలు ఏర్పాటు చేయడం, 2004 హిందూ మహాసముద్ర సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ మరియు పునరావాస చర్యలు చేపట్టడం భాగంగా ఉన్నాయి, [19] అంతేకాకుండా ఉచిత వైద్య సేవలు, వితంతువులు మరియు వికలాంగులకు పెన్షన్లు, పర్యావరణ-పరిరక్షణ సంఘాలు, మురికివాడల అభివృద్ధి, వృద్ధాశ్రమాలు, పేదలకు ఉచితంగా ఆహారం మరియు దుస్తులు అందించడం వంటి కార్యక్రమాలు కూడా ఆమె స్వచ్ఛంద సేవల్లో భాగంగా ఉన్నాయి.[9] మాతా అమృతానందమయి మఠం (భారతదేశం), మాతా అమృతానందమయి సెంటర్ (USA), అమ్మా-ఐరోపా, అమ్మా-జపాన్, అమ్మా-కెన్యా, అమ్మా-ఆస్ట్రేలియా, తదితర వివిధ సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలన్నింటినీ సంయుక్తంగా "ఎంబ్రేసింగ్ ది వరల్డ్"గా గుర్తిస్తున్నారు.

204లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల అభివృద్ధి గురించి అడిగిన ప్రశ్నలకు అమ్మ బదులిస్తూ, ఈ కార్యక్రమాలకు ఎటువంటి ప్రణాళిక లేదని చెప్పారు. ఇవన్నీ సహజంగా ఏర్పడ్డాయని చెప్పారు. పేదలు మరియు ఆపదల్లో ఉన్నవారి దుర్దశను చూసిన తరువాత ఒకదాని నుంచి మరొకటి మొదలయ్యాయని తెలిపారు. ప్రతి వ్యక్తిని కలుసుకున్నప్పుడు, ఆమె వారి సమస్యలను తెలుసుకుంటారు, తద్వారా వారిని సమస్యల్లో నుంచి గట్టెక్కించేందుకు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించారు. సనాతన ధర్మంలో ఓం లోక సమస్త సుఖినో భవంతు అనేది ఒక ముఖ్యమైన మంత్రం , "ప్రపంచంలోని సమస్త జీవరాశులు సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండాలనే" అర్థాన్ని ఈ మంత్రం సూచిస్తుంది. ఈ మంత్రం యొక్క స్ఫూర్తిని ఆచరణలో పెట్టారు.[20]

ఒక ఆధ్యాత్మిక ఆచరణ రూపంగా స్వచ్ఛంద సేవకులు ఎక్కువగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. "తన బిడ్డలందరూ ప్రేమను మరియు శాంతిని ప్రపంచమంతటా విస్తరించేందుకు తమ జీవితాలను అంకితం చేయాలని అమ్మ ఆకాంక్షిస్తున్నారు. దేవుడికి నిజమైన ప్రేమ మరియు భక్తి పేదలు మరియు బాధల్లో ఉన్నవారి పట్ల దయ చూపించడమని అమ్మ చెప్పారు." "నా బిడ్డలు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తారు, పేదలకు సాయం చేస్తారు, బాధల్లో ఉన్నవారిని ఓదారుస్తారు, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఊరడిస్తారు, అందరికీ సేవ చేస్తారని తెలిపారు.”[16]

భజనలుసవరించు

అమ్మ ఆమె యొక్క భక్తి గానం ద్వారా కూడా ప్రసిద్ధి చెందారు. 20కుపైగా భాషల్లో వందకుపైగా భజన పాటలను ఆమె పాడారు. ఆమె డజన్లకొద్ది భజనలను కూడా రూపొందించారు, వాటిని సాంప్రదాయిక రాగాలకు అనుగుణంగా స్వరబద్ధం చేశారు. ఒక ఆధ్యాత్మిక ఆచరణగా భక్తి గానానికి సంబంధించి అమ్మ మాట్లాడుతూ, భజన అనే దానిని ఏకదిశాత్మకతతో పాడినట్లయితే, గాయకుడు, శ్రోతలు మరియు ప్రకృతికి కూడా ఇది ప్రయోజనాత్మకంగా ఉంటుందని చెప్పారు. తరువాత శ్రోతలు పాటలకు ముగ్దులైనప్పుడు, వారు ఈ పాటలలో వివరించిన పాఠాలకు అనుగుణంగా జీవించేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.[21] ఈరోజు ప్రపంచంలో ప్రజలకు ధ్యానంలో ఏక దిశాత్మక కేంద్రీకరణను పొందడం తరచుగా కష్టతరమవుతుందని అమ్మ చెప్పారు, అయితే భక్తి పాటల ద్వారా ఇటువంటి కేంద్రీకరణను సులభంగా పొందవచ్చని తెలిపారు.[22]

పుస్తకాలు మరియు ప్రచురణలుసవరించు

అమ్మ యొక్క శిష్యులు భక్తులతో ఆమె యొక్క సంభాషణలను లిఖించారు మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించేవారు ఆమె యొక్క బోధనలపై సుమారుగా డజను పుస్తకాలు రాశారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై ఆమె ఇచ్చిన ప్రసంగాలు కూడా పుస్తక రూపంలో ముద్రించబడ్డాయి. ఆమె ప్రియ శిష్యులు స్వామి రామకృష్ణానంద పూరీ, స్వామి తురియమృతతానంద పూరీ, స్వామి పరమాత్మానంద పూరీ, స్వామిణి కృష్ణామృత ప్రాణ తదితరులు కూడా అమ్మతో తమ అనుభవాలపై మరియు అమ్మ బోధనలపై తమ అవగాహనలతో పుస్తకాలు రాశారు. మాతా అమృతానందమయి మఠం వైస్-ఛైర్మన్ స్వామి అమృతస్వరూపానంద పూరీ అమ్మ జీవితచరిత్రను రాశారు. మాతా అమృతానందమయి మఠం మాతృవాణి అనే ఒక ఆధ్యాత్మిక మాస పత్రికను మరియు ఇమ్మోర్టల్ బ్లిస్ అనే ఒక త్రైమాసిక పత్రికను ప్రచురిస్తుంది.

పదవులుసవరించు

 • మాతా అమృతానందమయి మఠం వ్యవస్థాపకురాలు & ఛైర్‌పర్సన్
 • ఎంబ్రేసింగ్ ది వరల్డ్ వ్యవస్థాపకురాలు[23]
 • అమృత విశ్వ విద్యాపీఠం విశ్వవిద్యాలయ ఛాన్సెలర్[24]
 • అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS హాస్పిటల్) వ్యవస్థాపకురాలు[25]
 • పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రిలీజియన్స్, అంతర్జాతీయ సలహా కమిటీ సభ్యురాలు[26]
 • ది ఎలిజా ఇంటర్‌ఫెయిత్ ఇన్‌స్టిట్యూట్, ఎలిజా బోర్డ్ ఆఫ్ వరల్డ్ రిలీజియస్ లీడర్స్ సభ్యురాలు [27]

పురస్కారాలు మరియు గౌరవాలుసవరించు

 • 1993, 'ప్రెసిడెంట్ ఆఫ్ ది హిందూ ఫెయిత్' (పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రిలీజియన్స్) [28]
 • 1993, హిందూ పునరుజ్జీవన అవార్డు (హిందుయిజం టుడే ) [29]
 • 1998, కేర్ & షేర్ ఇంటర్నేషనల్ హ్యూమేనిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (చికాగో)
 • 2002, కర్మ యోగి ఆఫ్ ది ఇయర్ (యోగా జర్నల్ ) [30]
 • 2002, గాంధీ-కింగ్ అవార్డు ది వరల్డ్ మూమెంట్ ఫర్ నాన్‌వాయిలెన్స్ అంహిసను ప్రోత్సహించినవారికి ఈ అవార్డు ఇస్తుంది (యుఎన్, జెనీవా) [31] · [32]
 • 2005, మహావీర్ మహాత్మా అవార్డు (లండన్) [33]
 • 2005, సెంటెనరీ లెజెండరీ అవార్డ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రొటేరియన్స్ (కొచ్చిన్) [34]
 • 2006, జేమ్స్ పార్క్స్ మోర్టాన్ ఇంటర్‌ఫెయిత్ అవార్డు (న్యూయార్క్) [35]
 • 2006, ది ఫిలాసఫర్ సెయింట్ శ్రీ జ్ఞానేశ్వరా వరల్డ్ పీస్ ప్రైజ్ (పూణే) [36]
 • 2007, లి ప్రిక్స్ సినిమా వెరైటీ (సినిమా వెరైటీ, ప్యారిస్) [37]
 • 2010, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ఆమెకు హ్యూమన్ లెటర్స్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది, దీనిని బఫెలో ప్రాంగణంలో 2010 మే 25న ఆమె అందుకున్నారు.[38]

అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగాలుసవరించు

 • 1993, 'మే యువర్ హార్ట్స్ బ్లూజమ్, ' పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రిలీజియన్స్ 100వ వార్షికోత్సవం (చికాగో)
 • 1995, 'యూనిటీ ఇన్ పీస్, ' ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్) యొక్క ఇంటర్‌ఫెయిత్ 50వ వార్షికోత్సవ వేడుకలు[35]
 • 2000, 'లివింగ్ ఇన్ హార్మొనీ, ' మిలీనియం వరల్డ్ పీస్ సదస్సులో మత & ఆధ్యాత్మిక నేతలను ఉద్దేశించి ప్రసంగం (UN, న్యూయార్క్) [39]
 • 2002, 'అవేకనింగ్ ఆఫ్ యూనివర్శల్ మదర్‌హుడ్, ' గ్లోబల్ పీస్ ఇన్షియేటివ్ ఆఫ్ వుమెన్, (యుఎన్, జెనీవా) [40] · [32]
 • 2004, 'మే పీస్ & హ్యాపీనెస్ ప్రివైల్, ' పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్స్ (బార్సిలోనా) [41] · [42]
 • 2006, 'అండర్‌స్టాండింగ్ & కొలాబరేషన్ బిట్వీన్ రిలీజియన్స్, ' జేమ్స్ పార్క్స్ మోర్టాన్ ఇంటర్‌ఫెయిత్ అవార్డులు (న్యూయార్క్) [35]
 • 2007, 'కంపాషన్: ది ఓన్లీ వే టు పీస్' (సినిమా వెరైటీ వేడుక, ప్యారిస్) [43]
 • 2008, 'ది ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఆఫ్ వుమెన్, ' ది గ్లోబల్ పీస్ ఇన్షియేటివ్ ఆఫ్ వుమెన్ (జైపూర్) ప్రధాన ఉపన్యాసం, [44][45]
 • 2009, 'కల్టివేటింగ్ స్ట్రెంత్ & వైటలిటీ, ' వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (న్యూఢిల్లీ) ప్రారంభోత్సం[46]

లఘుచిత్రాలుసవరించు

 • 1999 రివర్ ఆఫ్ లవ్: ఎ డాక్యుమెంటరీ డ్రామా ఆన్ ది లైఫ్ ఆఫ్ అమ్మాచీ
 • 2000 లూయిస్ థెరౌక్స్ వీర్డ్ వీకెండ్స్ -- "ఇండియన్ గురూస్" (BBC-TV)
 • 2005 దర్శన్: ది ఎంబ్రేస్—జాన్ కౌనెన్ దర్శకత్వం
 • 2007 ఇన్ గాడ్స్ నేమ్—జూలెస్ క్లెమెంట్ నౌడెట్ మరియు థామస్ జెడెయోన్ నౌడెట్ దర్శకత్వం
 • 2009 ఎంబ్రేసింగ్ కెన్యా (వీడియో)

అంతర్జాతీయ సదస్సుల నుంచి వీడియోలుసవరించు

విమర్శలుసవరించు

ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ యొక్క కేరళా రాష్ట్ర అధిపతి శ్రీని పట్టథానం మాతా అమృతానందమయి; శాక్రెడ్ స్టోరీస్ అండ్ రియాలిటీస్ అనే పుస్తకాన్ని రాశారు, [47] ఈ వివాదాస్పద విమర్శనాత్మక పుస్తకం మొదటిసారి 1985లో ప్రచురించబడింది. సుధామణి యొక్క అద్భుతాలన్నీ బోగస్ అని ఆయన పేర్కొన్నాడు, ఆమె ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అనుమానాస్పద మరణాలు సంభవించాయని, వీటిపై పోలీసు దర్యాప్తు జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు రికార్డులు, వార్తాపత్రికల్లో వార్తలు మరియు ప్రముఖ సాహిత్యవేత్తల ఉల్లేఖనాలకు సంబంధించిన విస్తృతమైన సూచనలు ఈ పరిశోధక పుస్తకంలో ఉన్నాయి, అంతేకాకుండా మాతా యొక్క దగ్గరి బంధువులు వెల్లడించిన వివరాలు మరియు అమృతానందమయి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు కూడా దీనిలో ఉన్నాయి.

రచయితను శిక్షించాలని మఠం డిమాండ్ చేసినప్పుడు మరియు 2004లో దీనిపై ప్రభుత్వం స్పందించేలా చేసిన సమయంలో అమృతానందమయికి ప్రాచుర్యం ఇప్పటి కంటే బాగా తక్కువగా ఉంది. పట్టథానంపై, ముద్రణ సంస్థ యజమాని మరియు పుస్తకాన్ని ముద్రించిన వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుస్తకంపై కనిపించిన విమర్శలు ఆధారంగా, [48] ఈ ముగ్గురిని శిక్షించాలని కోరుతూ ఒక భక్తుడు, మాతా అమృతానందమయి ఆశ్రమంలో సభ్యుడు టీకే అజన్ దాఖలు చేసిన దరఖాస్తును పరిగణలోకి తీసుకునేలా రాష్ట్ర హోం శాఖకు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ చర్యలు చివరకు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది, మానవతా వాదులు, హేతువాదులు, రచయితలు మరియు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదేశాలను అధికారికంగా రద్దు చేశారు.

గమనికలుసవరించు

 1. [1] అమ్మాచీ గురించి BBC కథనం
 2. అమ్మ: 'ది హగ్గింగ్ సెయింట్', క్యాథీ లైన్ గ్రాస్‌మ్యాన్ (2006). www.usatoday.com. సేకరణ తేదీ ఫిబ్రవరి 19, 2008.
 3. 3.0 3.1 అమ్మా ఎంబ్రేసింగ్ ది వరల్డ్ 2007 (వీడియో)
 4. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాతా అమృతానందమయీస్ సర్వీసెస్ లాడెడ్
 5. [కార్నెల్, జ్యూడిత్. అమ్మా: హీలింగ్ ది హార్ట్ ఆఫ్ ది వరల్డ్. హార్పెర్‌కొల్లిన్స్: న్యూయార్క్, 2001]
 6. 6.0 6.1 అమ్మాచీ - ఎ బయోగ్రఫీ ఆఫ్ మాతా అమృతానందమయి బై స్వామి అమృతస్వరూపానంద, ISBN 1-879410-60-5
 7. 7.0 7.1 http://thestar.com.my/news/story.asp?file=/2009/3/8/apworld/20090308082927&sec=apworld
 8. "మే 6, 1981న అమ్మ యొక్క ఆలోచనలు మరియు బోధనలను కాపాడేందుకు మరియు వ్యాప్తి చేసేందుకు, మాతా అమృతానందమయి మఠం మరియు మిషన్ ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది, ట్రావెన్‌కోర్-కొచ్చిన్ స్టేట్ లిటరరీ అండ్ ఛారిటబుల్ యాక్ట్ ఆఫ్ 1955 పరిధిలో దీనిని కొల్లాం], [[కేరళ, దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేశారు. అమ్మాచీ - ఎ బయోగ్రఫీ ఆఫ్ మాతా అమృతానందమయి, రచన స్వామి అమృతస్వరూపానంద, ISBN 1-879410-60-5
 9. 9.0 9.1 http://www.embracingtheworld.org/
 10. http://www.amma.org/amma/in-the-west.html
 11. బాబ్, లారెన్స్. 1981. గ్లాన్సింగ్: విజువల్ ఇంటరాక్షన్ ఇన్ హిందూయిజం. జర్నల్ ఆఫ్ ఆంత్రోపాలాజికల్ రీసెర్చ్ 37 (4):387-401; ఎక్, డయానా. 1981. దర్శన్: సీయింగ్ ది డివైన్ ఇమేజ్ ఇన్ ఇండియా. 2వ ఎడిషన్. చాంబర్‌బర్గ్, పిఎ: ఎనీమా.
 12. ఫుల్లెర్, సి.జే. 1992. ది చాంఫోర్ ప్లేమ్: పాపులర్ హిందూయిజం అండ్ సొసైటీ ఇన్ ఇండియా. ప్రిన్స్‌టన్: ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ ప్రెస్
 13. 13.0 13.1 http://im.rediff.com/news/2002/aug/02inter1.htm
 14. http://www.embracingtheworld.org/amma/
 15. ఫ్రమ్ అమ్మాస్ హార్ట్: కాన్వెర్జేషన్ విత్ శ్రీ మాతా అమృతానందమయి దేవీ (2004), పేజి 159
 16. 16.0 16.1 16.2 ది టైమ్‌లెస్ పాత్ బై స్వామి రామకృష్ణానంద, ISBN 978-1-879410-46-6
 17. 17.0 17.1 లీడ్ అజ్ టు ది లైట్: ఎ కలెక్షన్ ఆఫ్ మాతా అమృతానందమయీస్ టీచింగ్స్ కాంపిలెడ్ బై స్వామి జ్ఞానమృతానంద
 18. "ది గోల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ వన్--ఫ్యూరిఫికేషన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్." ("లివింగ్ ఇన్ హార్మనీ" బే మాతా అమృతానందమయి)
 19. అమ్మాస్ రెస్పాన్స్ టు ది సునామీ 2004 (వీడియో)
 20. http://www.hindu.com/thehindu/fr/2004/01/23/stories/2004012301640600.htm
 21. అవేకెన్, చిల్డ్రన్, వాల్యూమ్ 2: డైలాగ్స్ విత్ శ్రీ మాతా అమృతానందమయి దేవీ
 22. ఫర్ మై చిల్డ్రన్: ది టీచింగ్స్ ఆఫ్ హర్ హోలీనెస్ శ్రీ మాతా అమృతానందమయి దేవీ, పేజీ 70
 23. http://www.embracingtheworld.org/who-we-are/
 24. http://www.amrita.edu/chancellor-amma/amma.php
 25. http://www.aimshospital.org/
 26. http://www.parliamentofreligions.org/index.cfm?n=1&sn=8
 27. ది ఎలీజా ఇంటర్‌ఫెయిత్ ఇన్‌స్టిట్యూట్ - హిందూ మెంబర్స్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ హిందూ రిలీజియస్ లీడర్స్
 28. http://news.bbc.co.uk/2/hi/south_asia/3136524.stm
 29. http://www.hinduismtoday.com/modules/xpress/2002/09/09/
 30. http://www.yogajournal.com/wisdom/804?print=1
 31. http://www.millenniumpeacesummit.com/wc_awards.html
 32. 32.0 32.1 32.2 ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ ప్లానెట్ డిపెండ్స్ ఆన్ ది వుమెన్ (గాంధీ-కింగ్ యునైటెడ్ నేషన్స్ 2002) (వీడియో)
 33. http://www.nonduality.com/news_archive_may_2005.htm
 34. http://www.hinduismtoday.com/modules/xpress/2005/02/page/2/
 35. 35.0 35.1 35.2 35.3 http://www.interfaithcenter.org/awards.asp?y=2006 ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "Interfaith" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 36. http://archives.amritapuri.org/news/2006/601viswasanthi.php
 37. http://news.bbc.co.uk/2/hi/entertainment/7043185.stm
 38. http://www.buffalo.edu/news/11390
 39. http://www.millenniumpeacesummit.com/news000825c.html
 40. ది వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్
 41. http://www.conferencerecording.com/newevents/pwr24.htm
 42. 42.0 42.1 బార్సిలోనా 2004 పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్ "మే పీస్ అండ్ హ్యాపీనెస్ ప్రివైల్" (వీడియో)
 43. మూస:FrDiscours lors de la remise du Prix Cinéma Vérité en 2007 remis par Sharon Stone à Paris (vidéo)
 44. అమ్మాస్ అడ్రస్ ఎట్ ది 2008 సమ్మిట్ : ది ఇన్ఫైనెట్ పొటన్షియల్ ఆఫ్ వుమెన్ "మేకింగ్ వే ఫర్ ది ఫెమినైన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ" (వీడియో)
 45. http://www.gpiw.org/wordpress/?p=31
 46. http://www.vkendra.org/vifinaguration
 47. మాస్ పబ్లికేషన్స్, కొల్లాం, కేరళ, రివైజ్డ్ ఎడిషన్. (మలయాళ భాష ఉపశీర్షిక "దివ్య కథాకుళం యాథార్థయువం".)
 48. "మువ్ టు ప్రాసిక్యూట్ రేషనలిస్ట్ లీడర్ క్రిటిసైజ్డ్", ది హిందూ , జనవరి 29, 2004

సూచనలుసవరించు

బాహ్య లింకులుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.