మాథ్యూ మోట్
మాథ్యూ పీటర్ మోట్ (జననం 1973 అక్టోబరు 3) ఆస్ట్రేలియాకుచ్ చెందిన క్రికెట్ కోచ్, మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటరు. అతను ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు మాజీ కోచ్. ప్రస్తుతం ఇంగ్లాండ్ పురుషుల వైట్-బాల్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 2022 T20 ప్రపంచ కప్ విజేతగా జట్టును నడిపించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాథ్యూ పీటర్ మోట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | చార్లెవిల్, క్వీన్స్‌లాండ్, ఆస్ట్రేలియా | 1973 అక్టోబరు 3|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1994/95–1997/98 | క్వీన్స్‌లాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1998/99–2003/04 | విక్టోరియా | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2022 జూన్ 17 |
ఆటగాడిగా
మార్చుమోట్ విక్టోరియన్ బుష్‌రేంజర్స్, క్వీన్స్‌లాండ్ బుల్స్ ల తరఫున ఆడాడు. అతను 1995లో అడిలైడ్‌లోని ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీలో భాగంగా ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాటరైన మోట్, 1994-95లో క్వీన్స్‌లాండ్ తరపున ఆడుతూ ఫస్ట్-క్లాస్ లో అడుగుపెట్టాడు. 1996–97 షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌లో క్వీన్స్‌లాండ్ కోసం కీలకమైన 86 పరుగులు చేశాడు. అతను 1998-99 సీజన్ కోసం విక్టోరియాకు మకాం మార్చుకుని, ఎగువ వరుస బ్యాటింగులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని మొదటి సీజన్‌లో న్యూ సౌత్ వేల్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసాడు. తరువాతి వేసవిలో 841 ఫస్ట్-క్లాస్ పరుగులు చేసి, తొమ్మిదేళ్లలో మొదటిసారిగా విక్టోరియా ఫైనల్‌కు చేరుకోవడంలో తోడ్పడ్డాడు. విక్టోరియాతో అతని కెరీర్‌లో ఒక ముఖ్యాంశం జాసన్ ఆర్న్‌బెర్గర్‌తో 223 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం. [1] 2004లో 66 ఆటల తరువాత, 33.84 సగటుతో 3723 పరుగులతో ఏడు సెంచరీలతో తన కెరీర్‌ను ముగించాడు. [2]
కోచింగ్ కెరీర్
మార్చు2007–08కి న్యూ సౌత్ వేల్స్ బ్లూస్, మోట్‌ను కోచ్‌గా నియమించుకుంది.[3] కోచ్‌గా అతని మొదటి సీజన్‌లో న్యూ సౌత్ వేల్స్, పురా కప్‌ను గెలుచుకుంది.
2011 జనవరి 14 న గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్ తన 1వ XI జట్టుకు కోచ్‌గా మోట్‌తో మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. 2013 ఆగస్టు 20 న సీజన్ ముగిసిన తర్వాత మోట్, గ్లామోర్గాన్‌ను విడిచిపెట్టాడు. [4] అతను గ్లామోర్గాన్‌ను 2013 యార్క్‌షైర్ బ్యాంక్ 40 ఫైనల్‌కు నడిపించాడు, అక్కడ వారు నాటింగ్‌హామ్‌షైర్ చేతిలో ఓడిపోయారు.
2015 మార్చిలో మోట్, క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ స్థానంలో ఆస్ట్రేలియా మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా చేరాడు. [5] 2017 ఏప్రిల్‌లో అతను, 2020 వరకు ఆస్ట్రేలియన్ మహిళల జట్టుకు కోచ్‌గా మళ్లీ సంతకం చేసాడు. [6] 2020లో, టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
2022 మేలో, మోట్‌ను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వైట్-బాల్ కోచ్‌గా ప్రకటించారు. [7]
మోట్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పురుషుల T20 జట్టుకు కోచ్‌గా పనిచేసి, 2022 నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసిసి ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించాడు.
మూలాలు
మార్చు- ↑ The Age, "Openers rally Vics with 223-run stand" 3 February 2003
- ↑ Cricinfo "Matthew Mott"
- ↑ Foxsports "Mott new Blues coach" 19 June 2007
- ↑ "Glamorgan part with head of elite performance Matthew Mott". BBC Sport. Retrieved 25 October 2013.
- ↑ Cherny, Daniel (24 March 2015). "Matthew Mott named new coach of Southern Stars". The Sydney Morning Herald. Retrieved 26 November 2018.
- ↑ "Matthew Mott re-signs as Southern Stars coach Australia". Fox Sports (Australia). News Corp Australia. 11 April 2017. Retrieved 26 November 2018.
- ↑ "Matthew Mott: England name Australia women's boss as their new men's white-ball coach". BBC Sport. 18 May 2021. Retrieved 18 May 2021.