మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ లో దళితుల హక్కుల, సాధికారిత కోసము ఏర్పడిన సంఘము. ఎస్సీ రిజర్వేషన్లను కూడా బీసీ రిజర్వేషన్ల తరహాలో ఎ,బి,సి,డిలుగా వర్గీకరించి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఉన్న రిజర్వేషన్లను వాటికి పంచి కేటాయింపులు చేయాలన్నది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్. ఈ డిమాండ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానాశయం. ఈ సంఘాన్ని మంద కృష్ణ మాదిగ 1994, జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో స్థాపించారు.

ఈ సంఘాన్ని మంద కృష్ణ మాదిగ 1994, జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో స్థాపించారు. చిత్రం లో ప్రసంగిస్తున్న వ్యక్తి

మొదట్లో మందకృష్ణ నాయకత్వంలో కేవలం 20మంది యువకులు ప్రారంభించిన ఈ ఉద్యమం...అనతి కాలంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించింది. మాదిగల సహజ సామాజిక న్యాయానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అన్ని రాజకీయపార్టీలు మద్దతుగా నిలిచాయి. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా ఎస్సీలలో మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు వెనుకబడి ఉన్నారని, వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని ప్రభుత్వం గుర్తించింది. మాదిగల పోరాటాలు, ఆమరణ నిరహార దీక్షల ఫలితంగా 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ చట్టం జరిగింది. ఇది నాలుగేళ్లపాటు అమల్లో ఉంది.

అయితే వర్గీకరణ అనేది దళితుల్లో ఐక్యత దెబ్బతీస్తోందని మాలల సామాజిక వర్గానికి చెందిన కొందరు సుప్రీంకోర్టుకెళ్లారు. దీంతో కేవలం రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్డు కులాల వర్గీకరణ కుదరదని, దీనికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరని స్పష్టం చేస్తూ అప్పటి దాకా నాలుగేళ్లపాటు అమల్లో ఉన్న ఏబీసీడీల వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దీంతో మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు మళ్లీ మలిదశ పోరాటం మొదలుపెట్టారు.[1]

మూలాలుసవరించు

  1. "ఎందుకీ మాదిగల 'ధర్మయుద్ధం'?!". Samayam Telugu. Retrieved 2020-08-25.

బయటి లింకులుసవరించు