ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - యూడీహెచ్‌ఆర్)'ను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10 ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.[1][2]

మానవ హక్కుల చరిత్రసవరించు

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండు సంవత్సరాలు ఈ మానవ హక్కులు రూపొందించారు. ఈ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది.అన్ని దేశాలు పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించారు.[3]

పీఠికలో ఉన్న ఉద్దేశంసవరించు

  • ప్రపంచంలో ఉన్న మానవులు అంతా ఒక్కటే ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి.

మానవ హక్కులుసవరించు

  • జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
  • చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • సరైన కారణం లేకుండా ఏ మానవున్ని నిర్బంధించబడకుండా ఉండేహక్కు.
  • స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశాల్లో పర్యటించే హక్కు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి (10 December 2016). "మీకు మానవ హక్కుల గురించి తెలుసా?". Archived from the original on 19 April 2019. Retrieved 21 February 2020. CS1 maint: discouraged parameter (link)
  2. సాక్షి, వేదిక-అభిప్రాయం (10 December 2014). "అంతర్జాతీయ హక్కుల దినోత్సవం". జాన్ బర్నబాస్ చిమ్మె. Archived from the original on 19 April 2019. Retrieved 21 February 2020. CS1 maint: discouraged parameter (link)
  3. లింగుట్ల, రవిశంకర్ (2019-12-10). "హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా..." BBC News తెలుగు. Retrieved 2020-02-21.

వెలుపలి లంకెలుసవరించు