మానసదేవీ ఆలయం (హరిద్వార్)

(మానసదేవీ ఆలయం,హరిద్వార్ నుండి దారిమార్పు చెందింది)

మానసదేవీ ఆలయం (హిందీ: मंसा देवी मंदिर, हरिद्वार) భారతదేశం లోని ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని హరిద్వార్ నగరానికి దగ్గరలో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది.[1][2] ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతోంది.

మానసదేవీ ఆలయం
బిల్వ పర్వత శిఖరంపై దేవాలయం
మానసదేవీ ఆలయం is located in Uttarakhand
మానసదేవీ ఆలయం
మానసదేవీ ఆలయం
ఉత్తరాఖండ్ లో ప్రాంతం
భౌగోళికాంశాలు:29°57′29″N 78°09′53″E / 29.95806°N 78.16472°E / 29.95806; 78.16472
పేరు
స్థానిక పేరు:మానసదేవీ ఆలయం
దేవనాగరి:मंसा देवी मंदिर
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఉత్తరాఖండ్
జిల్లా:హరిద్వార్
ప్రదేశం:హరిద్వార్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మానస దేవి
ప్రధాన పండుగలు:నవరాత్రి
చరిత్ర
నిర్మాత:తెలియదు

ఈ దేవాలయంలో అధిష్టాన దేవత మానసదేవీ శక్తి రూపాలలో ఒకటి. ఈ దేవత పరమశివుని మనసు నుండి జనించినదని భావింపబడుతోంది. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావింపబడుతోంది. "మానస" అనగా ప్రియ భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.

ఈ మానస దేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొనుటకు కొలిచే "సిద్ధ పీఠం"గా పూజింపబడుతోంది. ఇది హరిద్వార్ లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్ లో గల ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి మాయాదేవి దేవాలయం, చండీదేవి ఆలయం[3][4] ఈ దేవాలయం అంతర భాగంలో రెండు దేవతా విగ్రహాలున్నాయి. వాటిలో ఒకటి ఎనిమిది చేతులతోనూ, రెండవది మూడు తలలు, ఐదు చేతులతోనూ ఉన్నాయి.[5]

ఆలయ విశేషాలు

మార్చు
 
రోప్ వే పై హరిద్వార్, గంగానది కనిపించే దృశ్యం

మానస దేవి దేవాలయం ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపబడింది. హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించే ఆలయం ఇది.[6] ఇది అనేక శతాబ్దాల నుండి హరిద్వార్ లో పవిత్ర సంప్రదాయాలను పెంచే దేవాలయం.[3] ఈ దేవాలయం నుండి గంగా నది, హరిద్వార్లు కనబడతాయి. ఈ దేవాలయానికి వెళ్ళుటకు పర్వతం పైకి మెట్ల మార్గం ఉంది. ఈ ఆలయానికి చేరుటకు "రోప్ వే" మార్గం కూడా ఉంది.

ఈ రోప్ వే సేవలను "మానసా దేవి ఉదంఖతోల" అని పిలుస్తారు. ఈ రోప్ వే సమీపంలో గల చండీదేవి ఆలయానికి కూడా కలుపబడుతోంది. ఈ రోప్ వే యాత్రికులను క్రింది స్టేషను నుండి మానస దేవి దేవాలయానికి తీసుకొని వెళుతుంది. ఈ రోప్ వే యొక్క మొత్త పొడవు సుమారు 540 మీటర్లు (1,770 అ.), ఎత్తు 178 మీటర్లు (584 అ.) ఉంటుంది. సాధారణ దినాలలో ఈ దేవాలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు తెలువబడుతోంది.

పార్వతీ దేవి రూపాలైన "మానస", "చండీ"లు ఎల్లప్పుడూ కలసి ఉండేవారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందువలన మానస దేవాలయం నీల పర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వ పర్వతం పై కొలువైనది. ఇదే విధంగా హర్యానా లోని పంచుకుల ప్రాంతంలో మాతా మానస దేవి మందిరం, చండీఘర్ సమీపంలోని చండీ దేవాలయం కూడా ఒకే ప్రాంతంలో ఉండటం ఈ దేవతా రూపాలు కలసి u



మూలాలు

మార్చు
  1. Sunita Pant Bansal (2008). Hindu Pilgrimage. Pustak Mahal. ISBN 978-81-223-0997-3.
  2. "Devotion and harmony by the Ganga". Chennai, India: The Hindu. 2006-06-25. Archived from the original on 2008-03-18. Retrieved 2010-06-04.
  3. 3.0 3.1 Mustseeindia.com. "Maya Devi Temple, Haridwar". Archived from the original on 2008-09-16. Retrieved 2014-10-03. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Mata" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. Mustseeindia.com. "Mansa Devi Temple, Haridwar". Archived from the original on 2008-09-15. Retrieved 2014-10-03.
  5. The Economic Times (2009-07-26). "Haridwar leaves you mesmerised". The Times Of India. Retrieved 2010-06-04.
  6. "Places to visit in and around Haridwar". Zeenews.com. Archived from the original on 2010-01-29. Retrieved 2014-10-03.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.