వాసుకి
అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, వాసుకి (అయోమయ నివృత్తి) చూడండి.
వాసుకి (ఆంగ్లం: Vasuki) నాగలోకానికి రాజు. ఇతడు హిందూ, బౌద్ధ పురాణాలలో పేర్కొనబడ్డాడు. ఇతని తలపై నాగమణి మెరుస్తుంటుంది. బెంగాళీలు పూజించే మనసాదేవి ఇతని సోదరి. అష్టనాగములు (పాములు)లో మిగిలిన పాములు అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు కుశికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు. పరమశివుడి కంఠము నందు వాసుకి సర్పము అలంకృతమై ఉంటుంది. కశ్యపుడు, అతని మూడవ భార్య కద్రువ కు వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు జన్మించారు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.[1]
భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాగులలో వాసుకి తానేనని పేర్కొన్నాడు.
క్షీరసాగర మథనం
మార్చుక్షీరసాగర మథనం కోసం మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరము లో వదిలాడు. వాసుకి ని ప్రార్థించి వాసుకి కి అమృతం లో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు.
సూర్యుని గణంలో
మార్చుప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.[2] మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు.[3]
మూలాలు
మార్చు- ↑ సాక్షి, ఫ్యామిలీ (15 July 2016). "నేడు వరల్డ్ స్నేక్ డే". Sakshi. Archived from the original on 28 May 2017. Retrieved 30 June 2020.
- ↑ "కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010". Archived from the original on 2014-07-06. Retrieved 2014-03-12.
- ↑ ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం