మానసిక ఒత్తిడి అనేది మానసిక శ్రమ వలన కలిగే ఒత్తిడి. ఇదొకరకమైన మానసిక వేదన.[1] ఈ ఒత్తిడి కొద్ది పరిమాణంలో ఉంటే మంచిదే. ఇది క్రీడాకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్టు మనల్ని మారుస్తుంది. అయితే ఒత్తిడి మోతాదు మించితే మెదడు, గుండెకు రక్త సరఫరా నెమ్మదించడం, కడుపులో పుండ్లు, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలకు దారి తీస్తుంది.[2]

ఇది బయటి పరిస్థితులవల్ల కూడా కలగవచ్చు.[3] లేదా దాన్ని మనం స్వీకరించే పద్ధతి వల్ల ఆదుర్దా, ఒత్తిడి, వ్యతిరేక భావనల ద్వారా కూడా ఏర్పడవచ్చు.

ఒత్తిడితో నష్టం అయ్యే మానవశరీరం లోని అవయవాలు

శారీరక వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకోవచ్చని కొన్ని వైద్య పరిశోధనలు నిరూపించాయి.[4]

నిర్వచనం

మార్చు

ఒత్తిడి అనేది క్లిష్టమైన పరిస్థితి వల్ల కలిగే ఆందోళన లేదా మానసిక ఉద్రిక్తతగా నిర్వచించవచ్చు. ఒత్తిడి అనేది  ప్రజల అందరికి సహజంగా వచ్చే ప్రతిస్పందన. దీనితో మనుషుల జీవితాలలో సవాళ్లను, బెదిరింపులను పరిష్కరించడానికి మనలను ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎదో ఒకరకమైన ఒత్తిడిని అనుభవించే ఉంటారు. దీనికి మనిషి ప్రతిస్పందించే విధానం ముఖ్యమైనది. ఇది మానవ జీవితాల  శ్రేయస్సుకు పెద్ద తేడాను కలిగిస్తుంది.[5]

కారణాలు

మార్చు

ఒత్తిడి ఒక అనిశ్చితమైన ప్రతిస్పందన. అది తటస్థమైనదే అయినా దాని ప్రతిస్పందన మాత్రం మారుతూ ఉంటుంది. అది వ్యక్తిగతమైనది, సందర్భోచితమైనది. ఒక వ్యక్తి దాన్ని ఎలా గ్రహిస్తున్నాడనే మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒత్తిడి తటస్థమైంది కాబట్టి కొంతమందిలో అది వ్యాకులతను కలిగించవచ్చు, కొంతమందిలో సానుకూలంగా పనిచేయవచ్చు.[6]

ప్రమాదం

మార్చు
 
మానసిక ఒత్తిడితో ఉన్న మహిళ

ఒత్తిడితో భయం, ఆందోళన, విశ్రాంతి తీసుకోలేకపోవడం, హృదయ స్పందన రేటు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలో మార్పు రావడం, ఏకాగ్రత లేక పోవడం, ఇవిగాక ప్రజలకు ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవడం, శారీరక, మానసికంగా నష్టం అయ్యే అవకాశం ఉంది. ఒత్తిడి మనకు విశ్రాంతి తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఆందోళన, చిరాకుతో సహా అనేక భావోద్వేగాలు కలుగవచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు ఏకాగ్రత కష్టమవుతుంది. తలనొప్పి లేదా ఇతర శరీర నొప్పులు, కడుపు నొప్పి లేదా సరియైన నిద్ర లేక పోవడం, ఆకలి లేక పోవడం, లేదా ఎక్కువగా తినే ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక ఒత్తిడితో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సమస్యలను మరింత ఎక్కువ కావడం జరుగుతుంది. వీటితో మనిషి మద్యపానం, సిగరెట్లు, ఇతర పొగాకు వాడకం లేదా మత్తు పానీయాలు కూడా అలవాటయ్యే ప్రమాదం ఉంది. [5].

ఒత్తిడిని తగ్గించే మార్గాలు

మార్చు

మానవులు ప్రతిరోజూ ఒత్తిడిని ఎదుర్కొంటారు. అవి ప్రజలకు వారి నిత్యజీవితం లో ఎదో ఒక రకంగా ఎదుర్కొంటున్నారు. అందులో వారు చేసే  పని, కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఒక కారణం గా భావించవచ్చును. దీనితో  ఒత్తిడి పెరుగుతుంది. వైద్య నిపుణుల నుండి  మానసిక శాస్త్ర వేత్తలు చెప్పే కొన్ని సలహాలు, చిన్న చిట్కాలు పాటిస్తే  ఒత్తిడి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉన్నది.[7]

క్రమం తప్పకుండా వ్యాయామం, అన్ని పోషకాలు కలగిన ఆహారాన్ని సేవించడం, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని పరిమితం చేయడం.

టెలివిజన్లు, ఇతర మాధ్యమాలు చూడటం తగ్గిస్తే  ఒత్తిడిని తగ్గించడానికి, పిల్లలలో, పెద్దలలో నిద్ర సరిగా పోవచ్చును.

మనం వాడే మందులలో మెగ్నీషియం, ఎల్-థియనిన్, రోడియోలా, బి విటమిన్లతో సహా ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. 

ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం ( వైద్యుల సూచనలతో, వారికి అవసరమైనవి) చేయడం, దాంపత్య జీవితంలో శృంగారం ఇవన్నీ ఒత్తిడి హార్మోన్ స్థాయిలు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రకృతిని ఆస్వాదించడం, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతుంది. దీర్ఘమైన శ్వాస మీ శరీరం విశ్రాంతి ప్రతిస్పందనను సక్రియం చేస్తుంది.  పెంపుడు జంతువులతో సమయం గడపడం ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి, ఆహ్లాదకరమైన మార్గం. బ్లాక్ టీ, గ్రీన్ టీ, డార్కు చాకోలెట్లు తరచూ వాడకం వాటితో  మానసిక ఆనందం పొందవచ్చు. తద్వారా కొంత వరకు ఒత్తడిని తగ్గించవచ్చు.

మూలాలు

మార్చు
  1. "Stress". Mental Health America (in ఇంగ్లీష్). 2013-11-18. Retrieved 2018-10-01.
  2. Sapolsky RM (2004). Why Zebras Don't Get Ulcers. New York: St. Martins Press. pp. 37, 71, 92, 271. ISBN 978-0-8050-7369-0.
  3. Jones F, Bright J, Clow A (2001). Stress: myth, theory, and research. Pearson Education. p. 4. ISBN 9780130411891.
  4. Breus MJ, O'Connor PJ (July 1998). "Exercise-induced anxiolysis: a test of the "time out" hypothesis in high anxious females". Medicine and Science in Sports and Exercise. 30 (7): 1107–1112. doi:10.1097/00005768-199807000-00013. PMID 9662680.
  5. 5.0 5.1 "Stress". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2023-03-03.
  6. Hargrove MB, Nelson DL, Cooper CL (2013). "Generating eustress by challenging employees: Helping people savor their work". Organizational Dynamics. 42: 61–69. doi:10.1016/j.orgdyn.2012.12.008.
  7. "9 Foods That Help Reduce Anxiety". Healthline (in ఇంగ్లీష్). 2022-09-26. Retrieved 2023-03-05.