మానాప్రగడ రామసుందరమ్మ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు.

జీవిత విశేషాలుసవరించు

ఆమె సీతానగరం వాస్తవ్యురాలు. ఆమె తండ్రి కనకయ్య, భర్త వెంకట కృష్ణారావు. అతి చిన్న వయస్సులోనే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నది. పన్నెండేళ్ళ వయసులోనే సత్యాగ్రహం లో పాల్గొనింది. జాతీయ ఉద్యమ నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకుంది. 1926లో నిర్మాణ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించింది. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను 1933 జనవరి 16 నుండి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. 1933 లో గుంటూరు లో ఒక స్త్రీల సభ జరిగింది. ఆ సభలో పాల్గొంటే పదిహేను నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరీమానా అన్నా వినకుండా పాల్గొనింది. జైలుకు వెళ్ళింది. జైలులో జబ్బు పడింది. పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండకుండానే స్వర్గస్తురాలైంది. ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఇటువంటి మహిళలను కన్నందుకు తెలుగుదేశం గర్వించాలు భరతమాత పులకించింది.[1]

మూలాలుసవరించు

  1. "స్వాతంత్ర్య సమరాంధ్ర వీరవనితలు" (PDF). Cite web requires |website= (help)