మాన్సి జోషి (జననం 1993 ఆగస్టు 18) ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. జోషి ఉత్తరాఖండ్, తెహ్రీలో 1993 ఆగస్టు 18న జన్మించింది. ఆమె తన తొమ్మిదవ ఏట తల్లితో కలిసి పంజాబ్లో రూర్కీకి వెళ్ళింది, క్రికెట్ ఆట మీద అభిరుచి పెంచుకుంది. 10వ తరగతిలో ఉన్నప్పుడు హర్యానా క్రికెట్ సంఘం తరపున ఆడుతున్న మ్యాచ్ లకు చదువు అడ్డు వస్తున్నదని 10, 12 తరగతులు విడిగా చదువుకుంది. డెహ్రాడూన్ లో సెయింట్ జేవియర్ అకాడెమీలో జేరి తన 16 వ ఏట హర్యానా క్రికెట్ సంఘంలో ప్రయత్నాలు ఆరంభించింది. తండ్రి ఉత్తరకాశీ లో ఉండగా తల్లి తన ఉద్యోగం కూడా వదలి మాన్సీతో డెహ్రాడూన్లో ఉంది. మాన్సీకి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు.[1]

మాన్సీ జోషి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-08-18) 1993 ఆగస్టు 18 (వయసు 31)
రూర్కీ, ఉత్తరాఖండ్, భారత దేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి మీడియం/వేగం బౌలర్
పాత్రఆల్ రౌండర్, బౌలర్, బ్యాట్స్ వుమన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 120)2017 ఫిబ్రవరి 10 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2021 మార్చి 14 - దక్షిణ ఆఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.10
తొలి T20I (క్యాప్ 54)2016 నవంబరు 26 - బంగ్లా దేశ్ తో
చివరి T20I2019 నవంబరు 20 - వెస్ట్ ఇండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–presentహర్యానా
2010/11–2016/17నార్త్ జోన్
2013/14–2018/19India Blue
2022–presentSupernovas
2023–presentGujarat Giants
మూలం: ESPNcricinfo, 14 March 2021

క్రికెట్ విశేషాలు

మార్చు

ఆమె 2016 నవంబరులో భారత జాతీయ మహిళా జట్టుతో క్రికెట్ ఆరంభం చేసింది. ఆమె కుడిచేతి వాటం మీడియం - ఫాస్ట్ బౌలర్, కుడిచేతి బ్యాట్స్ వుమన్.[2] ప్రస్తుతం ఆమెకు సెయింట్ జేవియర్ అకాడెమీలో వీరేంద్ర సింగ్ రౌతెలా శిక్షణ ఇస్తున్నారు.[3]

హర్యానా రాష్ట్రం తరఫున దేశీయ క్రికెట్ ఆడుతుంది. ఆమె క్రికెట్ఆటకు ప్రేరణ సచిన్ టెండూల్కర్, మిథాలి రాజ్, షోయబ్ అఖ్తర్ లకు అభిమాని. హర్యానా క్రికెట్ సంఘం మహిళల ఆమెను రాష్ట్ర జట్టులో అండర్ 19లో ఎంపిక చేసింది. అదే సంవత్సరంలో రాష్ట్ర సీనియర్ జట్టుతో ఆడింది. 2016 నవంబరులో వెస్టిండీస్ సిరీస్ లో ట్వంటీ20 అంతర్జాతీయ (టి20ఐ) భారత జట్టుకు ఆమె ఎంపికైంది. కానీ ఆ నెల చివర్లో థాయ్ లాండ్ లో జరిగిన 2016 మహిళల ట్వంటీ20 ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో ఆడుతూ టి20ఐ అరంగేట్రం చేసింది. ఆమె తొలి మ్యాచ్ లో 1/8 సాధించింది. తరువాతి రెండవ ఆటలోనే థాయిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 2/8 తీసుకుంది, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది (అప్పటికీ ఆటకు T20I హోదా లేదు).

జోషి 2017 ఫిబ్రవరి 10న 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ అర్హత కోసం ఐర్లాండ్ లో జరిగిన మహిళల ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (WODI) తో అరంగేట్రం చేసింది.[4] 2017 మే 26న HT యూత్ ఫోరమ్ వారు 30సంవత్సరాల లోపు (అండర్)30 పై స్థాయి క్రీడాకారుల జాబితాలో జోషిని కూడా ఎంపిక చేసారు. అందుకని ఆమెను హిందూస్తాన్ టైమ్స్ సత్కరించింది.[5] 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ చివరి రోజు ఆటకు (ఫైనల్) చేరుకున్న భారత జట్టులో జోషి కూడా ఉంది. మిథాలి రాజ్ నాయకత్వంలో ఆడింది. అయితే అక్కడ జట్టు ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండవ స్థానంలో రన్నర్ అప్ గా నిలచింది.[6][7][8] 2018 అక్టోబరులో వెస్టిండీస్ లో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్ కు భారతజట్టులో ఎంపికైంది.[9][10].

జోషి తాజా క్రికెట్ గణాంకాలు

మార్చు

మాన్సీ 2017-21 మధ్య 14 ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లలో 16 వికెట్లు బౌలింగ్ చేసింది. 8 టీ 20I లు ఆడింది.[11]

బౌలింగ్
FORMAT Mat Inns Balls Runs Wkts BBI BBM Ave Econ SR 4w 5w 10w
WODI 14 14 572 379 16 3/16 3/16 23.68 3.97 35.7 0 0 0
WT20I 8 8 150 176 3 1/8 1/8 58.66 50.0 0 0 0
బాటింగ్ & ఫీల్డింగ్
FORMAT Mat Inns NO Runs HS Ave BF SR 100s 50s 4s 6s Ct St
WODI 14 4 1 20 12 6.66 32 62.50 0 0 2 0 5 0
WT20I 8 3 3 6 3* - 19 31.57 0 0 0 0 1 0

మాన్సీ 2023లో వుమన్ ప్రీమియర్ లీగ్ (WPL)లో 'గుజరాత్ జయింట్స్' తో Rs.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది.[1]

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 "Mansi Joshi Wiki height age family biography & more". WikiBio. Retrieved 3 August 2023.
  2. "Player Profile/ Mansi Joshi".
  3. "Pacer Mansi Joshi bowls her way into Top 30 Under 30 at HT Youth Forum 2017".
  4. "ICC Women's World Cup Qualifier, 11th Match, Group A: India Women v Ireland Women at Colombo (PSS), Feb 10, 2017". ESPN Cricinfo. Retrieved 10 February 2017.
  5. "Pacer Mansi Joshi bowls her way into Top 30 Under 30 at HT Youth Forum 2017".
  6. Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
  7. World Cup Final, BBC Sport, 23 July 2017.
  8. England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.
  9. "Indian Women's Team for ICC Women's World Twenty20 announced". Board of Control for Cricket in India. Archived from the original on 28 సెప్టెంబరు 2018. Retrieved 28 September 2018.
  10. "India Women bank on youth for WT20 campaign". International Cricket Council. Retrieved 28 September 2018.
  11. "Mansi Joshi". ESPN Sports Media. Retrieved 3 August 2023.