మామిడాల జగదీశ్ కుమార్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, నిర్వాహకుడు, రచయిత.

మామిడాల జగదీశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, రచయిత, ప్రొఫెసర్. 2021 జనవరి నుండి న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)కు తాత్కాలిక వైస్-ఛాన్సలర్‌గా ఉన్నాడు. ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు.[1] [2] 2016 జనవరిలో సుధీర్ కుమార్ సోపోరి నుండి జెఎన్‌యుకు వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు.[3][4] 2022, ఫిబ్రవరి 4న యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చైర్‌పర్సన్ నియమించబడ్డాడు.[5]

మామిడాల జగదీశ్ కుమార్
జననంమామిడాల, తిప్పర్తి మండలం
నల్గొండ జిల్లా, తెలంగాణ
నివాసంన్యూఢిల్లీ
జాతీయతభారతీయుడు
రంగములుఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
వృత్తిసంస్థలుజెఎన్‌యు (న్యూఢిల్లీ)
చదువుకున్న సంస్థలుఐఐటి (మద్రాస్)
వాటర్‌లూ విశ్వవిద్యాలయం (కెనడా)
ముఖ్యమైన పురస్కారాలుఐఎస్ఏ-విఎస్ఐ టెక్నోమెంటర్ అవార్డు

జననం, విద్య

మార్చు

జగదీశ్ కుమార్, రంగారావు - జయప్రదాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో జన్మించాడు. జగదీశ్ తండ్రి 1994లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశాడు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్, పిహెచ్‌డి పూర్తిచేసాడు. 1991 నుండి 1994 వరకు కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధనను కొనసాగించాడు.[1][6] నానోసైన్స్, నానోటెక్నాలజీ (నానో-ఎలక్ట్రానిక్ పరికరాలు, నానోస్కేల్ పరికరాలు, డివైజ్ డిజైన్, పవర్ సెమీకండక్టర్ పరికరాలు) విభాగంలో కూడా పనిచేశాడు.[1][7]

వృత్తిరంగం

మార్చు

ప్రస్తుతం ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఫెలోగా ఉన్నాడు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు అందజేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నానో డివైసెస్ అండ్ సిస్టమ్స్‌కి చీఫ్ ఇన్వెస్టిగేటర్‌గా కూడా ఉన్నాడు.[8]

జెఎన్‌యు వైస్-ఛాన్సలర్‌గా

మార్చు

రామేశ్వర్ నాథ్ కౌల్ బమేజాయ్, వీరందర్ సింగ్ చౌహాన్, రామకృష్ణ రామస్వామితోపాటు మరో నలుగురి తరువాత జెఎన్‌యు వైస్-ఛాన్సలర్‌గా ఎంపికయ్యాడు.[9] వైస్-ఛాన్సలర్‌గాగా ఉన్న సమయంలో 2016లో విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం, 2020 జెఎన్‌యు దాడుల వంటి అనేక వివాదాల అంశాలలో వార్తల్లో నిలిచాడు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలుచేస్తున్నాడని, అందుకే ఆయనను వీసీగా నియమించారని విమర్శలు కూడా వచ్చాయి.[10] [11] 2020 జనవరిలో జెఎన్‌యుపై జరిగిన దాడుల తర్వాత జెఎన్‌యు విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామాకు పిలుపునిచ్చాయి.[10]

యూజీసీ చైర్మన్‌గా

మార్చు

2016 జూన్ 24 నుండి 2019 జూన్ 23 వరకు మూడేళ్ళపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో సభ్యునిగా ఉన్నాడు. 2017 జనవరి 14 నుండి 2017 ఫిబ్రవరి 2 వరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇంఛార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2022, ఫిబ్రవరి 4న యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చైర్‌పర్సన్ నియమించబడ్డాడు. యూజీసీ చైర్మన్‌ పదవికి మొత్తం 55 మంది వరకు దరఖాస్తు చేసుకోగా, అందులో ఏడుగురిని కమిటీ ఎంపికచేసింది. ఆ ఏడుగురు ఫిబ్రవరి 3న ఢిల్లీలో కమిటీ ముందు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత కమిటీ ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపగా, కేంద్రం జగదీశ్‌ కుమార్‌ను చైర్మన్ గా ఎంపిక చేసింది. తెలుగువారిలో 1961లో వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991-1995 మధ్యకాలంలో జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, జగదీశ్‌ కుమార్‌ మూడోవ్యక్తి.[12]

గ్రంథాలు

మార్చు

పరిశోధక విద్యార్థులతో కలిసి మూడు పుస్తకాలను రచించాడు:

  • మామిడాల జగదీశ్ కుమార్, ప్రత్యూష్ పాండే, రజత్ విష్ణోయ్ (నవంబరు 2016). టన్నెల్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్‌లు: మోడలింగ్ అండ్ సిమ్యులేషన్. విలే, యుకె
  • మామిడాల జగదీశ్ కుమార్, స్నేహ సౌరభ్ (నవంబరు 2016). టన్నెల్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్‌ల ఫండమెంటల్స్. సిఆర్సీ ప్రెస్ (టేలర్ & ఫ్రాన్సిస్)
  • మామిడాల జగదీశ్ కుమార్, శుభమ్ సహాయ్ (ఫిబ్రవరి 2019). జంక్షన్‌లెస్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్‌లు: డిజైన్, మోడలింగ్ అండ్ సిమ్యులేషన్. విలే-ఐఈఈఈ ప్రెస్, యుఎస్ఏ

అవార్డులు, పురస్కారాలు

మార్చు

2007 జూలై 31న భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ ఆర్. చిదంబరం చేతులమీదుగా "ఐఎస్ఏ-విఎస్ఐ టెక్నోమెంటర్ అవార్డు" (ప్రశంసాపత్రం, రూ. 2,00,000 నగదు) అందుకున్నాడు.[1] ఢిల్లీ ఐఐటి నుండి 2013 అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అవార్డు అందుకున్నాడు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ (31 అక్టోబర్ 2006) రంగంలో విశేష కృషి చేసినందుకు 29వ ఐఈటిఈ రామ్ లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. 2008 ఐబిఎం ఫ్యాకల్టీ అవార్డు గ్రహీత అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

జగదీశ్ కుమార్ కు 1990లో లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (సాకేత్, కార్తీక్).[13]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Profile Prof. M. Jagadesh Kumar" (PDF). Institute of Cost Accountants of India. Archived (PDF) from the original on 7 January 2020. Retrieved 4 February 2022.
  2. "IIT Professor Jagadeesh Kumar Takes Over As JNU Vice Chancellor". NDTV. PTI. 27 January 206. Retrieved 4 February 2022.{{cite web}}: CS1 maint: others (link) CS1 maint: url-status (link)
  3. "RSS Linked IIT-D Professor Set to Be Next JNU VC ?". The Citizen. 21 January 2016. Archived from the original on 7 January 2020. Retrieved 4 February 2022.
  4. "Professor from IIT Delhi, a Karate Expert, Chosen as JNU Vice-chancellor". The New Indian Express. Retrieved 4 February 2022.
  5. "JNU V-C M Jagadesh Kumar is new UGC Chairman". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-02-04. Retrieved 4 February 2022.
  6. "Prof. M. Jagadesh Kumar" (PDF). Indian Institute of Science. Archived from the original (PDF) on 7 January 2020. Retrieved 4 February 2022.
  7. "A detailed report on the IEEE International Conference on Circuits, Systems, Communication and Information Technology Applications (CSCITA 2014)" (PDF). St. Francis Institute of Technology (SFIT). p. 3. Archived from the original (PDF) on 4 ఫిబ్రవరి 2022. Retrieved 4 February 2022.
  8. telugu, NT News (2022-02-04). "యూజీసీ చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ". Namasthe Telangana. Archived from the original on 2022-02-05. Retrieved 2022-02-05.
  9. "Professor M Jagadesh Kumar appointed JNU Vice Chancellor". CFO India. Archived from the original on 4 ఫిబ్రవరి 2022. Retrieved 4 February 2022.
  10. 10.0 10.1 "JNU VC Jagadesh Kumar and his many controversies: Now, student union wants him out". The Week. 6 January 2020. Retrieved 4 February 2022. His detractors say the vice chancellor, who took charge in January 2016, is implementing the agenda of the RSS and has been brought in by the Union government specifically for this purpose. However, he has repeatedly disavowed associations with any organisation.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. Bal, Hartosh Singh (1 April 2019). "How the RSS is infiltrating India's intellectual spaces". The Caravan. Retrieved 4 February 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "UGC New Chairman: యూజీసీ నూతన చైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియామకం". Zee News Telugu. 2022-02-04. Archived from the original on 2022-02-04. Retrieved 2022-02-04.
  13. "About Myself (Jagadeesh Kumar)". Mamidala Jagadesh Kumar (in ఇంగ్లీష్). 2011-04-02. Retrieved 2022-02-04.